ప్రార్థనా స్థలాల చట్టం-1991 రద్దు చేయద్దు: జ్ఞానవాపి మసీదు కమిటీ

దేశంలో స్వతంత్రం వచ్చే నాటికి ఉన్న ప్రార్థన స్థలాలను మార్చకుండా అలాగే ఉండాలని తీసుకువచ్చిన చట్టం అలాగే ఉండాలని జ్ఞానవాపి మసీదు నిర్వహణ కమిటీ సుప్రీంకోర్టులో..

By :  491
Update: 2024-12-07 08:00 GMT

ప్రార్థన స్థలాల చట్టం( ప్రత్యేక నిబంధనలు) -1991 రాజ్యాంగ విరుద్దమని ఇంతకుముందు సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ లను వ్యతిరేకిస్తూ జ్ఞానవాపి మసీదు నిర్వహణ కమిటీ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

1991 చట్టం ఏదైనా ప్రార్థనా స్థలాన్ని మార్చడాన్ని నిషేధిస్తుంది. ఆగస్టు 15, 1947న తరువాత ఉన్న అన్ని మతపరమైన కట్టడాలన్నీ అలాగే కొనసాగుతాయి. కానీ ఈ కేసు కేవలం అయోధ్య- బాబ్రీ మసీదుకు మాత్రం వర్తించవని చట్టంలో పేర్కొన్నారు.
అయితే ఈ చట్టంలోని కొన్ని నిబంధనలపై హిందువులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ ప్రముఖ న్యాయవాదీ అశ్విని ఉపాధ్యాయ, రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రమణ్య స్వామి తో పాటు పలువురు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఇలా దాఖలైన ఆరు పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం వద్ద ఉన్నాయి. దీనిపై ప్రత్యేక రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
వారణాసిలోని అంజుమన్ ఇంతేజామియా మసాజిద్, వారణాసిలోని మేనేజ్‌మెంట్ కమిటీ, న్యాయవాది ఫుజైల్ అహ్మద్ అయ్యూబీ ద్వారా దాఖలు చేసిన పిటిషన్‌లో, 1991 చట్టానికి వ్యతిరేకంగా పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌లు కేవలం మాటల ఆధారంగా మాత్రమే ఉన్నాయని వాటిని కొట్టి వేయాలని పిటిషన్ లో కోరారు.
ఇవన్నీ కూడా మత సామరస్యం, చట్టపాలనకు భంగం కలిగిస్తాయని తెలిపింది. ఇంతకుముందు దేశాన్ని పాలించిన పాలకుల ఉద్దేశాలను కోర్టు పరిష్కరించదని అన్నారు. 1991 చట్టం "భారత రాజకీయాల లౌకిక లక్షణాలను రాజ్యాంగ నిబద్ధతను అమలు చేయడానికి రూపొందించబడిన శాసన సాధనం" అని పేర్కొంది.
మసీదు కమిటీ సంభాల్ కేసు వంటి సంఘటనలను ఉటంకిస్తూ, చట్టాన్ని తారుమారు చేస్తే ఇటువంటి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ఈ చట్టాన్ని రద్దు చేయడం వల్ల దేశవ్యాప్తంగా మతపరమైన ప్రదేశాలపై వివాదాలు పెరిగే అవకాశం ఉందని, మత సామరస్యాన్ని బెదిరిస్తూ "ప్రతి మూలలో" ఉద్రిక్తతలు తలెత్తుతాయని కమిటీ హెచ్చరించింది.
మథురలోని షాహీ ఈద్గా మసీదు, ఢిల్లీలోని కుతుబ్ మినార్ సమీపంలోని ఖువాత్-ఉల్-ఇస్లాం మసీదు, మధ్యప్రదేశ్‌లోని కమల్ మౌలా మసీదుతో సహా వివిధ మసీదులు, దర్గాలు (పుణ్యక్షేత్రాలు) గురించి సంవత్సరాల తరబడి చేసిన వివాదాస్పద వాదనలను కూడా ఈ పిటిషన్ లో జతపరిచారు.
కేంద్రానికి అప్పట్లో నోటీసులు..
జనవరి 9, 2023న, అత్యున్నత న్యాయస్థానం ప్రార్థన స్థలాల ప్రస్తుత రూపును మార్చకుండా ఉన్న చట్టంలోని కొన్ని నిబంధనలపై తమ స్పందన తెలియాజేయాలని కోరుతూ నోటీసులు జారీ చేసింది.
ఉపాధ్యాయ్ తన పిల్‌లో, ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనలు) చట్టం, 1991లోని సెక్షన్‌లు 2, 3, 4ని వివిధ కారణాలపై పక్కన పెట్టాలని కోరాడు, ఈ నిబంధనలు ఆరాధనా స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే న్యాయపరమైన పరిష్కార హక్కును తొలగించాయని ఇది ప్రాథమిక హక్కులకు విరుద్దమని చెప్పారు.
చట్టంలోని కొన్ని నిబంధనల చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను తీర్పు కోసం ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి పంపవచ్చని కూడా అత్యున్నత న్యాయస్థానం సూచించింది. వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు, మథురలోని షాహీ ఈద్గా మసీదుపై హిందువులు దావా వేయడానికి వీలుగా కొన్ని నిబంధనలను సవరించాలని సుబ్రమణ్యస్వామి కోరగా, మొత్తం చట్టమే రాజ్యాంగ విరుద్దంగా ప్రకటించాలని ఉపాధ్యాయ కోరారు.
1991 చట్టం "ఫండమెంటలిస్ట్-అనాగరిక ఆక్రమణదారులు, చట్టాన్ని ఉల్లంఘించేవారి" ఆక్రమణలకు వ్యతిరేకంగా ప్రార్థనా స్థలాలు లేదా తీర్థయాత్రల స్వభావాన్ని కొనసాగించడం కోసం ఆగష్టు 15, 1947 నాటి "ఏకపక్ష, అహేతుకమైన రెట్రోస్పెక్టివ్ కట్-ఆఫ్ తేదీ"ని సృష్టించిందని పిటిషన్ దారులు ఆరోపించారు.


Tags:    

Similar News