ఓపెన్ ఏఐ విజిల్ బ్లోయర్ సుచిర్ బాలాజీ ఆత్మహత్య?
సొంత ఫ్లాట్ లో అచేతన స్థితిలో కనిపించిన మాజీ ఉద్యోగి;
By : Praveen Chepyala
Update: 2024-12-14 07:28 GMT
ఓపెన్ ఏఐ కంపెనీ అనైతిక చర్యలకు పాల్పడుతుందని బయటి ప్రపంచానికి తెలియజేసిన మాజీ ఉద్యోగి, విజిల్ బ్లోయర్ గా పేరు గాంచిన 26 ఏళ్ల సుచిర్ బాలాజీ ఆత్మహత్య చేసుకున్నాడు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్ స్కో లోని తన ఫ్లాట్ లో అతను శవం లభించింది.
చాలా రోజుల నుంచి స్నేహితులు, బంధువుల అందుబాటులో ఉండకపోవడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సంబంధిత అధికారులు వచ్చి సుచిర్ ఫ్లాట్ లో చూడగా ఈ యువ విజిల్ బ్లోయర్ అచేతన స్థితిలో కనిపించాడు.
నవంబర్ 26నే సుచిర్ ఆత్మహత్య చేసుకున్నట్లు వైద్యులు కూడా ధృవీకరించారు. ఈ మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని, హత్య అని చెప్పడానికి ఆధారాలు లభించలేదని శాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్ పోలీసు ప్రకటన ఉటంకిస్తూ పేర్కొంది.అనంతరం నగరంలోని చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయ డైరెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. సుచిర్ ది ఆత్మహత్యగా నిర్ధారించినట్లు తెలిపారు.
OpenAI కాపీరైట్ ఉల్లంఘనలకు పాల్పడుతోంది: సుచిర్
సుచిర్ బాలాజీ ఈ ఏడాది ఆగస్టులో ఓపెన్‌ఏఐకి రాజీనామా చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ కాపీరైట్ ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపించారు. కంపెనీ తన ఉత్పాదక AI ప్రోగ్రామ్ ChatGPTకి శిక్షణ ఇవ్వడానికి సరైన అనుమతి లేకుండా కాపీరైట్ చేసిన మెటీరియల్‌ని ఉపయోగిస్తోందని అతను బహిరంగంగా ఆరోపించాడు. చాట్‌జీపీటీ వంటి సాంకేతికతలు ఇంటర్నెట్‌ను దెబ్బతీస్తున్నాయని ఆయన ఆరోపించారు.
సుచిర్, న్యూయార్క్ టైమ్స్‌కి ఇంటర్వ్యూ ఇస్తూ.. OpenAI పద్ధతులు ఇంటర్నెట్ పర్యావరణ వ్యవస్థకు హానికరమని వాదించారు. వ్యక్తుల అనుమతి లేకుండా డేటాను ఉపయోగించిన వ్యాపారాలు, వ్యక్తులకు హానికరంగా మారతాయని అప్పట్లో వ్యాఖ్యానించడం సంచలనం రేపింది.
I recently participated in a NYT story about fair use and generative AI, and why I'm skeptical "fair use" would be a plausible defense for a lot of generative AI products. I also wrote a blog post (https://t.co/xhiVyCk2Vk) about the nitty-gritty details of fair use and why I…
— Suchir Balaji (@suchirbalaji) October 23, 2024
అక్టోబర్ 24న సుచిర్ చేసిన ఒక ఎక్స్ పోస్టులో “నేను ఇటీవల ఫెయిర్ యూజ్, జెనరేటివ్ AI గురించి NYT కథనంలో పాల్గొన్నాను. నేను 'ఫెయిర్ యూజ్' ఎందుకు సందేహాస్పదంగా ఉందో పేర్కొన్నాను, ఇది చాలా ఉత్పాదక AI ఉత్పత్తులకు ఆమోదయోగ్యమైన రక్షణగా ఉంటుంది ” అని రాసుకొచ్చారు.
ఇలాన్ మస్క్ విచిత్ర స్పందన
సుచిర్ బాలాజీ ఊహించని మరణం పట్ల పలువురు వ్యక్తులు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అయితే అన్నింటికి భిన్నంగా టెస్లా సీఈఓ కేవలం‘ హ్మ్’ అని మాత్రమే ట్వీట్ చేశారు.
— Elon Musk (@elonmusk) December 14, 2024
OpenAIని 2015లో ఎలోన్ మస్క్, సామ్ ఆల్ట్‌మాన్ కలిసి స్థాపించారు. మస్క్ 2018లో కంపెనీని విడిచిపెట్టి మరో స్టార్టప్ xAIని స్థాపించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. గత నెల, మస్క్ OpenAI ఒక గుత్తాధిపత్యం అని ఆరోపించారు.
(ఆత్మహత్యలను నివారించవచ్చు. సహాయం కోసం దయచేసి ఆత్మహత్య నివారణ హెల్ప్‌లైన్‌లకు కాల్ చేయండి: నేహా ఆత్మహత్య నివారణ కేంద్రం - 044-24640050; ఆత్మహత్య నివారణ, భావోద్వేగ మద్దతు & గాయం సహాయం కోసం ఆసరా హెల్ప్‌లైన్ - +91-9820466726; కిరణ్, మానసిక ఆరోగ్య పునరావాసం - 590000 0019, దిశ 0471- 2552056, మైత్రి 0484 2540530, మరియు స్నేహ ఆత్మహత్యల నివారణ హెల్ప్‌లైన్ 044-24640050.)