భారతీయుల విడుదలకు రష్యా అంగీకారం..

ఉద్యోగాలు, చదువుల ఆశతో రష్యాకు వెళ్లిన అనేక మంది భారతీయులు బలవంతంగా రష్యా సైనికులకు సహాయకులుగా పనిచేస్తున్నారు. వీరిని తిరిగి భారత్ కు రష్యా అంగీకరించింది.

Update: 2024-07-09 12:35 GMT

భారతీయులను విడుదల చేసేందుకు మాస్కో అంగీకరించింది. ఇండియా తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు ఇరు దేశాధినేతలు మోదీ, పుతిన్‌ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఉద్యోగాలు, చదువుల ఆశతో రష్యాకు వెళ్లిన అనేక మంది భారతీయులు అనూహ్య పరిస్థితుల్లో అక్కడి ఆర్మీ వద్ద చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వీరు ప్రస్తుతం ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో మాస్కో సైన్యానికి సహాయకులుగా పని చేస్తున్నారు.

ఇలా పనిచేస్తున్న వారిలో నలుగురు భారతీయులు మరణించారు. కొంతమంది తమ దుస్థితిని వివరిస్తూ గతంలో వీడియోలు విడుదల చేశారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. దాదాపు 30 నుంచి 40 మంది భారతీయులు రష్యా సైన్యంలో పనిచేస్తున్నారు. ఇప్పటివరకు 10 మంది భారతీయులను వెనక్కి తీసుకొచ్చారు. రష్యా ఆర్మీ సైనికులకు సహాయకులుగా పనిచేస్తున్న ఇద్దరు భారతీయులు చనిపోయారని గత నెలలో విదేశీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. వీరి మరణంతో బలవంతంగా సైన్యంలో చేర్చుకోవడం నిలిపేయాలని భారత్ కోరింది.

ఈ ఏడాది మార్చిలో 30 ఏళ్ల హైదరాబాద్ నివాసి మహ్మద్ అస్ఫాన్ సైన్యంలో విధులు నిర్వహిస్తూ గాయాలతో చనిపోయాడు. ఫిబ్రవరిలో గుజరాత్‌లోని సూరత్‌లో నివసిస్తున్న 23 ఏళ్ల హేమల్ అశ్విన్‌భాయ్ వైమానిక దాడిలో మరణించాడు.

Tags:    

Similar News