‘సమస్యకు యుద్ధభూమిలో పరిష్కారం దొరకదు’

యురేషియా, పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రం మోదీ కోరారు.

Update: 2024-10-11 10:22 GMT

యురేషియా, పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రం మోదీ కోరారు. ఉక్రెయిన్- రష్యా మధ్య విభేదాలు, పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వియాత్నాంలో జరుగుతున్న 19వ తూర్పు ఆసియా సదస్సులో మోదీ పాల్గొన్నారు. తాను గౌతమ బుద్ధుడు జన్మించిన దేశం నుంచి వచ్చానని చెబుతూ యుద్ధరంగంలో సమస్యలకు పరిష్కారం దొరకదన్నారు.

మన విధానం అభివృద్ధి వైపు ఉండాలి, విస్తరణ వైపు కాదని హితవు పలికారు. ప్రపంచంలో ఏ దేశానికైనా ఉగ్రవాదం అతిపెద్ద సవాల్ అని, దాన్ని ఎదుర్కోడానికి అన్ని దేశాల సహకారం అవసరమన్నారు. సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ.. చర్చలకు, దౌత్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. తన ప్రసంగం ప్రారంభంలో ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో ఆగ్నేయాసియా, దక్షిణ చైనాపై ప్రభావం చూపిన విధ్వంసక ఉష్ణమండల తుఫాను “టైఫూన్ యాగీ”లో మృత్యువాతపడ్డ ప్రజలకు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. క్లిష్ట సమయాల్లో ఆపరేషన్ సద్భావ్ ద్వారా సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉంటుందని చెప్పారు.

Tags:    

Similar News