నాలుగేళ్ల క్రితం చిక్కినట్లే చిక్కి తప్పించుకున్న మెహుల్ చోక్సి

రెండు సంవత్సరాలుగా బెల్జియంలోనే తప్పుడు పత్రాలతో మకాం, స్విట్జర్లాండ్ కు పారిపోతున్నాడని తెలియడంతో అప్రమత్తం;

Translated by :  Praveen Chepyala
Update: 2025-04-14 13:31 GMT
మెహుల్ చోక్సి

భారత్ లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను రూ. 12 వేల కోట్లకు మోసం చేసి పరారీ అయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సి ని ఈ రోజు బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు.

గత ఏడు సంవత్సరాలుగా ఈ నిందితుడిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన భారత ఏజెన్సీలు ప్రపంచ వ్యాప్తంగా రహస్య ఆపరేషన్ లు నిర్వహిస్తూ అతని కదలికలను నిశితంగా గమనించాయి. ముఖ్యంగా సీబీఐ, ఈడీ వంటి సంస్థలు భారీగా వేటను కొనసాగించి, పక్కా ప్రణాళికతో వ్యవహరించాయి.

కుంభకోణం ఏమిటీ?
గీతాంజలి గ్రూప్ యజమాని తన మేనల్లుడు నీరవ్ మోదీ, అతని భార్య అమీ మోదీ, సోదరుడు నీషాల్ మోదీతో కలిసి ప్రభుత్వ ఆధ్వర్యంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో రూ. 12, 636 కోట్లు మోసం చేశారు. ఈ భారీ మోసం వెలుగులోకి రావడానికి ముందే 65 ఏళ్ల చోక్సి దేశం విడిచి పారిపోయాడు.
అతను ఇంతకుముందు పెట్టుబడి పెట్టిన కార్యక్రమం కింద ఆంటిగ్వాకు లో పౌరసత్వం పొందటంతో అక్కడికే పారిపోయాడు. అక్కడి నుంచి తీసుకురావడం భారత్ కు కష్టమైంది. కరేబియన్ దీవులతో భారత్ కు ఎలాంటి నేరస్థుల అప్పగింత ఒప్పందం లేకపోవడంతో అతను ఇక్కడిని తీసుకురాలేకపోయారు.
ఎలా పట్టుకున్నారు..
చోక్సి బెల్జియంలో ఉన్నాడని రెండు సంవత్సరాల క్రితమే భారత దర్యాప్తు సంస్థలకు తెలిసింది. దీనితో ఏజెన్సీలు వెంటనే స్థానిక అధికారులను అప్రమత్తం చేశారు. భారీ బ్యాంకు మోసం అతని పాత్రను వివరించే సమగ్రపత్రాలను అక్కడికి పంపించారు.
చోక్సి క్యాన్సర్ చికిత్స కోసం స్విట్జర్లాండ్ కు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు భారత అధికారులు అందించిన సమాచారం మేరకు అక్కడి వ్యవస్థలను అప్రమత్తం చేశారు. దీనితో బెల్జియం పోలీసులు వేగంగా చర్యలు తీసుకున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అతని భార్య ప్రీతి బెల్జియం పౌరురాలు.
కొన్ని నివేదికల ప్రకారం.. చోక్సి గత ఏడాది బెల్జియం నుంచి ‘ఎఫ్’ కేటగిరీ రెసిడెన్సీ కార్డు పొందడానికి నకిలీ పత్రాలను సమర్పించాడు. తనకు నివాస సదుపాయం కల్పించడానికి మానవతా కారణాలు, క్లిష్టమైన వైద్య పరిస్థితులను తప్పుగా చూపించుకున్నాడు.
అలాగే భారత్, ఆంటిగ్వా పౌరుడని కూడా అక్కడి అధికారులకు తెలపలేదు. అంతకుముందు చోక్సి న్యాయవాదీ ముంబై కోర్టులో మాట్లాడుతూ... తాను రక్త క్యాన్సర్ చికిత్స కోసం బెల్జియం లో ఉన్నందున భారత్ కు రాలేనని చెప్పాడు.
చోక్సి తనకు లభించిన ఎఫ్ కేటగిరి రెసిడెన్సీ గుర్తింపును ‘ఎఫ్ ప్లస్’ గా అప్ గ్రేడ్ చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నాడని భారత అధికారులకు సమాచారం అందించింది. దీనితో దర్యాప్తు సంస్థలు వెంటనే అప్రమత్తమయ్యాయి.
ఒకవేళ ఎఫ్ ప్లస్ రెసిడెన్సీ అవకాశం వస్తే చోక్సిని అప్పగించడం కష్టం అయ్యేది. అయితే అధికారుల అప్రమత్తతో అతడిపై ముంబై కోర్టు జారీచేసిన రెండు నాన్ బెయిలబుల్ వారెంట్ల ఆధారంగా ఆంట్వెర్ప్ లో అదుపులోకి తీసుకున్నారు.
బెల్జియంలో ఇప్పుడు అధికారికంగా అప్పగింత ప్రక్రియను ప్రారంభించడానికి ఈడీ, సీబీఐ ఇప్పుడు సన్నాహాలు చేస్తున్నాయి.
కోర్టులో పిటిషన్..
ప్రస్తుతం బెల్జియం జైలులో ఉన్ చోక్సి బెయిల్ విచారణ వారం తరువాత జరిగే అవకాశం ఉంది. తన క్లయింట్ ను శనివారం బెల్జియం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన తరఫున వాదిస్తున్న విజయ్ అగర్వాల్ తెలిపారు.
‘‘ప్రస్తుతం అతను జైలులో ఉన్నాడు. అక్కడ( బెల్జియం) బెయిల్ దరఖాస్తు చేసుకోకుండా అప్పీల్ దాఖలు చేయడమే విధానం. ఆ అప్పీల్ సమయంలో అతన్ని నిర్భంధంలో ఉంచకూడదని, కస్టడీలో లేనప్పుడూ తనను తాను సమర్థించుకోవడానికి, అప్పగించే అభ్యర్థనను వ్యతిరేకించడానికి అనుమతి ఇవ్వాలని అభ్యర్థించాము’’ అని అగర్వాల్ విలేకరులతో అన్నారు.
చోక్సిని తక్షణమే విడుదల చేయాలని, అతడికి క్యాన్సర్ సోకిందని, దానికి చికిత్స తీసుకుంటున్నాడని తెలిపారు. ఇది అప్పీల్ చేయడానికి స్పష్టమైన కారణం అన్నారు. ఇది రాజకీయ కేసని, భారతీయ జైళ్లలో పరిస్థితి బాగా లేదని ఆరోపించారు.
అయితే చోక్సిని అరెస్ట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. 2021 లో అక్రమంగా ప్రవేశించాడని ఆరోపిస్తూ డొమినిక్ రిపబ్లిక్ లో అతడిని అరెస్ట్ చేశారు. ఇది తరువాత చట్టపరమైన పోరాటాలకు దారితీసింది. అతన్ని అప్పగించడానికి ఒక ప్రత్యేక సీబీఐ బృందాన్ని పంపారు.
కానీ అతని న్యాయవాదులు వైద్య కారణాలను చూపుతూ కేసు వాదించడంతో తిరిగి కరేబియన్ దీవులకు రావడానికి మార్గం సుగమమైంది. తరువాత బ్రిటిష్ ప్రీవీ క్వీన్స్ కౌన్సిల్ అతనికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో 51 రోజుల పాటు జైలు జీవితం గడిపినప్పటికీ తిరిగి ఆంటిగ్వాకు చేరుకున్నారు.


Tags:    

Similar News