‘విద్యార్థుల సంపూర్ణ వికాసానికి కీలక నిర్ణయం’

విద్యార్థుల సమగ్ర వికాసానికి వినూత్నంగా ఆలోచించారు. నెలలో ఒకరోజు పూర్తిగా కో-కరిక్యులర్ యాక్టివిటీస్‌ చేయించాలని నిర్ణయం తీసుకున్నారు.ఇలా చేస్తున్నది ఎక్కడంటే..

Update: 2024-07-14 10:20 GMT

పంజాబ్‌లోని ఫజిల్కా జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి, ఒత్తిడి లేని అభ్యాసం కోసం 'బ్యాగ్-ఫ్రీ డే' కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద విద్యార్థులు ప్రతి నెలా చివరి శనివారం స్కూల్ బ్యాగులు తీసుకురావాల్సిన అవసరం లేదని ఫజిల్కా జిల్లా విద్యాశాఖ అధికారి శివ్ పాల్ తెలిపారు.

'బ్యాగ్-ఫ్రీ' రోజు రెగ్యులర్ తరగతులు ఉండవని, సాంప్రదాయ తరగతులకు బదులుగా రాఫ్టింగ్, స్టోరీటెల్లింగ్, క్లాస్ డిస్కషన్స్, యోగా వంటి కో-కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయని చెప్పారు.

"బ్యాగ్ లేని రోజున విద్యార్థులు స్కూల్ బ్యాగ్స్ తీసుకురారు. ఆ రోజు సరదాగా ఉండే కార్యక్రమాలు ఉంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఏమిటి? మంచి, మర్యాద గురించి, ఇతరులతో వ్యవహరించడం ఎలాగో నేర్పుతారు’’ అని ఫజిల్కా డిప్యూటీ కమిషనర్ సేను దుగ్గల్ పేర్కొన్నారు.

కొద్ది రోజుల క్రితం అబోహర్‌లోని ఏక్తా కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

"బ్యాగ్-ఫ్రీ డే' కార్యక్రమం విద్యార్థులు ఇంటరాక్టివ్ అవ్వడానికి దోహదపడతుంది. ఈ కార్యక్రమం పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యానికి ఒక వరం అవుతుంది" అని పేర్కొన్నారు. పాఠ్యపుస్తకాలకు మించిన సమగ్ర విద్యా విధానం కోసం జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. ఫజిల్కాలో 468 ప్రాథమిక పాఠశాలలు 72,000 మంది విద్యార్థులను ఉన్నాయని శివ్ పాల్ చెప్పారు.

Tags:    

Similar News