సంస్థకు ఈయన పేరు ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయినప్పటికీ ట్రంప్ నిర్ణయానికి అమెరికా కాంగ్రెస్ తన ఆమోదముద్ర వేసింది. ఈయన ట్రంప్ కు గట్టి మద్ధతుదారుగా పేరుంది.
ట్రంప్, కాష్ పటేల్ ను ‘‘అమెరికన్ ఫస్ట్ ఫైటర్’’ గా ప్రశంసించారు. దీనిబట్టి ఆయన సామర్థ్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు. తన నియామకం తరువాత పటేల్ మాట్లాడుతూ.. ఏజెన్సీ పునర్మిస్తానని, ప్రజల్లో నమ్మకం కలిగిస్తానని హమీ ఇచ్చారు.
సంస్థకు ఉన్న 38 వేల మందికి ఆయన ఇక నుంచి అధిపతి. అయితే ఆయన నియామకం తరువాత చేసిన ప్రసంగం ప్రతిపక్ష డెమోక్రాటిక్ గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. ట్రంప్ వ్యతిరేక వర్గాన్ని వెంట పడతానని ఆయన చేసిన హెచ్చరిక మీడియాతోనూ, డీప్ స్టేట్ లోనూ కలవరం పుట్టిస్తున్నాయి.
అలాగే అమెరికన్లకు హనీ చేసే వారు ఈ ప్రపంచంలో ఎక్కడు ఉన్నా వేటాడతామని కూడా హెచ్చరించారు. తమకు అమెరికానే ఫస్ట్ అని ఉద్ఘాటించారు.
ఎవరీ కాష్ పటేల్..
గుజరాత్ నుంచి వచ్చిన వలసదారులకు 1980 లో న్యూయార్క్ లో జన్మించారు. తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. అమెరికాలోనే రిచ్ మండ్ యూనివర్శిటీలో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తరువాత ఆఫ్రికా వెళ్లారు. లండన్ లోని యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్ ఫ్యాకల్టీలో న్యాయవిద్యను పూర్తి చేశారు.
ప్రారంభంలో లాయర్ గా కెరీర్ ప్రారంభించారు. పబ్లిక్ ఢిపెండర్ గా నార్కో ట్రాఫికింగ్ కేసులలో ఫెడరల్ కోర్టులలో సమర్థవంతంగా వాదనలు వినిపించారు.
ట్రంప్ దృష్టిలో పడిన పటేల్..
ట్రంప్ మొదటి టర్మ్ లో హౌజ్ ఇంటలిజెన్స్ కమిటీలో స్టాప్ మెంజెర్ గా కాష్ పటేల్ పనిచేశారు. అయితే అప్పుడు అమెరికా ఎన్నికల్లో రష్యా పాత్రపై ఎఫ్ బీఐ చేస్తున్న దర్యాప్తును ఆయన ప్రశ్నిస్తూ లేఖ రాశారు.
దర్యాప్తు సంస్థ అధ్యక్ష అభ్యర్థిగా ఉన్నప్పుడూ, అధ్యక్షుడిగా మారిన తరువాత జరిగిన దర్యాప్తు తీరును ప్రశ్నించడం ద్వారా ‘మగా’ సర్కిల్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ట్రంప్ పై శాశ్వతంగా కేసును విచారించాలనే ఎఫ్బీఐ కంకణం కట్టుకుందని ఆయన సునితంగా విమర్శలు చేశారు.
కమిటీలో పనిచేసినప్పుడూ ఐసిస్, అల్ ఖైదా నాయకత్వం ఏరీవేయడం, ఖాసీం సులేమని అంతం చేయడం అనేక మంది అమెరికన్ పౌరులను సురక్షితంగా స్వదేశానికి రప్పించిన మిషన్లలో ఆయన చురుకైన పాత్ర పోషించడం కూడా ప్రస్తుతం కలిసొచ్చింది.
భారత్ పై గౌరవం..
పటేల్ అమెరికాలో పుట్టి, పెరిగినప్పటికీ భారత్ అంటే అమితమైన గౌరవం, ఇష్టం. భారత సాంప్రదాయాలు విలువల తన కెరీర్ లో కీలకపాత్ర పోషించాయని తరుచుగా ప్రస్తావిస్తూ ఉంటారు. సెనెట్ ఈ పదవి కోసం పటేల్ ను విచారిస్తున్న సందర్భంలో తనకు తోడుగా తల్లిదండ్రులతో పాటు చెల్లెలు, స్నేహితురాలు అలెక్సీస్ ఉన్నారు.
సెనెట్ జ్యూడిషియరీ కమిటీ విచారణ సందర్భంగా తన తల్లిదండ్రుల కాళ్లను మొక్కిన పటేల్.. కూర్చున్న తరువాత తల్లిదండ్రులను పరిచయం చేస్తూ వారి వైపు తిరిగి ‘ జై శ్రీ కృష్ణ’ అన్నారు. తన గర్ల్ ఫ్రెండ్ తో అతను 2023 ప్రారంభం నుంచి డేటింగ్ లో ఉన్నారు. అలెక్సీ ప్రస్తుతం రిపబ్లిక్ పార్టీ ఎంపీ అబ్రహామ్ హమాడే కి ప్రెస్ సెక్రటరీగా ఉన్నారు.
రెసిజం ఎదుర్కొన్నారు..
తాను చిన్నప్పుడు నివసించిన ప్రదేశంలో రేసిజం ఎదుర్కొన్నానని సెనెటర్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే ఆ దురదృష్టకర విషయాల్లోని తాను వెళ్లడానికి సిద్దంగా లేన్నారు.
తనది ఈ దేశం కాదని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరించినట్లు చెప్పారు. తనను ‘‘సాండ్ నిగ్గర్’’ అని పిలిచినట్లు చెప్పారు. అయితే దేశంలో ప్రతి రోజు జరుగుతున్న వాటితో పోలిస్తే తనది చిన్న సంఘటనగా చెప్పారు.
ఎఫ్ బీఐలో పటేల్ అలజడి..
ఎఫ్బీఐ ని ఇంతకుముందు ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆ సంస్థ ప్రక్షాళన అవసరమని గట్టిగా డిమాండ్ చేశారు. ట్రంప్ చాలామంది సీనియర్ ప్రభుత్వ ఉద్యోగులను తొలగించారు. ఇందులో ఎఫ్బీఐ కూడా ఉంది.
అయితే యూఎస్ క్యాపిటర్ పై దాడి చేసిన వారిపై దర్యాప్తు చేసిన ఎఫ్బీఐ అధికారులను కూడా తొలగించాలని కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. వీరికి ఇప్పటికే ట్రంప్ క్షమాభిక్ష ప్రసాదించారు.
ట్రంప్ 2020లో ఓటమి తరువాత తన రిసార్ట్ లో రహస్య పత్రాలను దాచుకున్నారని కేసు నమోదు చేశారు. అయితే వీటిని ఆయన ఖండించారు. ట్రంప్ వాదనను పటేల్ సమర్థించారు కూడా.
ప్రస్తుతం ఎఫ్బీఐలో సంస్కరణలు తీసుకురావాలని ఆయన కోరుకుంటున్నారు. ఇప్పుడు ఎఫ్బీఐ చేస్తున్న జాతీయభద్రత, సమాచార సేకరణ విషయం నుంచి పక్కన పెట్టి, దాని నేర దర్యాప్తు విధానాన్ని తిరిగి తీసుకురావాలని కోరుకుంటున్నారు.