ఏమండీ శ్రీమతి గారు, సాదరఖర్చులకు డబ్బులిస్తారా?

జంబలకడిపంబ సినిమా గుర్తుందిగా.. 1993 ప్రాంతంలో ఇ.వి.వి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఓ అద్భుత సినిమా. పురుషాధిక్య సమాజంపై ఓ రకమైన తిరుగుబాటు అది..

Update: 2024-10-15 08:15 GMT

జంబలకడిపంబ సినిమా గుర్తుందిగా.. 1993 ప్రాంతంలో ఇ.వి.వి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఓ అద్భుత సినిమా. పురుషాధిక్య సమాజంపై ఓ రకమైన తిరుగుబాటు ఆ సినిమా. నరేష్, ఆమని ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో మహిళలు ఎదుర్కొనే సమస్యల గురించే కాకుండా ఆడవాళ్ళ పనులు మగవారు, మగవాళ్ళ పనులు ఆడవాళ్ళు చేస్తే ఎలా ఉంటుందో వినోదభరితంగా తెరకెక్కించారు. సూపర్ డూపర్ హిట్టయింది. బ్రహ్మానందం పాత్ర మరీనూ. ఆ సినిమాలో మగవాళ్లు తమ సాదర ఖర్చులకు కూడా మహిళల్నే అడగాల్సి ఉంటుంది.

ఇప్పుడు సరిగ్గా జపాన్ లో అదే జరుగుతోందట. పురుషులు ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బును ఇంట్లో ఆడవారికి కుటుంబాన్ని పోషించే వారు. దీనికి భిన్నంగా జపాన్ వాసులు కొందరు మరో సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. దీనిప్రకారం భర్తలు సంపాయించి భార్యల చేతిలో పెడితే వాళ్లు అన్ని రకాల ఖర్చులు పోను మిగిలిన మొత్తంలో రోజుకింతని తమ మగవాళ్లకు చేతిఖర్చుల కోసం ఇస్తున్నారట.

కొజుకీ సంప్రదాయమంటే...
జంబలకిడిపంబ సినిమా మాదిరే మహిళలు ఎంతిస్తే అంతే వాడుకోవాలి. తిరిగి అడగడానికి వీల్లేదు. ఈ సంప్రదాయాన్ని జపాన్‌లో ‘కొజుకీ’ అని అంటారట. కోజికి అనేది జపాన్ లో సంప్రదాయం. దీన్నే ఫురుకోటోఫుమి, లేదా ఫురుకోటోబుమి అని కూడా పిలుస్తుంటారు. జపాన్ ఇతిహాసాల్లో ఈ ప్రస్తావన ఉంది. జపనీస్ ద్వీపసమూహం కమి అనే ప్రాంతంలో ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. దాదాపు ఇది హిందూ సనాతన సంప్రదాయానికి అనుగుణంగా ఉంది. 8వ శతాబ్దం ప్రారంభం నుంచి కోజికై సంప్రదాయం ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. జపాన్‌ పురాతన సాహిత్య రచనల్లోనూ ఈ సంప్రదాయ ప్రస్తావన ఉంది. "షింటో సనాతన ధర్మం" దీనికి ప్రేరణ అంటుంటారు.

పురుషులు ఉద్యోగం చేస్తే స్త్రీలు ఇంటి బాధ్యత నిర్వహించాలి. స్త్రీలు ఉద్యోగబాధ్యత తీసుకుంటే పురుషులు ఇంటి నిర్వహణ చూడాలి. అందుకని పురుషులే ఉద్యోగబాధ్యత తీసుకుంటున్నారట. సంపాదించిన డబ్బును భార్యకు ఇవ్వడం వల్ల భార్యాభర్తల మధ్య నమ్మకం పెరిగి అన్యోన్యంగా ఉండడానికి కారణమవుతుందన్న అభిప్రాయం ఎక్కువగా వినపడుతోంది. ఇంటి బాధ్యతను మహిళలు చేపట్టడం వల్ల పురుషులు ఇబ్బంది పడేదేమీ ఉండదు. వృధా ఖర్చుల్నీ దుబారాను నివారించాలంటే ఇదొక్కటే మార్గమని అత్యధిక పురుషులు చెబుతున్నారు. తమ భార్యల నుంచి సాదర ఖర్చులకు డబ్బు తీసుకోవడానికి ఇబ్బందేమీ లేదని, భార్య, భర్త ఒకటే అయినపుడు నామోషీ ఎందుకని జపాన్ వాసులు చెబుతున్నారు.
ఇండియా లాంటి దక్షిణాసియా దేశాలలో పురుషాధిక్యత ఇంకా కొనసాగుతూనే ఉంది. చికెన్ కోసం కోడిగుడ్డు పొరుటు కోసం భార్యల్ని చావబాదే సంస్కృతి ఇంకా మన పల్లెల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో జపాన్ లాంటి అభివృద్ధి చెందిన దేశంలో కుటుంబ వ్యవస్థను కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలలో ఇదొకటి. కుటుంబంలో భార్యభర్తల అన్యోన్యత ఎంత బాగుంటే అంతగా కుటుంబాలు బాగుంటాయని జపనీయులు భావిస్తున్నారు.
Tags:    

Similar News