సింధు నదీ జలాల పై కొత్త ఒప్పందం కుదిరే అవకాశం ఉందా?

భవిష్యత్ లో చైనా ఇదే విధానాన్ని భారత్ పై ప్రయోగించే అవకాశం..;

Translated by :  Praveen Chepyala
Update: 2025-05-09 13:54 GMT
సింధూ నదీ జలాల ఒప్పందం

పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇది భవిష్యత్ లో సంభవించే పరిణామాలను పరిశీలించి ఈ చర్య తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. పాకిస్తాన్ తో సైనిక సంఘర్షణను ఊహించి, మన దేశాన్ని ముందడుగు వేసేలా పురిగొల్పింది.

రెండు దేశాల మధ్య చాలాకాలం పాటు అరుదైన స్నేహానికి సింధు నదీ జలాల ఒప్పందం ఒక ఉదాహారణగా చెప్పవచ్చు. ఈ ఒప్పందం కుదిరిన తరువాత రెండు దేశాలు దాదాపుగా మూడు యుద్ధాలు చేసుకున్నాయి.
అయినప్పటికీ అనేక దౌత్యపరమైన ప్రతిష్టంభనలను తట్టుకుని నిలిచింది. ఇది ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరింది.అయితే కొంతకాలంగా ఈ ఒప్పందం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందాన్ని భారత్ పక్కన పెడుతుందని చాలా తక్కువ మంది ఊహించారు.
భౌగోళిక రాజకీయాలపై దృష్టి
నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) అవతల సాయుధ శత్రుత్వాలు చెలరేగడానికి కొన్ని రోజుల ముందు భారత్, నీటికి సంబంధించిన ఒప్పందాలను పక్కన పెట్టడం వరకూ భౌగోళిక రాజకీయాల ప్రభావాన్ని సూచిస్తుంది.
కాలమిస్ట్ బ్రహ్మ చెల్లాని ప్రకారం.. ఆధునిక ప్రపంచ చరిత్రలో ఎగువ నదీ దేశం దిగువ దేశానికి అసాధారణంగా నీటిని కేటాయించడానికి ఒప్పందం కుదుర్చుకుందంటే అద సింధూ నదీ జలాల ఒప్పందమే అంటారు. పాకిస్తాన్ కు ఏటా 80. 52 శాతం జలాలను ఈ ఒప్పందం రిజర్వ్ చేసింది.
ప్రధాన యుద్దాలను చూసింది..
1960 లో సంతకం చేయబడిన ఇండస్ వాటర్ ట్రీటీ లో మూడు తూర్పు నదులు అయిన రావి, బియాస్, సట్లేజ్ భారత్ కు , పశ్చిమ నదులు అయిన సింధు, జీలం, చీనాబ్ లపై పాకిస్తాన్ కు హక్కులు దక్కాయి.
భారత్ కు పశ్చిమ నదులపై పరిమిత హక్కులు మాత్రమే దక్కాయి. పరస్పరం అనుమానాలు ఉన్నప్పటికీ ఈ ఒప్పందం దాదాపు ఆరు దశాబ్ధాలకు పైగా కొనసాగాయి. దాని అవసరాలు ప్రత్యర్థులు సైతం సహజ వనరులపై సహకరించుకోలరనడానికి ఇదే ఉదాహారణగా చెప్పవచ్చు.
భారతీయుల నిరాశ..
సెంటర్ ఫర్ జాయింట్ వార్ ఫేర్ స్టడీస్ లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. 25 మిలియన్ల జనాభా కలిగిన పాకిస్తాన్ పంజాబ్ కు 50 శాతానికి పైగా నీరు లభించింది. అయితే 21 మిలియన్ల జనాభా కలిగిన 20 శాతం కంటే తక్కువ నీటిపారుదల భూమి కలిగిన భారత పంజాబ్ కు 20 శాతం మాత్రమే నీటి లభించిందని, ఇది నీరు, భూమి, జనాభా నిష్పత్తిలో అసమతుల్యతను సృష్టించిందని, భారత్ లోని పంజాబ్ కు హనీకరంగా మారిందని 2024 లో జరిగిన అధ్యయనంలో బ్రిగేడియర్ ఎస్ కే సింగ్ అన్నారు.
నీటి ఒప్పందం విషయంలో భారత్ నిరాశ పెరుగుతూ ఉండటం వలనే దాని ఉపసంహరణకు దారి తీసిందని చెప్పవచ్చు. భారత జలవిద్యుత్ ప్రాజెక్ట్ అయిన కిషన్ గంగా, రాట్లేకు పాకిస్తాన్ పదేపదే చట్టపరమైన సవాళ్లను తీసుకొచ్చింది. ఒప్పందం ముసుగులో జమ్మూకాశ్మీర్ లో అభివృద్దిని అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని న్యూఢిల్లీ భావించింది.
భారత్ కఠిన వైఖరి..
తటస్థ నిపుణుల యంత్రాంగం ద్వారా వివాదాలను పరిష్కరించడానికి పాకిస్తాన్ నిరాకరించడం భారత్ కు ఆగ్రహం తెప్పించింది. ఈ వివాదంపై న్యాయస్థానానికి వెళ్లడంతో భారత్ 2023 లో అధికారికంగా నోటీస్ జారీ చేసింది. పాకిస్తాన్ నిర్ధేశించిన 90 రోజుల వ్యవధిలోపు స్పందించకుంటే ఒప్పందం చెల్లదని ప్రకటించింది.
ఈ ఒప్పంద ఉపసంహరణ శిక్షా చర్యగా చట్టపరమైన, పరిపాలనా పరమైన నిర్ణయంగా చూపించినప్పటికీ పాకిస్తాన్ పై భారత్ వైఖరిని కఠినతరం చేయడంలో ఉపయోగపడింది. సరిహద్దు వెంబడి సైనిక ఆస్తుల నిర్మాణం, కాల్పుల విరమణ ఉల్లంఘనలు పెరగడం, రాజకీయాలు, ఉగ్రవాద దాడులు దీని నుంచి వైదొలగడానికి అవకాశం చిక్కింది.
వ్యూహాత్మక సరిహద్దును మార్చడం..
పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న గ్రూపుల మద్దతుతో పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగింది. సాధారణ ప్రజలపై ఉగ్రవాదులు తుపాకులు ఎక్కుపెట్టడంతో జలాల సమస్య బహిరంగంగా కనిపించింది.
భారత అధికారులు నీటి నియంత్రణను జాతీయభద్రతతో అనుసంధానించడం ప్రారంభించారు. ఇక నుంచి పాకిస్తాన్ చేసే ప్రాక్సీ వార్ ను విడిచిపెడితేనే నీళ్లు ఇస్తామని చెప్పేవరకూ తీసుకొచ్చారు.
ఇది ఒక్క ఎత్తుగడతో ముగియలేదు మెల్లగా దౌత్యం, వాణిజ్యం, సైనిక సిద్దాంతం వనరుల నియంత్రణ ఇలా పాక్ పై ప్రభావం చూపే అన్ని అంశాలకు పాకింది. ఇవి కేవలం ఎత్తుగడలో ప్రారంభం మాత్రమే.
ఈ రద్దు ఇప్పుడు భారత్ లోని పశ్చిమ నదులపై ఎలాంటి ఆటంకం లేకుండా ప్రాజెక్ట్ లు కట్టడానికి ఉపయోగపడతాయి. దేశీయంగా ఇది సార్వభౌమాధికారం యొక్క సిసలైన పవర్ గా ప్రచారం పొందుతోంది.
కొత్త యుగంలో పాత కోల్డ్ వార్ సమయంలో కుదిరిన ఒప్పందాలకు ఇక మేము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని పాకిస్తాన్ కు అర్థమయ్యేలా భారత్ సమాధానం ఇచ్చినట్లు అయింది.
ప్రమాదాలు ఉన్నాయా?
ఈ చర్య పలు ప్రమాదాలకు కూడా కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒప్పందం రద్దు ద్వారా పాకిస్తాన్ అంతర్జాతీయ న్యాయస్థానం, ఐరాసకు ఫిర్యాదు చేయడం ద్వారా అంతర్జాతీయం చేయడానికి ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు.
ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్న అస్థిరతకు ఇది మరింత బలాన్ని చేకూరించినట్లు అయింది. కొనసాగుతున్న సైనిక వివాదానికి పశ్చిమ నదుల సహజ ప్రవాహాలను మార్చడానికి భారత్ చేసే ఏవైనా ప్రయత్నాలను యుద్ధచర్యగా పరిగణిస్తామని పాకిస్తాన్ హెచ్చరించింది.
నదుల భాగస్వామ్య యంత్రాగం కూలిపోవడం ఈ ప్రాంతంలోని నీటి శాస్త్రవేత్తలు, పరిరక్షకులను అప్రమత్తం చేసింది. డేటా షేరింగ్ వరద అంచనా ప్రోటోకాల్ లు లేదా తప్పుడు లెక్కింపు, ఆనకట్ట నిర్వహణ లోపం వంటి వలన రెండు దేశాల వాతావరణ మార్పులపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది.
సంబంధాలు క్షీణించినప్పటికీ కొంతమంది విశ్లేషకులు ఈ రద్దు వల్ల ఆధునిక, సమతుల్య ఒప్పందానికి అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నారు. పాకిస్తాన్ ఎలాంటి షరతులు లేకుండా పాత ఒప్పందాన్ని పునరుద్దరణ చేయాలని మొండిపట్టుదల లేకుంటే కొత్త ఒప్పందం కుదురుతుందని అన్నారు. ఇదే విషయాన్ని భారత ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఇది సైనిక ఉద్రిక్తతలు జరగడానికి ముందు వచ్చిందని గుర్తుంచుకోవాలి.
చైనా కారకం..
ప్రస్తుత సైనిక వాతావరణంలో అలాంటి సంభాషణ సమీప భవిష్యత్ లో అసంభవంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ విమర్శల మధ్య తిరిగి చర్చలు రాజకీయంగా ఆచరణీయం కాదు. పాత ఒప్పందాన్ని పునరుద్దరించడం తిరోగమనచర్యగా భారతీయులు భావించే అవకాశం ఉంది.
ఇది రాబోయే సంవత్సరాలలో కొత్త, వాస్తవిక ఒప్పందానికి దారి తీస్తుందా లేదా మరింత దూరం జరగడానికి ఒక ఉదాహారణగా నిలుస్తుందా? అనే ప్రస్తుతం కొనసాగుతున్న సంఘర్షణల ఫలితం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. రెండు దేశాలు నీటిని ఆయుధంగా మాత్రమే కాకుండా కల్లోల ప్రాంతంలో సహకారాన్ని కోరుతున్న ఉమ్మడి వనరుగా చూడటానికి సిద్ధంగా ఉన్నాయా అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది.
కొంతమంది నిపుణుల, దౌత్యవేత్తలు కూడా ఈ చర్య ఒక ఉదాహారణగా నిలుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ లాగే చైనా కూడా మనదేశంలోకి ప్రవహించే నదుల విషయంలో ఇదే వైఖరిని అవలంభించే అవకాశం ఉందంటున్నారు.


Tags:    

Similar News