ఐపీఎల్: పాండ్యాను టార్గెట్ చేయద్దు : కీరన్ పొలార్డ్
ముంబై ఫ్యాన్స్ కెప్టెన్ పాండ్యాను టార్గెట్ చేయడం ఆపాలని ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ కోరారు. క్రికెట్ జట్టుగా ఆడే ఆటన్నారు. తనపై తనకు నమ్మకం ఉందని..
By : Admin
Update: 2024-04-15 10:07 GMT
హోమ్ గ్రౌండ్ లో చెన్నై చేతిలో ముంబై పరాజయం పాలైనందున కెప్టెన్ పాండ్యా మరోసారి అభిమానులకు టార్గెట్ గా మారాడు. ఈ నేపథ్యంలో ముంబై బ్యాటింగ్ కోచ్ పొలార్డ్ స్పందించాడు. అభిమానులు పాండ్యాను టార్గెట్ చేయడం ఆపాలని కోరారు. నిర్థిష్ట వ్యక్తులను ఎగతాళి చేస్తూ, ఓటమిగా బాధ్యుడిగా చేయడం సరికాదన్నారు.
చివరి ఓవర్లో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, పాండ్యా బౌలింగ్ లో వరుసగా మూడు సిక్సర్లు బాది 26 పరుగులు సాధించాడు. హర్ధిక్ తన నాలుగు ఓవర్ల కోటాలో 43 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మొదటి మూడు ఓవర్లు బాగానే బౌలింగ్ చేసినప్పటికీ చివరి ఓవర్లో వరుస సిక్స్ లకు బదులు రెండు వైడ్లు వేయడం అభిమానులకు కోపం తెప్పించింది. అలాగే కీలకమైన సమయంలో బ్యాటింగ్ కు దిగిన పాండ్యా ఆరు బంతులను ఎదుర్కొని రెండు పరుగులు మాత్రమే సాధించాడు. ఈ మ్యాచ్ లో ముంబై ఓడిపోవడంతో హర్దిక్ మరోసారి టార్గెట్ అయ్యాడు. రోహిత్ శర్మ వీరోచితంగా పోరాడి సెంచరీ సాధించిన ముంబైను గెలిపించలేకపోయాడు. రోహిత్ ను ముంబై జట్టు పగ్గాలు తప్పించి, పాండ్యాకు అప్పగించడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
పాండ్యాకు అండగా నిలబడిన పొలార్డ్ “నీకు మంచి రోజులు రాబోతున్నాయి.క్రికెట్ అనేది జట్టుగా కలిసి ఆడే ఆట. నిన్ను టార్గెట్ చేసే వాళ్లను పట్టించుకోకు”అని పోలార్డ్ ఆదివారం రాత్రి మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో అన్నారు.
“పాండ్యా ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి. అతనికి నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. క్రికెట్‌లో మీకు మంచి, చెడు రెండు ఉంటాయి. ఓ ఆటగాడు ఎంత అంకిత భావంతో పనిచేయాలో, పాండ్యా అంతే స్థాయిలో కష్టపడుతున్నాడు” అని పొలార్డ్ పేర్కొన్నారు. జూన్ లో అమెరికా- కరేబియన్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచ కప్ లో ఇండియా తరఫున పాండ్యాను ఎంపిక చేస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్న తరుణంలో ‘ పాండ్యా భారత దేశ గొప్ప ఆల్ రౌండర్లలో ఒకరు’ అని కొనియాడారు. మరో ఆరు వారాల్లో జరిగే ప్రపంచకప్ కు పాండ్యా ఎంపిక అవుతాడని ఆశాభావం వ్యక్తం చేశారు. పాండ్యా బాగా రాణిస్తాడనే విశ్వాసం తనకు ఉందని వెస్టీండీయన్ జోస్యం చెప్పారు.
“అతను బ్యాటింగ్ చేయగలడు, బౌలింగ్ చేయగలడు, ఉత్తమ ఫీల్డర్ కూడా. అతడు(పాండ్యా) కచ్చితంగా పైకి ఎదగలడని నా మనస్సు చెప్తుతోందని అన్నారు. అయితే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ మాత్రం పాండ్యాను విమర్శించాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలో పాండ్యా తడబడుతున్నాడని పెదవి విరిచాడు.ఈ ఐపీఎల్ లో ముంబై ఆరు మ్యాచుల్లో నాలుగు ఓడిపోయి.. రెండు విజయాలు మాత్రమే సాధించింది. దీనికి పాండ్యాను కారణమని అభిమానులు నిందిస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా ట్రోల్స్ కు దిగుతున్నారు.