శాంతి సమావేశాన్ని పక్కన పెట్టారు కానీ.. రష్యా- ఉక్రెయిన్ మధ్య..
ప్రధాని నరేంద్ర మోదీ మూడో సారి అధికారంలోకి వచ్చాక తొలి విదేశీ పర్యటన కోసం ఇటలీ వెళ్లారు. అక్కడ జీ7 సమావేశం అనంతరం తిరిగి రానున్నారు. అయితే రష్యా- ఉక్రెయిన్..
By : Praveen Chepyala
Update: 2024-06-13 06:06 GMT
జూన్ 13- 15 మధ్య జరిగే G7 శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం (జూన్ 13) ఇటలీకి వెళ్లారు. అయితే, ఆయన 24 గంటల పాటు మాత్రమే అక్కడ ఉంటారు. సమ్మిట్ అధికారికంగా ముగిసేలోపు స్వదేశానికి తిరిగి వస్తారు.
జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత దేశంలో వరుసగా మూడో సారి ప్రధాని పదవి చేపట్టిన తరువాత మోదీ చేస్తున్న మొదటి విదేశీ పర్యటన ఇదీ. అయితే జూన్ 15-16 తేదీల్లో స్విట్జర్లాండ్ జరిగే ఉక్రెయిన్ శాంతి సదస్సు కు మాత్రం ప్రధాని మోదీ వెళ్లట్లేదు.
శాంతి సమావేశానికి ఆహ్వనించడానికి ఎన్నికల ముందే స్విస్, ఉక్రెయిన్ రాయబారులు వచ్చి భారత ప్రభుత్వాన్ని కలిశారు. యూరోపియన దేశాలు నెలల తరబడి లాబీయింగ్ చేశాయి. కానీ మోదీ మాత్రం స్విస్ వెళ్లడానికి మాత్రం ససేమిరా అన్నారు.
యథావిధిగానే..
పార్లమెంట్ ఎన్నికల్లో మోదీకి మెజారిటీ తగ్గినప్పటికీ ఇంతకుముందు సెట్ చేసిన విదేశాంగ విధానాన్ని మాత్రం విడనాడలేదు. అందుకే ఇటలీ దాకా వెళ్లిన ఆయన, పక్కనే ఉన్న స్విట్జర్లాండ్ వెళ్లడానికి ఇష్టపడట్లేదు. భారత విధానం ఇంకా మారలేదని ఆయన బాహ్య ప్రపంచానికి చాటి చెబుతున్నారు.
G7 అనేది ప్రపంచంలోని అత్యంత పారిశ్రామిక, గొప్ప ప్రజాస్వామ్య దేశాల సమూహం. కానీ ప్రపంచంలోని అనేక ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు కూడా శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలని ఆహ్వనాలు అందుతున్నాయి. అలాంటి దేశాల్లో భారత్ కూడా ఒకటి.
G7 శిఖరాగ్ర సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్ట్జ్, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, జపాన్, ఇటలీ ప్రధాన మంత్రులతో పాటు ఇతర ప్రపంచ నాయకులు హాజరుకానున్నారు. గత G7 శిఖరాగ్ర సమావేశాల్లో భారతదేశం 11 సార్లు పాల్గొనగా, మోదీ ఐదుసార్లు హాజరయ్యారు. ఇది మోదీ ఆరో పార్టిసిపేషన్.
G7 సమ్మిట్ - ప్రజాదరణను ప్రదర్శించడానికేనా..
అయితే ఇటలీలో జరగనున్న సమ్మిట్ మోదీ గతంలో కంటే భిన్నంగా ఉంటుందని అనిపిస్తోంది. ఆయన ఇంతకుముందు పూర్తి మెజారిటీ వచ్చిన ప్రభుత్వ సారథిగా వెళ్లగా, ఇప్పుడు మాత్రం సంకీర్ణ కూటమికి నేతగా హజరవుతున్నారు. అయినప్పటికీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, భారత ప్రధానికి ఘనమైన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తుందనడంలో సందేహం లేదు.
మోదీ తో పాటు ఇతర ప్రపంచ నాయకులకు ఇలాగే స్వాగత సత్కారాలు లభిస్తాయి. అయితే జీ7 కూటమిలో మోదీ పాపులారిటీని పెంచుకోవడానికి సరైన వేదికగా మారుతుంది. సమ్మిట్‌కు హాజరవడం ద్వారా, ప్రపంచ నాయకులలో తనకున్న ప్రజాదరణ మునుపటిలాగే బలంగానే ఉందని, ఇప్పటికీ వారిని ఒక ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామిగా పరిగణిస్తున్నారని మోదీ తెలియజేయవచ్చు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై..
మరోవైపు, ఉక్రెయిన్ శాంతి సమావేశాన్ని మోదీ పక్కన పెట్టి, దానికి కోసం ఒక అధికారి పంపడం ద్వారా భారత్ ఉక్రెయిన్ శాంతి కోసం కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూనే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఒంటరిగా చేసే పాశ్చాత్య దేశాల ప్రయత్నానికి తాను మద్ధతు ఇవ్వనని మోదీ స్పష్టమైన సందేశం పంపుతున్నారు. భారత్ మొదటి నుంచి రష్యా- ఉక్రెయిన్ రెండు దేశాలు చర్చల ద్వారా నే సమస్యను పరిష్కరించుకోవాలని మోదీ సూచిస్తున్నారు.
G7 సమ్మిట్ ఔట్రీచ్ ప్రోగ్రామ్ సెషన్‌లో, ఉక్రెయిన్, గాజాలో కొనసాగుతున్న సంఘర్షణలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఇతర ఆర్థిక సమస్యలు, ఈ సమస్యలన్నీ ప్రపంచాన్ని, ముఖ్యంగా గ్లోబల్ సౌత్‌ను ఎలా ప్రభావితం చేస్తున్నాయి అనే అంశాలపై చర్చ జరుగుతుంది.
గ్లోబల్ సౌత్‌పై ప్రపంచ దేశాలు చూపుతున్న ప్రతికూల స్వభావాన్ని మోదీ మరోసారి ప్రస్తావించే అవకాశం ఉంది. ప్రపంచంలోని పేదలు, వెనుకబడిన వారి కష్టాలను తీర్చడానికి భారతదేశ అధ్యక్షతన గత సంవత్సరం జరిగిన G-20 శిఖరాగ్ర సమావేశంలో అంగీకరించిన పరిష్కారాలను హైలైట్ చేస్తారు.
ద్వైపాక్షిక సమావేశాలు
బిడెన్, రిషి సునక్, యుఎఇ పాలకులు, సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ తో పాటు మరికొందరు పాల్గొనే అవకాశం ఉన్న వారితో ద్వైపాక్షిక సమావేశాలు జరిగే అవకాశం కూడా ఉంది.
అలాగే మోదీ, మెలోనితో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించే అవకాశాన్ని కూడా ఉపయోగించుకుంటాడు. ఇద్దరు నాయకులు తమ వ్యూహాత్మక భాగస్వామ్యం, కీలక రంగాలపై సాధించిన పురోగతిని కూడా సమీక్షించుకునే అవకాశం కూడా ఉంది.
'స్టిల్బోర్న్' శాంతి సమావేశం
స్విట్జర్లాండ్‌లో జరిగే ఉక్రెయిన్ శాంతి సదస్సుకు దూరంగా ఉండాలన్న మోదీ నిర్ణయాన్ని గ్లోబల్ సౌత్‌లోనే కాకుండా పశ్చిమ దేశాలలోని ఇతర దేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రపంచ నాయకులు హాజరుకాలేకపోతున్నారు.
కాన్ఫరెన్స్ నిర్వాహకుల ప్రకారం, 160 కంటే ఎక్కువ దేశాల నాయకులకు ఆహ్వానాలు పంపబడినప్పటికీ, ఇప్పటివరకు 70 మంది మాత్రమే ఇక్కడకు రావడానికి అంగీకరించారు. వారిలో కూడా ఎక్కువ మంది యూరప్ దేశాల నాయకులే. నిపుణులు ఈ శాంతి సమావేశాన్ని "పున: జన్మ"గా అభివర్ణించారు. నిర్వాహకులు రష్యాను సమావేశానికి దూరంగా ఉంచడంతో బ్రిక్స్ దేశాలైన చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాకు చెందిన ఇతర నాయకులు కూడా ఈ శాంతి సమావేశాన్ని బహిష్కరించారు.
అమెరికా అధ్యక్షుడు కూడా సమావేశాన్ని దాటవేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ప్రాతినిధ్యం వహిస్తారు. అయితే ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ కూడా స్విట్జర్లాండ్‌కు వచ్చే అవకాశం లేదు.ఇది పుతిన్, లేదా జి జిన్‌పింగ్ లేదా బిడెన్ కూడా లేని చోట స్విస్ ప్రయత్నాన్ని ఎంత తీవ్రంగా పరిగణించవచ్చో అర్థమవుతుందని పరిశీలకులు అంటున్నారు.
ఉక్రెయిన్ శాంతి సమావేశం, శాంతిని కనుగొనడానికి, కొనసాగుతున్న సంఘర్షణను అంతం చేయడానికి చేస్తున్న తీవ్రమైన ప్రయత్నం కాదని కొంతమంది వాదించారు. యుక్రెయిన్‌కు యుఎస్, ఐరోపా దేశాలు స్థిరమైన ఆయుధాలను సరఫరా చేసినప్పటికీ రష్యా యుద్ధంలో విజయం సాధిస్తోందని స్వతంత్ర నివేదికలు చెబుతున్న మాట.
అందువల్ల, వ్లాదిమిర్ పుతిన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఏకాకిని చేయడానికి మోదీ వంటి నాయకులను సదస్సుకు ఆహ్వనించాలని పాశ్చాత్య దేశాలు ఆడుతున్న ఆట ఇది. అందుకే భారత్ దీని నుంచి వెనక్కి తగ్గింది.
రష్యాపై ఒత్తిడి
మెజారిటీ దేశాల నాయకులు సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ, పశ్చిమ దేశాలు ఇప్పుడు వ్యూహాలను మార్చుకున్నాయి. రష్యాపై ఒత్తిడి తెచ్చి ఉక్రెయిన్ కు అనుకూలంగా యుద్దాన్ని ముగించాలని జీ7 శిఖరాగ్ర సమావేశాన్ని ముగించడానికి ప్రయత్నిస్తున్నాయి.
శాంతి సదస్సుకు హాజరు కావాలని భారత ప్రధానిని వ్యక్తిగతంగా ఒప్పించేందుకు ప్రయత్నించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ కూడా ఇటలీలో హాజరుకానున్నారు. సమ్మిట్‌లో ఆయన మోదీని కలిసే అవకాశం ఉంది.
అయితే, స్విట్జర్లాండ్ సమావేశానికి దూరంగా ఉండాలని మోదీ నిర్ణయం తీసుకున్నప్పటికీ, శాంతి కోసం దాని నిబద్ధత, ఉక్రెయిన్ వివాదం ముందస్తు పరిష్కారంతో పుతిన్‌కు వ్యతిరేకంగా వెళ్లకూడదనే దాని వైఖరిని భారతదేశం ఎలా సమతుల్యం చేసుకుంటుందో పరిశీలకులు ఆసక్తిగా చూస్తున్నారు.
బ్రిక్స్‌లోని ఇతర సభ్యుల మాదిరిగా భారత్ శాంతి సదస్సును బహిష్కరించడం లేదు. అయితే సమావేశానికి ఒక అధికారిని పంపడం ద్వారా, స్విట్జర్లాండ్ శాంతి సమావేశం ఆమోదించే అవకాశం ఉన్న రష్యా వ్యతిరేక తుది పత్రానికి భారతదేశం ఎలా దూరంగా ఉండగలుగుతుందో చూడాలి.