భారీ నష్టాల్లో ట్రేడవుతున్న ప్రపంచ స్టాక్ మార్కెట్లు

యూఎస్ ఫెడ్ నిర్ణయంతో జీవిత కాల కనిష్టానికి రూపాయి విలువ

By :  491
Update: 2024-12-19 09:19 GMT

యూఎస్ ఫెడరల్ బ్యాంకు ప్రకటించిన నిర్ణయంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు గురువారం విలవిలలాడాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 1200 పాయింట్లు, నిఫ్టీ 30 పాయింట్లు నష్టపోయాయి. సెన్సెస్ 79 వేల పాయింట్లకు చేరుకోగా, నిఫ్టీ 23,870 పాయింట్లకు దిగిపోయింది.

స్టాక్ ఎక్స్ ఛేంజ్ లో ఉన్న 30 కంపెనీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇన్ఫోసిస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, JSW స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ షేర్లు సైతం నష్టాల్లో ఉన్నాయి. వాల్ స్ట్రీట్ బుధవారం భారీగా నష్టపోయింది.

మార్కెట్ కు తిరిగి ఊపు ఎప్పుడూ..

మార్కెట్ లో ఎక్కువగా విలువలు ఉన్నప్పుడు దాని సరిదిద్దడానికి ఓ ట్రిగ్గర్ అవసరం. ఈ ట్రిగ్గర్ 2025 లో ఫెడ్ రేట్ల రూపంలో వచ్చింది. ఇది మార్కెట్ అంచనాలకు విరుద్దంగా వచ్చింది. మొదటి విడత కోత మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉన్నప్పటికీ తరువాత కూడా మరో మూడు దశలు ఉంటాయని సూచనలు రావడంతో మదుపర్లను భయపెట్టింది. ఫలితంగా వాల్ స్ట్రీట్ జర్నల్ లో భారీగా అమ్మకాలు జరిగాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ స్ట్రాటజిస్ట్ వికే విజయ్ కుమార్ చెప్పారు.

"ఆర్థిక వ్యవస్థ, కార్మిక మార్కెట్‌కు సంబంధించి ఫెడ్ చీఫ్ వ్యాఖ్యలు వాస్తవానికి సానుకూలంగా ఉన్నాయి, ఇది పుంజుకుంటున్న US ఆర్థిక వ్యవస్థను సూచిస్తోంది. కానీ కనిపిస్తున్న అంచనాలు, వాస్తవానికి భిన్నంగా ఉండటంతో మార్కెట్ భయంతో వణికిందని ” అన్నారాయన. ఫెడ్ చీఫ్ మాటలతో విదేశీ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) బుధవారం నాడు రూ.1,316.81 కోట్ల విలువైన ఈక్విటీలను ఆఫ్‌లోడ్ చేసినట్లు ఎక్స్ఛేంజ్ డేటా పేర్కొంది.

US ఫెడ్ వరుసగా మూడో కోత

"ఫెడరల్ రిజర్వ్ తన బెంచ్ మార్క్ వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ సంవత్సరంలో ఇది మూడో సారి కోత విధించడం. వచ్చే ఏడాది దాని బేసిస్ పాయింట్లలో మరిన్ని కోతలు ఉంటాయని సంకేతాలు ఇవ్వడంతో సెంటీమెంట్ క్షీణించిందని మెహాతా ఈక్విటీస్ లిమిటెడ్ సీనియర్ అధికారి ప్రశాంత్ తాప్సే విశ్లేషించారు.

గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.40 శాతం తగ్గి 73.10 డాలర్లకు చేరుకుంది. అలాగే యూరోప్ మార్కెట్లు కూడా గురువారం భారీగా పతనం చవిచూశాయి. మార్కెట్లో ఎక్కడా కూడా జోష్ కనిపించలేదు. మార్కెట్ల పతనంలో మన రూపాయి విలువ కూడా భారీగా క్షీణించింది. డాలర్ తో మన మారకం విలువ 85 రూపాయల జీవన కాల కనిష్టానికి చేరుకుంది.

Tags:    

Similar News