పురోగమనంలోకి భారత స్టాక్ మార్కెట్లు
ఫుంజుకున్న సాంకేతికరంగం షేర్లు;
By : Praveen Chepyala
Update: 2025-04-08 07:05 GMT
(అనువాదం.. చెప్యాల ప్రవీణ్)
ట్రంప్ దూకుడుతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లు అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. భారత స్టాక్ మార్కెట్లు సైతం భారీగా నష్టపోయాయి. అయితే ఈరోజు స్టాక్ మార్కెట్లు తిరిగి ఫుంజుకున్నాయి.
ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, తక్కువ విలువల వద్ద అవకాశవాద కొనుగోళ్లతో బెంచ్ మార్క్ సూచీలు పైకి ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 12 వందల పాయింట్లు పెరిగి 74,327 వద్ద ట్రేడవగా, నిఫ్టీ 371 పాయింట్లు పెరిగి 22,532.30 వద్ద ట్రేడవుతోంది.
ఐటీలో అగ్రగామి..
ర్యాలీలో నేడు సమాచార సాంకేతిక షేర్లు బాగా ట్రేడవుతున్నాయి. ఇన్పోసిస్, టీసీఎస్, హెచ్ సీఎల్, విప్రో వంటి షేర్లు లాభాల్లో దూసుకుపోయాయి. ట్రంప్ ప్రారంభించిన యుద్ధంతో చాలా దేశాలు బేరాసారాలు మొదలు పెట్టాయని ఈ సెంటీమెంట్ తో ఐటీ ఉత్పత్తులకు తిరిగి మంచి గిరాకీ పెరిగింది.
దీనికి విరుద్దంగా బలహీనమైన గ్రామీణ డిమాండ్ సంకేతాలు, ఇన్ ఫుట్ ఖర్చు ఆందోళనల కారణంగా యునిలీవర్, డాబర్ వంటి స్టాక్ లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అదే విధంగా టాటా స్టీల్, జేఎస్ డబ్ల్యూ స్టీల్ వంటి ఆటగాళ్లు సహ మెటల్ ఇండెక్స్, ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు, చైనా నుంచి డిమాండ్ అనిశ్చిత కారణంగా ఒత్తిడిని ఎదుర్కొంది.
నష్టాలను నుంచి ఎలా రికవరీ..
ఏప్రిల్ 8న మార్కెట్ సెంటిమెంట్ ను పెంచడంలో ప్రపంచ సంకేతాలు కీలకపాత్ర పోషించాయి. జపాన్ కు చెందిన నిక్కీ 225. 6 శాతం పెరుగుదల సాధించింది. ఇది మిగతా ఆసియా మార్కెట్లకు బూస్ట్ ఇచ్చింది. దక్షిణ కొరియాకు చెందిన కోస్పి, హాంకాంగ్ చెందిన హంగ్ సెంగ్ కూడా ఇటీవల క్షీణతల తరువాత స్థిరీకరణ సంకేతాలను చూపించాయి.
యూఎస్ స్టాక్ మార్కెట్లు లాభాలు మార్కెట్లకు శక్తినిచ్చింది. దేశీయంగా రూ. 12,122 కోట్ల ఈక్విటీలను కొనుగోలు చేసిన పెట్టుబడిదారులు మార్కెట్ పునరుద్దరణకు మరింత ఆదరణ లభించేలా చేశారు.
భారత్ మార్కెట్లు..
భారత్ మార్కెట్ల పరిస్థితిపై ఈక్వెంటిస్ వెల్త్ అడ్వైజరీ సర్వీసెస్ సీఐఓ జస్ ప్రీత్ సింగ్ అరోరా మాట్లాడుతూ.. ‘‘ భారత్ దేశీయంగా నడిచే ఆర్థిక వ్యవస్థ బలమైన కార్పొరేట్ ఆదాయాలు, విధాన మద్దతుతో నిర్మాణాత్మక వృద్ది కథగా మిగిలిపోయింది.
సుంకాల అనిశ్చితి స్థిరపడి తరువాత రెండు మూడు త్రైమాసికాలలో మార్కెట్ ఫుంజుకునే అవకాశం ఉంది’’ అని అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు క్రమశిక్షణతో ఉండాలని, స్వల్పకాలిక పెట్టుబడి దారులు అస్థిరత అంచనాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
‘‘కఠినమైన స్టాప్- లాస్ లకు కట్టుబడి ఉండాలి. అతిగా లివరేజ్ చేయడాన్ని నివారించండి. ఆదాయాలు, ప్రపంచ సంకేతాలు, సంస్థాగత ప్రవాహాలపై నిఘా పెంచాలి. నాణ్యమైన స్టాక్ లు స్థితిస్థాపకంగా ఉంటాయి. ’’ అని ఆయన అన్నారు.
అస్థిరత తగ్గలేదు..
ఆల్మండ్జ్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ సేల్స్ హెడ్ కేతన్ విక్రమ్ మాట్లాడుతూ.. ‘‘చైనా, వియత్నాం కంటే భారత్ ఎక్కువగా సుంకాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి దేశీయ మార్కెట్లు ఈ స్థాయిలో ఏకీకృతం అవుతాయని మేము ఆశిస్తున్నాము.
అయితే ఇటీవల దిద్దుబాట్లతో విలువలు ఆకర్షణీయంగా మారాయి. కానీ ప్రపంచ అనిశ్చితి కారణంగా ఏప్రిల్ మొత్తంలో భారత మార్కెట్లు అస్థిరంగా ఉంటాయని మేము ఆశిస్తున్నాము’’ అని అభిప్రాయపడ్డారు.
మంగళవారం నాటి ర్యాలీ పెట్టుబడిదారుల విశ్వాసం దెబ్బ తీసిందని, అయితే అస్థిరత అంతం కాలేదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వాణిజ్య డైనమిక్స్ ముఖ్యంగా అభివృద్ది చెందుతున్న యూఎస్ టారిఫ్ విధానం, కీలకమైన ఓవర్ హంగ్ లు ఉన్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాబోయే ద్రవ్య విధానం కూడా పెట్టుబడిదారులు సెంటిమెంట్ ను ప్రభావితం చేసే అవకాశం ఉంది.