‘‘ఢిల్లీ ఎన్నికల్లో అవకాశం ఎవరికి ఉందంటే..’’

‘ ది ఫెడరల్’ ఎడిటర్ ఎస్. శ్రీనివాసన్ విశ్లేషణ;

Update: 2025-01-15 08:32 GMT

ఢిల్లీ ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోటీ ఉండబోతోందని ‘ది ఫెడరల్’ ఎడిటర్ ఎస్ శ్రీనివాసన్ అన్నారు. ఆయన తాజాగా ‘టాకింగ్ సెన్స్ విత్ శ్రీని’ లో ఢిల్లీ ఎన్నికల గురించి విశ్లేషించారు. అధికారంలో ఉన్న ఆప్ తో పాటు, బీజేపీ, కాంగ్రెస్ సైతం రేసులో బలంగా పోరాడుతున్నాయని అన్నారు.

ఇక్కడ గత మూడు అసెంబ్లీ ఎన్నికల నుంచి ఆప్ అధికారంలో కొనసాగుతోంది. అయితే అన్నిటికంటే ముఖ్యంగా ప్రస్తుతం కాంగ్రెస్ ఉనికికోసం పోరాడుతోంది. దాని అస్తిత్వం కోసం ఆప్ తో బలంగా ఢీ కొడుతోంది. ఒకప్పుడు ఢిల్లీలో షీలా దీక్షిత్ నాయకత్వంలో వరుసగా 15 సంవత్సరాలు పాలించింది.

దాని ఓటు షేర్ 2020 లో అత్యల్ప స్థాయికి, అంటే ఇది 4.2 శాతానికి మాత్రమే చేరుకుంది. ఇది రానురాను దేశ వ్యాప్తంగా ప్రభావం చూపుతుందని భావించిన కాంగ్రెస్ వెంటనే నష్ట నివారణ చర్యలను దిగే సూచనలు కనిపిస్తున్నాయని అన్నారు.

బీజేపీకి అందని ద్రాక్షగా ఢిల్లీ
జాతీయ స్థాయిలో ఆధిక్యత సాధించినా బీజేపీకి మాత్రం ఢిల్లీ పీఠం అందని ద్రాక్షగా ఉంది. గత పాతిక సంవత్సరాలుగా ఆ పార్టీ ఢిల్లీ సీఎం పదవిని పొందలేకపోయింది. బలమైన నాయకత్వం ఉన్నప్పటికీ, దాని ఓట్ల వాటా 30 శాతం దాటడం లేదు. ఆప్ ను ఎదుర్కొవడానికి ఈ లెక్క సరిపోవడం లేదు. ఇది బీజేపీ అసమర్థతను ప్రతిబింబిస్తోందని ఎడిటర్ శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు.
ఇక్కడ బీజేపీ విజయం ఆ పార్టీ నైతిక విజయాన్ని పెంపొదించడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అనేక ఎన్నికల్లో విజయం సాధిస్తున్నప్పటికీ ఢిల్లీ దానికి చిక్కడం లేదు. ఇక్కడ గెలిస్తే జాతీయ రాజకీయాల్లో దాని స్థానాన్ని బలోపేతం చేస్తోంది. ముఖ్యంగా దళితులు, మైనారిటీలు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ పాత్ర పరిమితంగా ఉంటోంది. ఇదే దాని విజయానికి అడ్డంకిగా మారుతోందన్నారు.
ఆప్ దశాబ్ధ ఆధిపత్యం
ఆప్ గత దశాబ్ధకాలంగా ఢిల్లీని తన కోటగా మార్చుకుంది. బలమైన అవినీతి వ్యతిరేక ఎజెండా, సబ్సిడీలు, విద్యుత్, నీరు, మెరుగైనా ప్రభుత్వ పాఠశాలలు, మొహాల్లా క్లినిక్ లు, సంక్షేమ పథకాలతో ప్రజలను తన వైపు తిప్పుకుంటోంది. ఇవే దాని ప్రజా మద్థతుకు కారణం అవుతోంది.
కాంగ్రెస్ పునరుద్దరణ..
కాంగ్రెస్ ఇప్పుడు తన పునరుద్దరణపై దృష్టిపెట్టడంతో ప్రస్తుత ఎన్నికల డైనమిక్స్ ను మార్చగలదన్నారు. బహుశా ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు ట్రాయాంగిల్ ఫైట్ గా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఇది బీజేపీకి పరోక్షంగా మేలు చేస్తోందని చెప్పారు. ఇది ఆప్ కు సవాల్ గా మారుతుందని పేర్కొన్నారు. ఇదీ తన ఓటర్లను ఏకీకృతం చేసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తోంది.
ఆర్థిక సవాళ్లు..
ప్రస్తుతం దేశంలో ఫ్రీబీల సమస్య తరుచుగా రావడంతో దాన్ని రెవ్డీ కల్చర్ గా పిలుస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఇది ప్రధాన అంశంగా మారింది. ఆర్ధికంగా దాని ప్రభావం గురించి విమర్శలు వచ్చినప్పటికీ రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా దీనిని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇవన్నీ ఢిల్లీ బడ్జెట్ ను గణనీయంగా ప్రభావితం చేయగలవు. ఇది పాలన, అభివృద్ధి ప్రాధాన్యతలపై ప్రభావం చూపుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశం అభివృద్ధి చెందుతున్న రాజకీయ పరిణతిని ఢిల్లీ ఒక రూపంగా కనపడుతుందని ఎడిటర్ అభిప్రాయపడ్డారు.


Tags:    

Similar News