అగ్రస్థానాన్ని కోల్పోయిన టీమిండియా.. కానీ అందులో మనమే టాప్
ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఓడిపోయిన ప్రభావం భారత నంబర్ వన్ స్థానంపై పడింది. తాజాగా ప్రకటించిన వార్షిక అప్ డేట్ టీమిండియా 120 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
By : Praveen Chepyala
Update: 2024-05-03 11:58 GMT
ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా తన అగ్రస్థానాన్ని కోల్పోయింది. గత ఏడాది జరిగిన ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో భారత్ ను ఓడించిన ఆసీస్ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. వార్షిక అప్ డేట్ లను అనుసరించి ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో ఇండియా 120 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
ఆస్ట్రేలియా ఇప్పుడు 124 రేటింగ్ పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది, భారత్, కేవలం నాలుగు పాయింట్లు మాత్రమే వెనుకబడి ఉంది. మూడవ స్థానంలో ఉన్న ఇంగ్లండ్ కంటే 15 పాయింట్ల దూరంలో ఉంది. దక్షిణాఫ్రికా 103 పాయింట్లతో 100 పాయింట్ల మార్కును దాటి నాల్గవ జట్టుగా ఉందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) శుక్రవారం (మే 3) తెలిపింది.
ఐసీసీ ప్రకటించిన జాబితాలో కేవలం తొమ్మిది దేశాలు మాత్రమే ఉన్నాయి. ఇందులో ఆప్ఘనిస్తాన్, ఐర్లాండ్ లకు చోటు దక్కలేదు. ఎందుకంటే అవి తగినన్నీ టెస్టులు ఆడే అవకాశం లభించట్లేదు. దాదాపు మూడు సంవత్సరాల నుంచి టెస్టులు ఆడని జింబాబ్వే ఈ లిస్ట్ నుంచి పూర్తిగా వాష్ అవుట్ అయింది.
ర్యాంకింగ్స్ పట్టికలో చేరాలంటే మూడు సంవత్సరాల వ్యవధిలో జట్లు కనీసం ఎనిమిది టెస్టులు ఆడాలి. వార్షిక అప్ డేట్ ల తర్వాత, భారత్ ODI, T20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉంది,
ఐసిసి పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయినప్పటికీ తమ పాయింట్లను మూడు నుంచి ఆరుకు పెంచుకుంది. ప్రస్తుతం టీమిండియా 122 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. టాప్ 10లో ఎలాంటి మార్పులు లేవు కానీ ఐర్లాండ్ జింబాబ్వేను వెనక్కి నెట్టి 11వ స్థానానికి చేరుకుంది. రెండో స్ఠానంలో ఆసీస్, మూడో స్థానంలో దక్షిణాఫ్రికా ఉన్నాయి. ఈ రెండు జట్ల మధ్య ఎనిమిది పాయింట్ల అంతరం ఉంది. నాలుగో స్థానంలో ఇంగ్లండ్, ఐదో స్థానంలో శ్రీలంక ఉన్నాయి.
T20 ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా, ఢిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ కంటే ముందుంది, అయితే 264 రేటింగ్ పాయింట్‌లతో ఇండియా అగ్రస్థానంలో ఉంది. రెండో స్థానంలో ఉన్న ఆసీస్ కు, భారత్ కు మధ్య ఏడు పాయింట్ల అంతరం ఉంది. నాలుగో స్థానంలో దక్షిణాఫ్రికా, ఐదో స్థానంలో న్యూజిలాండ్ ఉన్నాయి.
పాకిస్థాన్ రెండు స్థానాలు దిగజారి ఏడో స్థానానికి చేరుకోగా, స్కాట్లాండ్ జింబాబ్వేను వెనక్కి నెట్టి 12వ స్థానానికి చేరుకుంది.ఈ జాబితాలో స్పెయిన్, ఐల్ ఆఫ్ మ్యాన్, స్విట్జర్లాండ్ కూడా ఉన్నాయి. ఇవన్నీ టాప్ 20 వెలుపల చోటు దక్కించుకున్నాయి.మొత్తం మీద, 86 దేశాలు గత మూడేళ్లలో కనీసం ఎనిమిది T20 మ్యాచ్ లు ఆడి ర్యాంకింగ్ లో చోటు సంపాదించాయి.