ఇందిర చూపిన తెగువ మోదీ చూపలేకపోయారా?

INDIA-PAKISTAN కాల్పుల విరమణ ఒప్పందంపై సోషల్ మీడియా 'వార్';

Update: 2025-05-11 06:33 GMT
భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు చాలామంది 1971నాటి బంగ్లా యుద్ధ సమయంలో ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ చూపిన తెగువను ప్రస్తావిస్తున్నారు. అమెరికాను ఎదిరించిన తీరును ప్రస్తావిస్తున్నారు. ఆనాడు ఇందిరా గాంధీ అద్భుత దౌత్యాన్ని నెరిపిందని చెబుతూ ఇప్పటి ఒప్పందాన్ని విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు శశీథరూర్ మొదలు జైరామ్ రమేశ్ వరకు చాలా మంది స్పందించారు. మరోపక్క సోషల్ మీడియా ప్రస్తుత కాల్పుల విరమణ ఒప్పందంపై చిటపటలాడుతూ సెటైర్లు, మీమ్స్, రీల్స్ ను పోస్ట్ చేస్తూ హల్ చల్ చేస్తోంది.
అవి ఇలా ఉన్నాయి..
భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన తర్వాత ఎంపీ శశిథరూర్‌ స్పందించారు. ‘నాకు చాలా సంతోషంగా ఉంది. భారత్ ఎప్పుడూ దీర్ఘకాలిక యుద్ధాన్ని కోరుకోలేదు. కానీ ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పాలనుకుంది. ఆ గుణపాఠం చెప్పారని నేను నమ్ముతున్నాను. అలాగే, మాట తప్పడం పాకిస్తాన్‌ నైజం. వారి వాగ్దానాలను ఎలా నమ్ముతాం?’ అని శశీథరూర్ కామెంట్ చేశారు. దీనర్థం ఇప్పటి కాల్పుల ఒప్పందాన్ని ప్రశంసించినట్టా, కాదా అనే అంశంపై సోషల్ మీడియాలో సైటెర్లు పేలుతున్నాయి. ఎవరికి తోచిన రీతిలో వారు కామెంట్లు పెడుతున్నారు.

ఇందిరా గాంధీ 

ఇదే సమయంలో 1971లో జరిగిన యుద్ధంపై కూడా శశిథరూర్‌ స్పందించారు. ‘1971లో ఒక గొప్ప విజయం అందుకున్నాం. ఇందిరా గాంధీ ఉపఖండం మ్యాప్‌ను తిరగ రాశారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. బంగ్లాదేశ్ నైతిక లక్ష్యంతో పోరాడుతోంది. పాకిస్తాన్‌పై దాడులు చేయడం, బాంబులు పేల్చడం మాత్రమే స్పష్టమైన లక్ష్యం కాదు’ అని కామెంట్స్‌ చేశారు.
అయితే, పాకిస్తాన్‌తో కాల్పులు విరమణ ఒప్పందం జరిగిన వేళ ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా తీసుకున్న చర్యను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైఖరితో పోల్చుతూ సోషల్ మీడియా ప్రచారం జరుగుతోంది. దీనిపై పలువురు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇందిరా గాంధీ హీరోయిక్ పాత్ర పోషించారని ప్రశంసిస్తున్నారు. ఆవేళ USA president నిక్సన్ యుద్ధం ఆపమని కోరినా ఇందిరా గాంధీ తోసిపుచ్చి భారతీయ సత్తాను చాటారని కూడా నెటిజన్లు ప్రశంసిస్తున్నారు."1971 లో భారత్ ఒక పేద దేశం (గౌరవం కోసం అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పుకున్నా సరే..) భారత్, పాకిస్తాన్ ఆర్థికంగా సమానం గా ఉన్నాయి.. అమెరికా డాలర్ తో పోలిస్తే రెండింటి కరెన్సీ విలువ ఒకటే.. ఆగ్రరాజ్యం అమెరికా ఏకపక్షంగా పాకిస్తాన్ కు మద్దతుగా ఉంది. ఇన్ని ప్రతికూలతలు ఉన్నా సరే భారత్ దూకుడుగా, వ్యూహాత్మకంగా వ్యవహరించి యుద్ధాన్ని విజయవంతంగా ముగించింది. పాకిస్తాన్ ను విభజించింది.
ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థికంగా కుదేలైంది. భారత్ ప్రపంచం లోనే ఐదో ఆర్థిక శక్తి గా ఉంది. చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు, భారతీయ మార్కెట్ ను వాడుకునేందుకు వ్యూహాత్మకంగా, వాణిజ్య పరంగా అమెరికా కు భారత్ అవసరం ఉంది. అయినా సరే ఇంతటి సానుకూల పరిస్థితిని సద్వినియోగం చేసుకో లేక పోయాం. ఏమీ సాధించ లేకపోయాం. ఈ మాత్రం అరకొర దాడులకు ఆపరేషన్ సిందూర్ అంటూ హడావుడి అనవసరం. రొటీన్ గా సైన్యం కశ్మీర్ లో చేసే ఆపరేషన్లు సరిపోతాయి.. దశాబ్దాలుగా అదే చేస్తున్నాం.. ఇప్పుడూ అదే చేయాల్సింది..
ఇక ఎవరు అంగీకరించినా... అంగీకరించక పోయినా..
ఈ పరిణామాల నేపథ్యం లో..
దూకుడు...
సాహసం..
సమర్థత...
మొండి ధైర్యం...
వ్యూహ చతురత...
దీర్ఘ కాలిక ప్రయోజనాల పరిరక్షణ..
అంతిమ విజయం సాధించడం...
అంటే అందరి మనసుల్లో మెదిలే ఒకే ఒక పేరు... ఇందిరా గాంధీ.." అని సీనియర్ జర్నలిస్టు వడ్డాది శ్రీనివాసు విశ్లేషించడం గమనార్హం.
అమెరికా ఎట్లా ప్రకటిస్తుందీ?
భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఈ రెండు దేశాల కన్నా ముందు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించడాన్ని కూడా నెటిజన్లు తప్పు బడుతున్నారు. దీనిపై మీమ్స్, రీల్స్ తామరతంపరగా సోషల్ మీడియాలో పెడుతున్నారు.
మరోవైపు.. పాకిస్తాన్‌తో కాల్పులు విరమణ ఒ‍ప్పందంపై కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. తాజాగా.. కాల్పుల విరమణ అంశంపై తక్షణం ప్రధాని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. పార్లమెంటు ప్రత్యేక సెషన్‌ నిర్వహించి ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని కోరింది.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేష్‌ ట్విట్టర్‌ వేదికగా.. ‘వాషింగ్టన్‌ నుంచి కాల్పుల విరమణ ప్రకటన వచ్చిన నేపథ్యంలో ప్రధాని అధ్యక్షతన తక్షణం అఖిలపక్ష సమావేశం జరగాలి. పార్లమెంటు ప్రత్యేక భేటీని ఏర్పాటుచేసి గత కొన్ని రోజులుగా జరుగుతున్న అంశాలను చర్చించాలి’ అని డిమాండ్‌ చేశారు.

మరో కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేడా స్పందిస్తూ.. గత 5,6 రోజుల్లో దేశం ఏం సాధించిందో, ఏం కోల్పోయిందో ప్రజలకు ప్రభుత్వం చెప్పాలని పేర్కొన్నారు. అలాగే, 1971 యుద్ధం సందర్భంగా సైనికులతో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దిగిన ఫొటోలను కాంగ్రెస్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. ఇందిర లేని లోటు కనిపిస్తోందని పేర్కొంది. ‘ఇందిర ధైర్యం చూపారు. దేశం కోసం నిలబడ్డారు. జాతి పౌరుషంతో ఆమె రాజీ పడలేదు’ అని కాంగ్రెస్‌ తెలిపింది.
Tags:    

Similar News