మరో తొమ్మిది మంది కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు ఖరారు..
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం దశలవారీగా అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తోంది. తాజాగా ఏపీలో తొమ్మిది మంది పేర్లను ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్‌లో మరో తొమ్మిది లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇప్పటికే 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా శ్రీకాకుళం, విజయనగరం, అమలాపురం (ఎస్సీ), మచిలీపట్నం, విజయవాడ, ఒంగోలు, నంద్యాల, అనంతపురం, హిందూపూర్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. శ్రీకాకుళం నుంచి డాక్టర్ పి.పరమేశ్వరరావు, విజయనగరం-బొబ్బిలి శ్రీను, అమలాపురం- జంగా గౌతమ్, మచిలీపట్నం-గొల్లు కృష్ణ, విజయవాడ-వల్లూరు భార్గవ్, ఒంగోలు-ఇ.సుధాకరరెడ్డి, నంద్యాల-జంగిటి లక్ష్మి నరసింహయాదవ్, అనంతపురం- మల్లికార్జున్ వజ్జల, హిందూపురం నుంచి బీఏ సమద్‌షహీన్ పోటీ చేయనున్నారు.
कांग्रेस अध्यक्ष श्री @kharge की अध्यक्षता में आयोजित 'केंद्रीय चुनाव समिति' की बैठक में लोकसभा चुनाव, 2024 के लिए आंध्र प्रदेश और झारखंड के कांग्रेस उम्मीदवारों की लिस्ट। pic.twitter.com/GxnMtoKAkH
— Congress (@INCIndia) April 21, 2024
ఆంధ్రప్రదేశ్‌లోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI), CPI (M) భారత కూటమి భాగస్వాములు. కాంగ్రెస్ 126 అసెంబ్లీ, 20 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. సీట్ల పంపకాల్లో భాగంగా వామపక్షాలు ఒక లోక్‌సభ, ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.