గ్రీన్ ల్యాండ్ ను ట్రంప్ ఎందుకు కొనుగోలు చేయాలనుకుంటున్నారు?

వ్యూహాత్మక ప్రయోజనమా? ఇంకేదైనా ఉందా?;

Update: 2025-01-21 09:29 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్దికాలంగా అమెరికాలో చేరాల్సిందిగా కెనడాను డిమాండ్ చేస్తూనే గ్రీన్ ల్యాండ్, పనామా కాల్వను అమ్మాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నాడు. ఇందులో గ్రీన్ ల్యాండ్ కొనుగోలు అత్యంత కీలక అంశంగా కనిపిస్తోంది. ఇక్కడ జనాభా సంచారం చాలా తక్కువ. ఎక్కువగా మంచుతో కప్పబడి ఉంటుంది. ఎక్కువగా చలి ప్రభావంతో జీవన విధానం కష్టంగా ఉంటుంది. కానీ దాన్ని కొనుగోలు చేయడానికి ఆయన చాలా ఉత్సాహం చూపుతున్నారు.

గ్రీన్ ల్యాండ్ విషయంలో మొదటగా కనిపించేది ఎయిర్ స్పేస్ నావిగేషన్ ఫీజులు. కానీ లోతుగా ఆలోచన చేస్తే గ్లోబల్ జియోపాలటిక్స్ లో దాని ప్రాముఖ్యత కనిపిస్తుంది. ఉదాహారణకు అమెరికా నుంచి గ్రీన్ ల్యాండ్ మీదుగా ప్రయాణించే విమానాలకు నావిగేషన్ ఫీజులను నెలవారీ వినియోగం ఎక్కువగా ఉంటుంది. కేవలం కొన్ని ఆపరేటర్లకు ఉచిత పాస్ ఇస్తారు.
కానీ రష్యా, చైనా మాత్రం తమ దేశం మీదుగా ప్రయాణించే ప్రతి విమానానికి చార్జీ విధిస్తారు. అది కూడా భారీ రేట్ తో వసూలు చేసుకుంటారు. అలాస్కా, నరీటా, టోక్యోకి వెళ్లే విమానాలు రష్యా గగనతలాన్నిదాటితే ఆ దేశానికి 1200 డాలర్లు చెల్లించాలి. టెర్మినల్ వాడుకుంటే మరో 1800 డాలర్లు కట్టాలి. వీటిలో కొంత భాగాన్ని తగ్గించుకోవడానికే గ్రీన్ ల్యాండ్ కొనుగోలు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.
భౌగోళిక రాజకీయాలు..
భౌగోళిక రాజకీయ విషయాలను తీసుకుంటే.. గ్రీన్ ల్యాండ్ లో 53 వేల మంది నివాసం ఉంటున్నారు. ఇక్కడ అనేక వనరులు ఉన్నాయి. వ్యూహత్మకంగా అమెరికాకు దగ్గరలో ఉంది. అంతర్జాతీయ నౌక ప్రయాణాలు, సైనిక బేస్ ల ఏర్పాటుకు అనుకూలంగా ఉంది. అలాగే బంగారం నిక్షేపాలకు ఈ దీవి ఆలవాలం. Full View
గ్రీన్ ల్యాండ్ అమెరికాలో 51వ లేదా 52వ రాష్ట్రంగా చేరడానికి అంగీకరిస్తే లూసియానా కొనుగోలు తరువాత అతిపెద్ద శాంతియుత విస్తరణలో ఒకటిగా చెప్పవచ్చు. ఇవి రష్యా ఆదాయాన్ని దెబ్బతీయడానికి మెరుగ్గా ఉపయోగడపడుతుంది. అమెరికా కంపెనీలు మైనింగ్ చేయడానికి మంచి దీవి ఇది.
కొత్త ఆలోచన కాదు..
గ్రీన్ ల్యాండ్ ప్రాముఖ్యత అనేది కొత్తగా వచ్చిన ఆలోచన కాదు. దశాబ్ధాలుగా అమెరికా కన్ను దీనిపై ఉంది. 1940 లో జర్మనీ, డెన్మార్క్ ను ఆక్రమించినప్పుడూ అమెరికన్ దళాలు ఇక్కడకు చేరుకున్నాయి.
1946 లో అమెరికా ప్రెసిడెంట్ హ్యారీ ట్రూమన్ 100 మిలియన్ల బంగారాన్ని ఈదీవిని కొనుగోలు చేయడానికి ప్రతిపాదించగా, డెన్మార్క్ తిరస్కరించింది. కానీ అమెరికన్ సైన్యం మాత్రం ఉండటానికి అంగీకరించింది. నాటో ఆవిర్భావం, ప్రచ్ఛన్న యుద్ధకాలంలో ఈదీవి కీలకపాత్ర పోషించింది. అలాగే ప్రారంభ క్షిపణి హెచ్చరిక వ్యవస్థలకు నిలయం. వ్యూహాత్మకంగా యూరప్, ఉత్తర అమెరికా మధ్య మార్గంలో ఇది నెలకొని విమాన ప్రయాణాలకు అనుకూలతను ఏర్పరుస్తోంది.
తాజాగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ట్రంప్ దీని కొనుగోలు అంశం లేవనెత్తారు. ఇది కూడా 2019 నాటి ఆలోచన. ఈ మధ్య విస్తృతంగా వైరల్ గా మారింది.
పెరుగుతున్న విలువ
ప్రస్తుతం కొనుగోలు భావనను ఆ డెన్మార్క్ కొట్టివేసింది. కానీ దాని వ్యూహత్మక ప్రాముఖ్యత ఏంటో మరోసారి ప్రపంచం ముందుకు చర్చకు వచ్చింది. రాజకీయ నాయకులు మాత్రం దీనిపై ఆసక్తి చూపడం లేదు. ఎయిర్ లైన్స్ సంస్థలు కూడా దీనిని పెద్దగా పట్టించుకున్న దాఖలా లేదు. యునైటెడ్ ఎయిర్ లైన్స్ విభాగం కూడా అదే ఆలోచనతో కనిపిస్తోంది.
కాబట్టి ట్రంప్ హాయాంలో ఇది వాస్తవ రూపం దాలిస్తే అది అమెరికా అంతర్భాగం అవుతుంది. లేదా వ్యూహత్మక ఒప్పందాలతో గ్రీన్ ల్యాండ్ భూభాగాన్ని తమ అవసరాలకు వాడుకోవచ్చు. అయితే ఈ కథ ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.


Tags:    

Similar News