భారత్ లో ఐఫోన్ కొత్త ప్రణాళికలు.. చైనా సరఫరా వ్యవస్థలో ఇబ్బంది..
ఆపిల్ సంస్థ ఇండియాలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో దేశంలో తన తయారీ..
By : Praveen Chepyala
Update: 2024-07-08 08:01 GMT
భారత్ లో ఐఫోన్ విస్తరణ ప్రణాళికలు రచిస్తుందని కొన్ని ప్రభుత్వ వర్గాలు అనధికారికంగా వెల్లడించాయి. తన ఐఫోన్ ఐప్యాడ్ లను ఇండియాలో తిరిగి పున: ప్రారంభించడానికి ఆపిల్ సంస్థ ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని మనీకంట్రోల్ నివేదికలో వెల్లడించింది. చైనా- BYD భాగస్వామ్యంతో భారతదేశంలో ఐప్యాడ్‌లను ఉత్పత్తి చేయడానికి అప్పట్లో కొన్ని ప్రయత్నాలు చేశారు. అయితే చైనా- భారత్ మధ్య సరిహద్దు ఉద్రిక్తత నేపథ్యంలో ఈ ప్రయత్నాలు అప్పట్లో సాధ్యంకాలేదు. ఆ తరువాత వియత్నాంలో ఈ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది.
ఇండియా కోసం ఆపిల్ పెద్ద ప్రణాళికలు..
అయితే, మనీకంట్రోల్ నివేదిక ప్రకారం, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. రాబోయే సంవత్సరాల్లో ఆపిల్ ఐప్యాడ్‌లను మాత్రమే కాకుండా ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లను కూడా దేశంలో తయారు చేయాలని ప్రభుత్వం కోరనున్నట్లు తెలిసింది. దీనికోసం కంపెనీ ప్రతినిధులతో త్వరలో సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది.
ఇదే జరిగితే యాపిల్ సంస్థ దేశంలో తన కార్యకలాపాల కోసం పెద్ద ప్రణాళికలను రచించాల్సి ఉంటుంది. ఇప్పుడు చైనా లో సరఫరా గొలుసుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా మరో సరఫరా గొలుసులకు నిర్మించాల్సి ఉందని కంపెనీ భావిస్తోంది. ఈ ప్రణాళికలు ఫలవంతమైతే, ఇంకొంత మంది Apple భాగస్వాములు దేశానికి వస్తారని ఇప్పటికే దేశంలో ఉన్న దాని భాగస్వాములు తమ సామర్థ్యాలను విస్తరించుకునే అవకాశం ఉంది.
ఆపిల్ ఐఫోన్ ఉత్పత్తిలో..
ఆపిల్ తన ఐఫోన్ తయారీ సామర్థ్యాలను ప్రపంచవ్యాప్తంగా పెంచుకునే అవకాశం కనిపిస్తోంది. భారతదేశంలో ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ ద్వారా తన దూకుడును కొనసాగించాలని ప్రణాళికలు రచిస్తోంది. టాటా కంపెనీ ఇప్పటికే దేశంలో విస్ట్రోన్ కార్యకలాపాలను కొనుగోలు చేసింది. ఇప్పుడు పెగాట్రాన్ ఇండియా కార్యకలాపాలను కూడా కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. పెగాట్రాన్ చెన్నైలో ఐఫోన్ తయారీ యూనిట్, నిర్మాణంలో ఉన్న మరో ఫ్యాక్టరీ ఉంది.
దేశంలో వాడుతున్న ఐఫోన్ లో 14 శాతం మాత్రమే ఇక్కడ తయారు చేస్తున్నారు. వీటి విలువ రూ. 14 బిలియన్ డాలర్లు. వచ్చే మూడు నాలుగేళ్లలో ఇది 25 శాతానికి పెంచాలని ఆపిల్ సంస్థ ప్రణాళికలు తయారు చేస్తోందని భారత ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇది చైనా నుంచి వస్తున్న ముడిపదార్థాల దిగుమతిని తగ్గించి స్థానికంగా ఉత్పత్రి ఆధారిత నెట్ వర్క్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో యాపిల్ భారత్ నుంచి 2 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్‌లను ఎగుమతి చేసింది. గత సంవత్సరం, కంపెనీ 10 మిలియన్లకు పైగా ఐఫోన్‌లను ఎగుమతి చేసింది, 2022లో 6 మిలియన్లకు పైగా ఐఫోన్‌లు ఇక్కడకు వచ్చాయి.
ఎయిర్ పాడ్ ల ఉత్పత్తి
దేశంలో Jabil Inc ద్వారా AirPod వైర్‌లెస్ ఛార్జింగ్ కేసుల కోసం విడిభాగాల ఉత్పత్తిని పెంచాలని Apple పరిశీలిస్తోంది. జబిల్ ఒక అమెరికన్ బహుళజాతి కాంట్రాక్ట్ తయారీ సంస్థ. ఇది పూణేలో వైర్‌లెస్ ఛార్జింగ్ కేసుల భాగాల ట్రయల్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ భాగాలను దేశంలో తయారు చేయమని ఆపిల్ ఫాక్స్‌కాన్‌ను కూడా కోరవచ్చని తెలిసింది.
అంతే కాదు, యాపిల్ ఎగుమతి, దేశీయ అవసరాలను తీర్చడానికి దేశంలో AirPods ఉత్పత్తిని ప్రారంభించవచ్చు. ఆపిల్ దాని ఎయిర్‌పాడ్‌ల కోసం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మార్కెట్ వాటా ఉంది. ఈ ప్రణాళికలన్నీ రూపుదిద్దుకుంటే, దేశంలో త్వరలో Apple(iPhoneలు, iPadలు, AirPodలు) మూడు ఉత్పత్తులు కేంద్రంగా మారవచ్చు.