హసీనాకు ఆశ్రయం ఇస్తే మున్ముందు ఇబ్బందులు: బీఎన్పీ

హసీనాకు ఆశ్రయం ఇస్తే మున్ముందు భారత్ కు ఇబ్బందులు తప్పవని ప్రతిపక్ష పార్టీ బీఎన్పీ హెచ్చరికలు పంపింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు కూడా ఎఫెక్ట్ అవుతాయని..

Update: 2024-08-09 11:22 GMT

బంగ్లాలో ఇంకా అధికారంలోకి రాకముందే అక్కడి ప్రతిపక్ష పార్టీ బీఎన్పీ భారత్ కు పరోక్షంగా హెచ్చరికలు పంపింది. షేక్ హసీనాకు ఆశ్రయం ఇస్తే ముందు ముందు ఇబ్బందులు తప్పవని హింట్ ఇచ్చింది. అసలు భారత్ కు హసీనాకు ఆశ్రయం ఇవ్వడం ఇష్టం లేదని కూడా వ్యాఖ్యానించింది. న్యూఢిల్లీ "మా శత్రువు"కి సహాయం చేస్తే దేశాల మధ్య పరస్పర సహకారం కష్టమని పేర్కొంది. హసీనా అవామీ లీగ్ పార్టీకి బీఎన్‌పీ కీలక ప్రత్యర్థి.

ఉద్యోగాల్లో వివాదాస్పద కోటా విధానంపై తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు రావడంతో హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆమె సోమవారం బంగ్లాదేశ్ సైనిక విమానంలో ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్ బేస్‌కు వెళ్లింది.
నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ మహ్మద్ యూనస్ గురువారం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఢాకాలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయించారు. భారత్ - బంగ్లాదేశ్ పరస్పర సహకారాన్ని కలిగి ఉండాలని, ఆ స్ఫూర్తిని అనుసరించే విధంగా భారత ప్రభుత్వం "అర్థం చేసుకుని ప్రవర్తించవలసి ఉంటుంది" అని ప్రముఖ BNP కార్యకర్త గయేశ్వర్ రాయ్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో అన్నారు.
BNP స్టాండింగ్ కమిటీ సభ్యుడు అయిన రాయ్, దాని అత్యున్నత నిర్ణయాధికార సంస్థ, “బంగ్లాదేశ్ - భారత్ పరస్పర సహకారం కలిగి ఉండాలని BNP విశ్వసిస్తుంది. ఆ స్ఫూర్తిని అనుసరించే పద్ధతిలో భారత ప్రభుత్వం అర్థం చేసుకుని, ప్రవర్తించాలి. కానీ మీరు మా శత్రువుకు సహాయం చేస్తే, ఆ పరస్పర సహకారాన్ని గౌరవించడం కష్టమవుతుంది.
“మా మాజీ విదేశాంగ మంత్రి (హసీనా ప్రభుత్వంలో) గత ఎన్నికలకు ముందు ఇక్కడ షేక్ హసీనా అధికారంలోకి రావడానికి భారత్ సాయం చేస్తుందని చెప్పారు. షేక్ హసీనా బాధ్యతను భారత్ భరిస్తోంది. భారత్ - బంగ్లాదేశ్ ప్రజలకు ఒకరికొకరు సమస్యలు లేవు. అయితే భారత్ మొత్తం దేశాన్ని కాకుండా ఒక పార్టీని ప్రోత్సహించిందని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే హసీనా కుమారుడు మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యం పునరుద్దరణకు తన తల్లి బంగ్లాదేశ్ కు తిరిగి వస్తుందని, దేశంలో అశాంతికి ఆజ్యం పోస్తున్న పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
76 ఏళ్ల హసీనా కచ్చితంగా బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చినప్పటికీ, ఆమె "రిటైర్డ్ లేదా క్రియాశీల" రాజకీయ నాయకురాలిగా తిరిగి వస్తారా అనేది ఇంకా నిర్ణయించబడలేదు అని జాయ్ ఓ మీడియా సంస్థకి చెప్పారు.
“అవును, ఆమె బంగ్లాదేశ్‌కు తిరిగి రాదని నేను చెప్పింది నిజమే. అయితే దేశవ్యాప్తంగా మా నాయకులు, పార్టీ కార్యకర్తలపై నిరంతర దాడుల తరువాత గత రెండు రోజుల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు మేము మా ప్రజలను సురక్షితంగా ఉంచడానికి ఏమైనా చేయబోతున్నాం; మేము వారిని ఒంటరిగా వదిలి వెళ్లడం లేదు,” అని అతను వార్తా సంస్థతో చెప్పాడు.
" అవామీ లీగ్ బంగ్లాదేశ్‌లో అతిపెద్ద పురాతన రాజకీయ పార్టీ, కాబట్టి మేము మా ప్రజల నుంచి దూరంగా వెళ్లలేం. ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడిన తర్వాత ఆమె కచ్చితంగా బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తుంది,” అన్నారాయన.
Tags:    

Similar News