షేర్లు అమ్మట్లేదన్న పేటీఎం.. కొనట్లేదన్న అదానీ..

పేటీఎంలో షేర్లు కొనడానికి అదానీ గ్రూప్ చర్చలు చేస్తుందన్న అంశాన్ని ఇరు వర్గాలు తిరస్కరించాయి. అవన్ీన అవాస్తవాలన్నాయి. అసలేం జరిగింది.

Update: 2024-05-29 10:36 GMT

‘వ్యాపారవేత్త గౌతమ్ అదానీ.. పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌లో భరీ మొత్తం షేర్లు కొనడానికి సిద్ధం అయ్యారు. వన్97 కూడా ఇందుకు అంగీకరించింది’ కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్న విషయం ఇదే. తాజాగా వీటిపై ఇరు వర్గాలు క్లారిటీ కూడా ఇచ్చాయి. ఈ వార్తలన్నీ అవాస్తవాలని, వీటిని నమ్మొద్దని వన్97 మ్యూనికేషన్స్ అధికారికంగా వెల్లడించింది. షేర్లు కొనుగోలుకు సంబంధించి పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్‌ శర్మతో అదాని చర్చలు చేస్తున్నరాన్న విషయం వట్టి బూటకమని కొన్ని పారేశారు ఇరు వర్గాల వారు.

క్లారిటీ ఇచ్చిన సంస్థ ప్రతినిధులు

ఈ విషయంపై వన్97 కమ్యూనికేషన్స్‌తో పాటు అదానీ గ్రూప్ ప్రతినిధి కూడా స్పందించారు. ఇందులో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. ‘‘సంస్థలో వాటా అమ్మకానికి సంబంధించి మేము అదాని గ్రూప్‌తో ఎటువంటి చర్చలు కొనసాగించడం లేదు. వీటిని ఎట్టిపరిస్థితుల్లో నమ్మొద్దు’’అని ప్రకటించింది. అదే సమయంలో అదానీ గ్రూప్ ప్రతినిధి.. ‘‘ఈ అసత్య ప్రచారాలను మేము పూర్తిగా ఖండిస్తున్నారు. ఇది పూర్తిగా అబద్దం’’ అని చెప్పారు. ఇదిలా ఉంటే పేటీఎం సంస్థలో శర్మకు 9.1 శాతం వ్యక్తిగతంగా సామర్థ్యంతో కొనుగోలు చేసుకున్నారు. దాంతో పాటుగా మార్చి చివరి నాటికి రెసిలెంట్ అసెట్ మేనేజ్‌మెంట్ అనే విదేశీ సంస్థ ద్వారా మరో 10.3 శాతం కొనుగోలు చేశారు.

దివాలా తీయనున్న పేటీఎం

ఈ ఏడాది మర్చి నెలలో సంస్థ తన బ్యాంకింగ్ యూనిట్‌ను నిలిపివేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇది జరడంతో సంస్థ విలువ 50శాతం వరకు తగ్గిపోయింది. అప్పటి నుంచే వన్97 కమ్యూనికేషన్స్‌కు చెందిన పేటీఎం దివాలాకు దగ్గరపడిందని ప్రచారం జరగడం మొదలైంది. ట్రిప్పు ట్రిప్పుకు ఒక కొత్త వ్యక్తి, వ్యాపారవేత్త, విదేశీ సంస్థల పేర్లు ఈ వ్యవహారంలో వినిపిస్తున్నాయి. ఇందులో అదానీ కన్నాముందు ముఖేష్ అంబానీ పేరు కూడా వినిపించింది. పేటీఎం‌లో అధిక శాతం షేర్లు కొనుగోలు చేయడానికి ముఖేష్ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీస్‌స్ చర్చలు చేస్తోందని ప్రచారం జరిగింది. కాగా దీనిని కూడా రెండు సంస్థలు ఖండించాయి. అందులో వాస్తవం లేదని తేల్చి చెప్పాయి. ఇప్పుడు అదే తరహాలో అదానీ గ్రూప్ పేరు వినిపిస్తోంది.

అప్పటి నుంచే కష్టాలు

పేటీఎం బ్యాంకింగ్ లావాదేవీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేధం విధించింది. ఎటువంటి క్రెడిట్, డిపాజిట్, కస్టమర్ ఖాతాలు, ఫాస్ట్‌ట్యాగ్‌లు వంటి ఎటువంటి లావాదేవీలు జరగకూడదని ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. మార్చి 15 నుంచి ఈ నిషేధం అమలైంది. అప్పటి నుంచి తమ సంస్థ తీవ్ర నష్టాలను నమోదు చేస్తున్నట్లు పేటీఎం వెల్లడిస్తోంది. 2023-2024 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో తమకు రూ.550కోట్ల నష్టం వచ్చినట్లు పేటీఎం ప్రకటించింది. ఈ నష్టం రానున్న రోజుల్లో మరింత పెరగనున్నట్లు సంస్థ ప్రకటించింది.

Tags:    

Similar News