గంటల వ్యవధిలో మూడో దాడి.. అమెరికాలో ఏం జరుగుతోంది?

న్యూయార్క్ క్లబ్ లో కాల్పులు జరిపి పారిపోయిన ఇద్దరు దుండగులు;

Update: 2025-01-02 08:02 GMT

కొత్త సంవత్సరం వేళ అమెరికాలో వరుసగా రెండో దుర్ఘటన చోటు చేసుకుంది. న్యూయార్క్ లోని ఓ నైట్ క్లబ్ లో కొత్త సంవత్సరం ఎంజాయ్ చేస్తున్న ప్రజలపై దుండగులు కాల్పులు జరపడంతో 13 మంది గాయపడినట్లు సమాచారం. ఈ క్లబ్ లో పార్టీ చేసుకుంటున్న వారిలో ప్రముఖ జర్నలిస్టుల, చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు, ప్రముఖ పోలీసులు సైతం ఉన్నారు. కాల్పులు జరిపిన వ్యక్తుల తరువాత అక్కడి నుంచి పారిపోయారు.

సిటిజన్ యాప్ ప్రకారం.. పోలీసులు, వైద్య సిబ్బంది గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. అందులో ఇద్దరి పాదాలకు బుల్లెట్ గాయాలు ఉన్నాయి. కొంతమంది క్ల బ్ పేరు ‘ అమాజురా’ గా పేర్కొన్నారు. కాల్పులు జరిపింది ఇద్దరు వ్యక్తులని అనుమానిస్తున్నారు. రెండు వైపుల నుంచి కాల్పులు జరపడంతో 13 మందికి గాయాలయ్యాయని ఓ రిపోర్టర్ సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు.
న్యూ ఓర్లీన్స్ టెర్రర్ స్టైక్..?
అంతకుముందు జనవరి 1న న్యూ ఓర్లీన్స్ లో ఓ అద్దె ట్రక్కుతో ఓ డ్రైవర్ షాపింగ్ చేస్తున్న ప్రజల పైకి దూసుకురావడంతో కనీసం 15 మంది చనిపోయారు. డజన్ల కొద్ది గాయపడ్డారు. ఈ దాడిని ఉగ్రవాద దాడిగా అనుమానిస్తున్నామని ఎఫ్బీఐ తెలిపింది. దాడి తరువాత కాల్పులు జరిగాయని, అందులో నిందితుడు మరణించాడని దర్యాప్తు సంస్థ పేర్కొంది. చనిపోయిన వ్యక్తిని మాజీ ఆర్మీ వెటరన్ గా గుర్తించింది. దాడి సమయంలో ట్రక్కులో ఐఎస్ఐఎస్ జెండా ఉన్నట్లు స్థానిక మీడియా వార్తలు ప్రసారం చేసింది.
లాస్ వేగాస్ లో ట్రక్కు పేలి..
లాస్ వేగాస్ లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ వెలుపల అద్దెకు తీసుకున్న టెస్లా సైబర్ ట్రక్ కూడా సడన్ గా పేలిపోయింది. అది కూడా హోటల్ ప్రవేశ ద్వారం దగ్గర పేలడంతో ఓ కస్టమర్ మరణించారు. దీనిని కూడా ఉగ్రవాద చర్యగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడిలో ఏడుగురికి గాయాలయ్యాయి. న్యూ ఓర్లాన్స్, లాస్ ఏంజెల్స్ దాడికి గురైన వాహానాలు ఒకే కంపెనీ నుంచి అద్దెకు తీసుకున్నారు. ఇది కూడా అనుమానాలకు తావిస్తోంది.
జర్మనీలో క్రిస్మస్ పండగ వేళ..
కొన్ని రోజుల క్రితం జర్మనీ లోని మాగ్డేబర్గ్ లోని క్రిస్మస్ షాపింగ్ చేస్తున్న ప్రజలపై ఓ కార్ దూసుకురావడంతో ఐదుగురు మరణించగా కనీసం 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడు సౌదీ అరేబియాకు చెందిన 50 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు. తనను తాను ఎక్స్ ముస్లింగా ప్రకటించుకున్న నిందితుడు, ఎప్పుడూ కూడా సామాజిక మాధ్యమాల్లో ఇస్లాం వ్యతిరేక పోస్టులు పెట్టేవాడు. కానీ నిందితుడు ఇందుకు విరుద్దంగా గల్ఫ్ నుంచి అక్రమంగా వలసలు ప్రోత్సహించడం, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చేవాడని అభియోగాలు ఉన్నాయి. అతనిపై అనేక కేసులు ఉన్నప్పటికీ అప్పటి ఏంజేలా మెర్కెల్ సర్కార్ అతడిని సౌదీకి అప్పగించడానికి నిరాకరించింది.


Tags:    

Similar News