జేమ్స్‌ కామెరూన్‌ లేటెస్ట్ మూవీ ‘ఘోస్ట్స్‌ ఆఫ్‌ హిరోషిమా’.. మరో ‘అవతార్’ అవుతుందా?

‘టైటానిక్‌’ లాంటి అరుదైన హిస్టారికల్ బ్లాక్‌ బ్లస్టర్‌ను అందించిన జేమ్స్‌ కామెరూన్‌ (James cameron) గురించి ఎంత మాట్లాడినా తక్కువే.

Update: 2024-09-19 07:04 GMT

‘టైటానిక్‌’ లాంటి అరుదైన హిస్టారికల్ బ్లాక్‌ బ్లస్టర్‌ను అందించిన జేమ్స్‌ కామెరూన్‌ (James cameron) గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఆ సినిమా తర్వాత ‘అవతార్‌’ సినిమాతో ప్రపంచ సినీ చరిత్రనే మరోసారి తిరగరాశాడు. ‘అవతార్‌ ’ఇంకొన్ని సీక్వెల్స్ రానున్నాయి. అయితే వాటి షూటింగ్ లు, మిగతా పనులు కూడా దాదాపు ఆల్రెడీ పూర్తైనట్లు రిలీజ్ డేట్స్ కూడా ప్రకటించేసారు. ఈ నేపధ్యంలో ఆయన తదుపరి చిత్రం ఏంటనే ఆసక్తి కలగటం సహజం. ఈ విషయమై ఇప్పుడో వార్త అంతటా వైరల్ అవుతోంది.

జేమ్స్‌ కామెరూన్‌ ‘లాస్ట్‌ ట్రైన్‌ ఫ్రమ్‌ హిరోషిమా’ పేరుతో ఓ సినిమా చేయనున్నారనేదే ఆ వార్త సారాంశం. అమెరికన్‌ ప్రముఖ రచయిత చార్లెస్‌ ఆర్‌. పెల్లెగ్రినో రాసిన ‘ఘోస్ట్స్‌ ఆఫ్‌ హిరోషిమా’ బుక్‌ హక్కులను సొంతం చేసుకున్నారు జేమ్స్‌ కామెరూన్‌. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణు బాంబులతో దాడి చేసింది. ఆ సమయంలో ప్రాణాలతో బతికి బయటపడ్డ జపాన్‌ ఇంజనీర్‌ సుటోము యమగుచి జీవితం ఆధారంగా ‘లాస్ట్‌ ట్రైన్‌ ఫ్రమ్‌ హిరోషిమా’ సినిమా తెరకెక్కనుందని అక్కడ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

చార్లెస్‌ రాసిన ‘ఘోస్ట్స్‌ ఆఫ్‌ హిరోషిమా’, ‘లాస్ట్‌ ట్రైన్‌ ఫ్రమ్‌ హిరోషిమా’... ఈ రెండు బుక్స్‌ని కలిపి సినిమా తీయనున్నారట జేమ్స్‌ కామెరూన్‌. ఈ పుస్తకాలు ఇంకా మార్కెట్ లోకి రాలేదు. ఈ పుస్తకం బ్లాక్‌స్టోన్ పబ్లిషింగ్ ద్వారా వచ్చే ఏడాది (2025) ఆగస్టులో విడుదల కానుంది. ఈ లోగా సినిమాగా రూపొందించేందుకు ఈ పుస్త‌కాన్ని కామెరూన్ కొనుగోలు చేసార‌ని స‌మాచారం. ఇక జ‌పాన్ పై అమెరికా అణుబాంబుల‌తో దాడి చేయ‌గా హిరోషిమా, నాగ‌సాకి న‌గ‌రాల నుంచి లక్షకు పైగా మరణించినట్లు చెప్తారు. హిరోషిమా నగరంలో రెండు వంతుల భవనాలు ఒక్క క్షణంలోనే ధ్వంసమయ్యాయి. కొన్ని కిలోమీటర్ల వరకూ మంటలు తుపానులా వ్యాపించటం జరిగిందిట. ఒక్క క్షణంలోనే నగరంలోని రెండున్నర లక్షల జనాభాలో 30 శాతం మంది అంటే 80 వేల మందిని మృత్యువు బలి తీసుకుందిని తేలింది.

ఇక బాంబు దాడుల స‌మ‌యంలో యమగుచి అనే ఇంజినీర్ హిరోషిమా- నాగసాకిలను సందర్శిస్తున్నారు. అమెరికా బాంబ్ దాడుల్లో మ‌ర‌ణించ‌కుండా అత‌డు ఎస్కేప్ అయ్యాడు. ఇప్పుడు అత‌డి ఆస‌క్తిక‌ర క‌థ‌ను సినిమాగా తీసేందుకు కామెరూన్ ప్ర‌య‌త్నిస్తున్నారు. అవతార్ సిరీస్‌లో తన కమిట్‌మెంట్‌లను పూర్తి చేసిన తర్వాత కామెరాన్ `ఘోస్ట్స్ ఆఫ్ హిరోషిమా`ను స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇక ఇప్పటికే అణుబాంబ్ ని క‌నిపెట్టిన అమెరిక‌న్ పితామ‌హుడిపై క్రిస్టోఫ‌ర్ నోలాన్ ఓపెన్ హైమ‌ర్ అనే సినిమాని తెర‌కెక్కించ‌గా అది సంచ‌ల‌నాలు సృష్టించింది. ఇప్పుడు జ‌పాన్ న‌గ‌రాల‌పై అమెరికా అణుబాంబ్ దాడుల‌ను కామెరూన్ సినిమా గా తీస్తుండ‌డం నిజంగా ఆస‌క్తిని క‌లిగించే విషయమే.

వాస్తవానికి ‘టైటానిక్‌’ విడుదలకు ముందు వరకూ కామెరూన్‌కి సినిమాలే ప్రపంచం. తాను తీసిన సినిమానే తన జీవితంలో పెద్ద మార్పు తెచ్చింది అంటుంటాడు. ’‘టైటానిక్‌’ సినిమాను ప్రేక్షకుడిగా చూశాక మనుషులూ, జీవితం అంతకంటే ముఖ్యమని తెలుసుకున్నా’ అనే కామెరూన్‌ అప్పటివరకూ కోపంగా అందరిపై అరిచే ధోరణిని మార్చుకున్నారు. ఆయన సినిమాల్లోనూ మార్పు వచ్చింది. ప్రస్తుతం ‘అవతార్‌’ ఫ్రాంచైజీతో జేమ్స్‌ కామెరూన్‌ బిజీగా ఉన్నారు. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే ‘అవతార్‌ (2019), అవతార్‌: ద వే ఆఫ్‌ వాటర్‌’ (2022) చిత్రాలు విడుదల అయ్యాయి. ‘అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌’ (అవతార్‌ 3) చిత్రం 2025లో రిలీజ్‌ కానుంది.

Tags:    

Similar News