పవన్ కల్యాణ్ ‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు’ రివ్యూ

ధర్మ–అధర్మ పోరాటంలో వీరమల్లు గెలిచాడా? సనాతన ధర్మాన్ని నిలబెట్టాడా?;

Update: 2025-07-24 09:46 GMT

అది 16వ శతాబ్దం. భారతదేశంలో ఓ అంధకార శకం నడుస్తోంది. అప్పటి మొఘల్ సామ్రాజ్య ఉనికికి ముప్పుగా మారిన హిందూ సంప్రదాయాన్ని సమూలంగా నాశనం చేయాలనే సంకల్పంతో మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు (బాబి డయోల్) నడుస్తున్నాడు. ఔరంగజేబు పాలన క్రూరతకు మరో పేరు. మత బలవంతాలు, సంపదల దోపిడీ, పన్నులతో ప్రజల పీడించటం... దేశమంతా మౌనంగా రోదిస్తూ రోజులు గడుపుతోంది. అదే సమయంలో జనాల్లో ఒకడి పేరు చుట్టూ మాత్రం చైతన్యం జనిస్తోంది —ఆ పేరే హరిహర వీరమల్లు (పవన్ కళ్యాణ్). అతనో రాబిన్ హుడ్ టైప్ దొంగ. అలాగే సనాతన ధర్మ రక్షణకు నడుం బిగించినవాడు. అతను దొంగతనానికి వెళ్తే అసాధ్యం అనేది ఉండదు.

వీర మల్లు బుద్ధి, చాకచక్యం గమనించిన గోల్కొండ నవాబు, అతనికి ఒక అసాధ్యమైన పనిని అప్పగిస్తాడు. అది ఔరంగజేబ్ సింహాసనంపై ఉన్న కోహినూర్ వజ్రాన్ని తిరిగి గోల్కొండకు తేవాలని. అయితే ఆ ప్రమాదకరమైన పని ఒప్పుకునేందుకు హరి హర వీరమల్లుకు ఒక కారణం ఉంటుంది. అదేమిటి, డిల్లీకి వెళ్లి కోహినూరుని తెచ్చే క్రమంలో మార్గమధ్యంలో అతనికి ఎదురయ్యే ప్రేమ (పంచమి పాత్రలో నిధి అగర్వాల్), ధర్మ–అధర్మ పోరాటాలు, అడ్డంకులు చుట్టూ మిగతా కథ తిరుగుతుంది.

విశ్లేషణ

హిస్టరీ నిజాలను చెబుతుంది, కానీ హిస్టారికల్ ఫిక్షన్ మనకు ఆ కాలాన్ని అనుభవించించే అవకాశం ఇస్తుంది. అలాంటి హిస్టారికల్ ఫిక్షన్ గా వచ్చిన ఈ చిత్రం "ఔరంగజేబ్ అనే దుర్మార్గుడుని ఓ సామాన్యుడు ఎలా ఎదుర్కొంటాడు?" — అనే ప్రశ్నతో కథ ప్రారంభమవుతుంది. ఈ ఊహ, కథకు ఓ మంచి కాంప్లిక్ట్స్ సెట్ చేయగలిగించగలిగింది. కానీ అందుకు తగ్గ సీన్స్ తో స్క్రీన్‌పైకి తీసుకురావడంలో finesse (నైపుణ్యం) లోపించింది. ఆ స్దాయి భారీ విజన్‌ని తెరపైకి తీసుకురావటంలో తడబడింది.

హిస్టారికల్ ఫిల్మ్‌గా సినిమాకు ఉండాల్సిన గంభీరత, కథ,పాత్రలు ఉన్నాయి. కానీ వాటిని తెరపైకి తీసుకొచ్చే execution పూర్తిగా వెనుకబడింది. నిజానికి సినిమాలో హరి హర వీరమల్లు పాత్ర సమస్యలో పడటం అనేది ఎక్కడా జరగదు. ఇంట్రవెల్ దగ్గర చిన్న ట్విస్ట్ ఇస్తాడు కానీ అదేమీ ఆ పాత్ర స్దాయికి ఆనదు. దాంతో తెరపై కథ, సంఘటనలు వరసగా వెళ్తూంటాయి... కానీ చూసే మనకు పెద్దగా ఏమీ అనిపించదు. ఇది స్క్రీన్ ప్లే పరంగా పెద్ద ఇబ్బంది.

ఇక ఈ సినిమాలో పాంచమీ (నిధి అగర్వాల్) పాత్రను కథ ప్రారంభంలో బలంగా ఎస్టాబ్లిష్ చేసినా, తరువాత మాత్రం ఆమె పాత్ర ఫేడవుట్ అవుతుంది. ఎటువంటి భావోద్వేగాల్లేకుండా, ఆమె పాత్ర కేవలం ఒక పాట కోసం వచ్చినట్టు అనిపిస్తుంది. ఔరంగజేబ్ (బాబీ డియోల్) పాత్రలో క్రూరత్వం ఉంది కానీ అది ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలి. అలాగే అతను హరి హర వీర మల్లు గురించి తెలుసుకుని, అతను గురించి ఆలోచించేసరికే ప్రీ క్లైమాక్స్ వచ్చేసింది. అలాగే హీరో, విలన్ రెండు పాత్రలు ఎదురెదురుగా కలిసే సరికే క్లైమాక్స్ వచ్చేసింది. దాంతో అసలు సెకండాఫ్ లో కథే నడిచినట్లు అనిపించలేదు.

ఇలాంటి సినిమాలకు ఎపిక్ క్లైమాక్స్ అవసరం. ఆ క్లైమాక్స్ ని చెక్ ఫైట్ ఫైట్ దగ్గరే ఆపేసినా సరిపోయేది. అనవసరంగా సాగతీసి ఔరంగజేబుతో సుడిగాలి ఎపిసోడ్ పెట్టి విసుగెత్తించి,సెకండ్ పార్ట్ కు లీడ్ ఇస్తూ శుభం కార్డ్ వేసారు. ఇక్కడ stakes ఉన్నప్పటికీ, payoff లేదు.

టెక్నికల్ గా

దర్శకులు ఇద్దరు మారారు,అలాగే ఓ ఎపిసోడ్ ని పవన్ కళ్యాణ్ కూడా డైరక్ట్ చేసారు. మొత్తం ముగ్గురు డైరక్ట్ చేసిన సినిమా ఇది. కాబట్టి ఆ యాంగిల్ లో ఎక్కువ ఎక్సపెక్ట్ చేయకపోవటమే మంచిది. ఇక ఈ సినిమాకు అవసరమైన విఎఫ్ ఎక్స్ మాత్రం దారుణంగా చేసారు. బడ్జెట్ ప్లాబ్లమో, టెక్నిషియన్స్ ప్లాబ్లమో మరి. ఇక కీరవాణి పాటల్లో ఒకటి మించి చెప్పుకోవటానికి ఏమీ లేదు. ఎడిటింగ్ పూర్ గా ఉంది. సినిమాటోగ్రాఫర్స్ కూడా గుణ శేఖర్,మనోజ్ పరమహంస చేసారు. ఆ తేడా బాగా కనపడింది. నిర్మాణ విలువలు జస్ట్ ఓకే.

నటీనటుల్లో ..

ఈ సినిమా షూటింగ్ చాలా కాలం జరిగింది కాబట్టి ...ఆ మార్పులు తెరపై నటీనటుల హావ భావాలు, రూపాల్లో కనపడ్డాయి. పవన్ కళ్యాణ్ కష్టం కొన్ని ఎపిసోడ్స్ లో స్పష్టంగా కనిపించింది. ఆయన ఛార్మ్ అయితే తగ్గలేదు. హీరోయిన్ నిథి ఉన్నా లేనట్లే. బాబిడయోల్.. మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు బాగా చేసారు కానీ రీసెంట్ గా వచ్చిన 'ఛావా'లో ఔరంగజేబుగా నటించి అక్షయ్‌ ఖన్నా స్దాయిలో మాత్రం చేయలేకపోయారు.మొన్న ఛావా లో ఇక కోట శ్రీ‌నివాస‌రావుగారి చివ‌రి సినిమా ఇది. కానీ డబ్బింగ్ వేరే వాళ్లు చెప్పారు. ఆయ‌న్ని తెర‌పై చూడ‌డం ఓ జ్ఞాప‌కం,ఎమోషన్ అంతే.

ఫైనల్ థాట్

ఏదైమైనా సినిమా సనాతన ధర్మం సూపర్ హిట్ కొట్టడమే. అది ఈ సినిమా నెరవేర్చటానికి అనువైన పరిస్దితులును మాత్రం క్రియేట్ చేయలేదు. సెకండ్ పార్ట్ అనే కత్తి వచ్చి ఫస్ట్ పార్ట్ ని దారుణంగా పొడిచేసింది. ఎప్పుడో చూడబోయే ఆ పార్ట్ కోసం ఈ పార్ట్ ని త్యాగం చేయాలనుకోవటం ధర్మం అనిపించుకోదు. న్యాయం అసలు అనిపించుకోదు.

Tags:    

Similar News