‘ది సబర్మతి రిపోర్ట్’ చిత్రాన్ని వీక్షించిన గుజరాత్ సీఎం..

గోద్రా రైలు దహనం ప్రధాన నేపథ్యంగా తీసుకుని తెరకెక్కిన ‘ ది సబర్మతి రిపోర్ట్’ చిత్రాన్ని గుజరాత్ సీఎం వీక్షించారు. చిత్ర బృందం పై ప్రశంసలు కురిపించిన ఆయన..

By :  491
Update: 2024-11-21 10:47 GMT

గోద్రా రైలు దహనం నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని ‘ది సబర్మతి రిపోర్ట్‌’ అనే హిందీ చిత్రం తెరకెక్కింది. ‘‘ 12 ఫెయిల్’ చిత్రంతో దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న విక్రాంత్ మాస్సే లీడ్ రోల్ లో నటించారు. తాజాగా ఈ చిత్రాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వీక్షించారు. బుధవారం రాత్రి అహ్మదాబాద్ లో ఉన్న మల్టిప్లెక్స్ లో ఆయన చిత్ర నిర్మాత ఏక్తా కపూర్ , బాలీవుడ్ స్టార్ జితేంద్ర, సినీ నటీ రిద్ది డోగ్రా, గుజరాత్ హోం శాఖ సహాయమంత్రి హర్ష్ సంఘవితో కలిసి సినిమాను వీక్షించారు.

సినిమా అనంతరం సీఎం స్పందించారని, చిత్రం చూసిన తరువాత ఆయన భావోద్వేగానికి గురయ్యారని చిత్రయూనిట్ తెలిపింది. సినిమాకు పన్ను రాయితీ ప్రకటించారని వెల్లడించింది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా స్పందించారు. వాస్తవాలతో సినిమా తీశారని ప్రశంసలు కురిపించారు. ది సబర్మతి రిపోర్ట్ కు ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాలు రాజస్థాన్, హర్యానా, చత్తీగఢ్, మధ్యప్రదేశ్ పన్ను రాయితీ ప్రకటించాయి. తాజాగా గుజరాత్ కూడా ఈ నిర్ణయం తీసుకోవడంతో పన్ను రాయితీ ప్రకటించిన ఐదో రాష్ట్రంగా నిలిచింది. దీని వల్ల టికెట్ ధరలు తగ్గే అవకాశం ఉంది.

గోద్రా రైలు దహనం..

దేశంలో అత్యంత దారుణమైన సంఘటనల్లో గోద్రా రైలు దహనం కూడా ఒకటి. ఫిబ్రవరి 27, 2002 న గోద్రా రైల్వే స్టేషన్ల లో వేచి ఉన్న రైలుపై ముస్లిం మతోన్మాదులు దాడి చేసి, రైలులో ఉన్న కరసేవకులు బయటకు రాకుండా తలుపులు బిగించారు. తరువాత పెట్రోలు పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో రైలులో ఉన్న 59 మంది కరసేవకులు మరణించారు. రైలు తగలబడిన తరువాత రెచ్చగొట్టే నినాదాలతో ఊరేగింపు చేశారు. దహనం తరువాత మరో వర్గం ఆత్మరక్షణకు దిగింది. ఇందులో మరో వర్గానికి చెందిన 2 వేల మంది చనిపోయారు.

మోదీ, అమిత్ షాను ఇరికించే ప్రయత్నం..
ఈ మత ఘర్షణల్లో సీఎంగా ఉన్న ప్రస్తుత ప్రధాని మోదీపై కొన్ని స్వచ్చంద సంస్థలు కేసులు నమోదు చేయాలని కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ మత ఘర్షణపై నియమించిన జస్టిస్ లీలావతి కమిషన్ ఈ సంఘటనలతో ఎలాంటి సంబంధం లేదని నివేదిక ఇచ్చినప్పటికీ కొన్ని ఎన్జీఓలు కోర్టులో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను ఇరికించే ప్రయత్నం జరిగింది. ఈ కేసుపై సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ తీస్తా సెతల్వాడ్ అమాయకులపై కావాలను దురుద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేశారని తీర్పు చెప్పింది. భారత న్యాయ చట్టాల ప్రకారం తీస్తా పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.


Tags:    

Similar News