సుహాస్ ‘జనక అయితే గనక’OTT రివ్యూ
ఈ దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు మెల్లిగా ఓటిటిలలో ల్యాండ్ అవుతున్నాయి. అలా క్రమంలో ఓటిటిలో వచ్చిన చిన్న చిత్రం ‘జనక అయితే గనక’.
ఈ దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు మెల్లిగా ఓటిటిలలో ల్యాండ్ అవుతున్నాయి. అలా క్రమంలో ఓటిటిలో వచ్చిన చిన్న చిత్రం ‘జనక అయితే గనక’. రొటీన్ కు భిన్నమైన కథలతో అలరించే సుహాస్ హీరో కావటం, దిల్‌రాజు ప్రొడక్షన్స్ నిర్మించడం, ప్రమోషన్స్ ఆకట్టుకోవడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి వ్యక్తమైంది. అయితే సినిమా యావరేజ్ అని, ఓటిటి లో చూసుకోవచ్చు అని రివ్యూలు తేల్చేసాయి. దానికి తోడు పెద్ద సినిమాల ఊపులో ఈ సినిమా జనాలకు ఆనలేదు కూడా. తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది. చూడదగిన సినిమానేనా వంటి విషయాలు చూద్దాం.
కాన్సెప్టు
మిడిల్ క్లాస్ మనిషి ప్రసాద్ (Suhas). ప్రతీది లెక్కేసుకుని డెసిషన్స్ తీసుకుంటాడు. ఆ క్రమంలో పెళ్లై రెండేళ్లు అయినా పిల్లలు వద్దనకుంటాడు. ఎందుకంటే పిల్లలు పుడితే ఈ రోజుల్లో తనకు పెద్దగా ఆదాయం లేదు కాబట్టి బెస్ట్ గా ఏమీ లేదనుకంటాడు. ఆ మేరకు పిల్లలు పుట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు. తల్లి, తండ్రి (గోపరాజు రమణ) ఎంత చెప్పినా వినిపించుకోడు. అదే విషయం చెప్పి భార్య (సంగీర్తన విపిన్) ని ఒప్పిస్తాడు. అయితే అనుకోకుండా అతని భార్య గర్భం దాలుస్తుంది. దాంతో ప్రసాద్ కు కోపం వస్తుంది.
అబార్షన్ చేసుకుని పిల్లలను చంపుకోలేని పరిస్థితి కాబట్టి, తను ఎంత జాగ్రత్త తీసుకున్నా పిల్లలు పుట్టడం తట్టుకోలేకపోతాడు. దాంతో తను ఈ పరిస్థితికి కారణమైన కండోమ్ కంపెనీపై కోర్టుకు ఎక్కుతాడు. కండోమ్స్‌లో నాణ్యత లేకపోవడమే ఈ పరిస్దితికి కారణం అని చెప్తాడు. కండోమ్స్ కంపెనీ నుంచి రూ.కోటి పరిహారం కోరతాడు. వాదోపవాదాలు మొదలు అవుతాయి. అతని తరుపున స్నేహితుడైన లాయిర్ పత్తి కిశోర్ (వెన్నెల కిశోర్) వాదించటం మొదలెడతాడు. అతనిది అదే మొదటి కేసు. మీడియాలో ఈ కేసే హైలెట్ అవుతుంది. మరో ప్రక్క కంపెనీ ఈ కేసుని ప్రెస్టీజియస్ గా తీసుకుని పెద్ద లాయర్ (మురళి శర్మ)ను రంగంలోకి దింపుతుంది. మరి ఈ కేసులో ప్రసాద్ గెలిచాడా? కోటి పరిహారం అందిందా? చివరకు ఏమైంది అనేది చిత్ర కథ.
ఎలా ఉంది
ఇది తెలుగు వరకూ బోల్డ్ కాన్సెప్టే అని చెప్పాలి. కండోమ్ కంపెనీపై కోర్టుకు ఎక్కడం ఎవరూ ఊహించని ఎలిమెంటే. అయితే దీన్ని కామెడీ గా డీల్ చేయడం, సుహాస్ నటించడం చాలా వరకు పాసైపోయింది. కోర్టు సీన్స్ కామెడీ బాగానే పండాయి. వెన్నెల కిషోర్ కోర్టు అలవాటు లేకపోవడం, జడ్జి రాజేంద్రప్రసాద్ కావడం ఈ కామెడీకు కలిసొచ్చాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మిడిల్ క్లాస్ వాళ్లు పిల్లల్ని కనడానికి ఎంతగా ఆలోచించాల్సి వస్తోందో వ్యంగ్యంగా చెప్పుకొచ్చారు. ఆ సీన్స్ బాగుంటాయి. అలాగే కేవలం కోర్టు రూమ్ డ్రామా క్రిందే కాకుండా ఎమోషన్స్ ని కూడా కథలో బాగంగా చేర్చారు. ఎన్ని చేసినా రిపీట్ సీన్స్, ఫస్టాఫ్ వెళ్లినంతగా సెకండాప్ పరుగెత్తకపోవటం, అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపించడం, కథలో మలుపులు లేకపోవడం సినిమాపై మెల్లి మెల్లిగా ఆసక్తి తగ్గించేసాయి. ఇంకొంచెం లాజిక్ పెంచి, ఫన్ డోస్ పెంచింతే బాగుండేది. అక్కడక్కడే సరిపెట్టేసారు. ఐడియా లెవెల్ లో బాగుందనిపించిన ఈ సినిమా విస్తరణలో ట్రీట్మెంట్ సరిగ్గా లేక చప్పబడింది.
టెక్నికల్ గా ...
విజయ్ బుల్గానిన్ సంగీతంలో రెండు పాటలు బాగున్నాయి. అలాగే , సాయి శ్రీరామ్ కెమెరా వర్క్ ఎప్పటిలాగే నీట్ గా ఉంది. ఎడిటింగ్ సెకండాఫ్ కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. దర్శకుడి రచనలో బలం తగ్గింది. సున్నితమైన ఈ కథాంశానికి ఆరోగ్యకరమైన హాస్యం మేళవించినా ఆ డోస్ సరిపోలేదు. లో బడ్జెట్ సినిమాకు తగ్గ ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి.
నటీనటుల్లో సుహాస్ ఎప్పటిలాగా బాగా చేసారు. మురళి శర్మ ఓకే. గోపరాజు రమణ, వెన్నెల కిశోర్, రాజేంద్రప్రసాద్, ప్రభాస్ శ్రీను ఫన్ బాగానే పండించారు. బామ్మ గా కనిపించిన ఆమె కూడా సినిమా మొదటి నుంచి చివరి దాకా ఫన్ చేసుకుంటూ వెళ్లింది.
చూడచ్చా
కండోమ్ అన్న విషయం తప్పిస్తే సినిమాలో అడల్ట్ కంటెంట్ లేదు. అలాగని పిల్లలతో కూర్చుని చూస్తే వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి రావచ్చు. కాబట్టి కాస్త చూసుకునే ఈ సినిమా చూడాలి
ఎక్కడుంది.
ఆహా ఓటీటీ లో తెలుగులో ఉంది.