ఆకాశం చెదిరినా… ఆశలు చెదరక థైర్యాన్ని ఇచ్చే చిత్రాలు
విమాన ప్రమాదాల నేపథ్యంలో రూపొందిన టాప్ 5 సినిమాలు;
ఆకాశంలో ఎగిరే ప్రతి విమానం ఓ కథతో పయనిస్తుంది... కానీ కొన్ని సార్లు కొన్ని కథలు ఆకాశంలోనే అంతమవుతాయి.
విమాన ప్రమాదాలు అంటే కేవలం యాక్సిడెంట్లు మాత్రమే కాదు.
అవి ఆశల, భయాల, ధైర్యాల సంగమాలు.
ఒక క్షణంలో అన్నీ కోల్పోయినా, మరో క్షణంలో జీవితాన్ని తిరిగి ప్రారంభించాలన్న మానవ సంకల్పం ఇలాంటి ప్రమాదల వెన్నంటే గుర్తు చేస్తూంటాయి.
“Survival is not about being fearless. It's about making a decision — fear or flight.”
వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన కొన్ని సినిమాలు మనసుని నొక్కి పట్టేస్తాయి… మనుషుల బలహీనతల్ని చూపుతాయి… కానీ చివరికి మనలోని మానవత్వాన్ని, జీవించే ఆకాంక్షను గెలిపిస్తాయి. ఇప్పుడు అలాంటి అత్యుత్తమ 5 విమాన ప్రమాదాల నేపథ్యంలో రూపొందిన అంతర్జాతీయ స్థాయి సినిమాలు గురించి తెలుసుకుందాం.
1. సల్లీ (Sully) – 2016
నిర్మాత: క్లింట్ ఈస్ట్వుడ్
నటుడు: టామ్ హాంక్స్
2009లో జరిగిన "మిరాకిల్ ఆన్ ది హడ్సన్" ఘటన ఆధారంగా రూపొందిన చిత్రం. US ఎయిర్వేస్ 1549 విమానాన్ని, ఇంజిన్లు ఫెయిల్ అయినా సరే, న్యూయార్క్ హడ్సన్ నదిపై సురక్షితంగా ల్యాండ్ చేసిన కెప్టెన్ చెస్లీ “సల్లీ” సల్లెన్బెర్గర్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.
ఈ చిత్రం చూపించేది ఒక “heroic failure” కాదు, ఒక “heroic decision.”
ఇంజిన్లు ఫెయిల్ అయినా, హడ్సన్ నదిపై విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసిన సల్లీ – ఇతని కథలో మనం చూస్తే, ధైర్యానికి కొత్త అర్దం కనిపిస్తుంది.
సల్లీని విమానాన్ని ల్యాండ్ చేసినందుకు కాక, తర్వాత అతను ఎదుర్కొన్న ప్రశ్నలకి ధైర్యంగా సమాధానం చెప్పే తీరు గుర్తుండిపోతుంది.
“I did my job. I did the best I could.”
టామ్ హాంక్స్ తన నటనతో సల్లీ పాత్రను జీవించాడు. ప్రమాదాన్ని ఎదుర్కొన్న తర్వాత అతనిపై వేసిన విచారణలు, మానసిక ఒత్తిడులు ఈ కథలో ప్రధాన బలం. ఇది కేవలం సర్వైవల్ స్టోరీ కాదు, ఇది నైతిక ధైర్యం మరియు బాధ్యతను గురించిన సినిమా.
2. కాస్ట్ ఎవే (Cast Away) – 2000
దర్శకుడు: రాబర్ట్ జెమెకిస్
నటుడు: టామ్ హాంక్స్
నిర్జన ద్వీపంలో ఒంటరిగా నాలుగేళ్లు బతికిన వ్యక్తి కథ ఇది. ఇది ఓ మనిషి ఒంటరితనానికి ఎదురిచూసిన ప్రేమ కథ. “Who knows what the tide could bring?” — జీవితంపై మనకు తిరిగి నమ్మకం కలిగించే గాథ.
ఓ విమాన ప్రమాదంలో బతికి బయటపడిన FedEx ఉద్యోగి, సముద్రం మధ్యలో ఉన్న ఓ నిర్జన ద్వీపంలో ఒంటరిగా పోరాడుతూ, నాలుగేళ్ల తర్వాత తన జీవితంలోకి తిరిగి వచ్చేందుకు చేసే ప్రయత్నమే గుండెతట్టించే భాగం.
ఈ చిత్రం మానవ ఒంటరితనాన్ని, తినే తిండి లేకున్నా, మాట్లాడే మనిషి లేకున్నా బతికే మానవ సంకల్పాన్ని, ఒక నిదర్శనంగా చూపిస్తుంది. “Wilson…” అనే వాక్యం ఈ చిత్రాన్ని చూసిన వారికి మరవలేనిది.
3. ది గ్రే (The Grey) – 2011
దర్శకుడు: జో కార్నాహన్
నటుడు: లియామ్ నీసన్
అలాస్కా మంచు ప్రాంతంలో ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలిపోతుంది. జీవించి బయటపడిన అక్కడ కఠినమైన వాతావరణం, తినదగిన ఆహారం లేని పరిస్థితులు మధ్య జీవించేందుకు బ్రతికున్న పోరాడతారు. వాటిలో నాయకత్వం వహించే వ్యక్తిగా లియామ్ నీసన్ పాత్ర, మానవ ధైర్యానికి రూపం.
విమాన ప్రమాదం తర్వాత మంచు తుపాన్లు, తోడేళ్ళు, చలికి తాళలేని శరీరాలు… ప్రకృతి ముందు మనిషి ఎంత బలహీనమో తెలుసుకునే అవకాశం ఇస్తుంది ఈ సినిమా. కానీ చివరికి — “Once more into the fray... into the last good fight I’ll ever know.”ఈ డైలాగ్ తో మనిషి సాహసానికి విలువను చూపెడతాడు.
ఈ సినిమా సర్వైవల్ స్టోరీ మాత్రమే కాదు… అది మనుషులు , ప్రకృతి మధ్యనున్న క్రూరమైన, కానీ వాస్తవికమైన సంబంధాన్ని నొక్కి చెబుతుంది.
4. అలైవ్ (Alive) – 1993
Director :Frank Marshall
ఆధారం: "Alive: The Story of the Andes Survivors" by Piers Paul Read
1972లో ఆండీస్ పర్వతాల్లో కూలిపోయిన ఉరుగ్వే రగ్బీ జట్టు కథ ఆధారంగా రూపొందింది. విమానం పడిపోయిన తర్వాత 72 రోజుల పాటు ఆ మంచు కొండల మధ్య, ప్రాణాలతో బయటపడటానికి వారు చేసిన త్యాగాలు, మానవ విలువలపై ఎదురైన ప్రశ్నలు చిత్రంలో హృదయాన్ని తాకుతాయి.
కలత కలిగించే భావోద్వేగాలతో పాటు, స్కోర్ ఈ చిత్రాన్ని సజీవంగా నిలిపింది.
ఈ చిత్రం — “Sometimes survival isn’t about heroism, it’s about hope.” అనే విషయాన్ని నొక్కి చెప్తుందీ చిత్రం.
5. ఫ్లైట్ (Flight) – 2012
దర్శకుడు: రాబర్ట్ జెమెకిస్
నటుడు: డెంజెల్ వాషింగ్టన్
ఒక ఆర్మీ trained పైలట్, విమానాన్ని ప్రమాదం నుంచి బయటపడతాడు. కానీ ఆ తర్వాత ఆయన జీవితం, డిపెండెన్సీ, మానసిక స్థితి అన్నింటిపైనే ప్రశ్నలు వస్తాయి. ఈ చిత్రం విమాన ప్రమాదం కంటే ఎక్కువగా, మానవ తప్పిదాలపై, బాధ్యతపై ఓ లోతైన మనోభావ అన్వేషణగా నిలుస్తుంది.
డెంజెల్ వాషింగ్టన్కు ఈ పాత్ర ఆస్కార్ నామినేషన్ కూడా తెచ్చిపెట్టింది. సస్పెన్స్, మానవ భావోద్వేగం, మద్యం వంటి బలహీనతలూ… అన్నీ కలిసిన ఓ జీవిత గాథ ఇది.
“It was me. I’m the one who screwed up. I’m drunk right now.” – ఈ డైలాగ్ సినిమా అయ్యిపోయాక చాలా కాలం గుర్తుంటుంది.
ఆకాశం గంభీరమైనది… కానీ కొన్ని సార్లు అసహనంగా మారుతుంది.
విమానాలు అంటే మనిషి కలలకి మించిన ప్రయాణం. ఆకాశాన్ని చీల్చుతూ ముందుకు దూసుకెళ్లే ఈ ప్రయాణం ఎన్నో ఆశలు నింపుతుంది. కానీ ఊహించని విధంగా గాలిలో ప్రయాణిస్తున్న ఓ క్షణం… ఆశ్చర్యం నుండి ఆఘమేఘాల దుఃఖం దాకా తీసుకెళ్లగలదు. విమాన ప్రమాదాలు అంటే ప్రకృతి దెబ్బలు, మానవ తప్పిదాలు, సాంకేతిక వైఫల్యాల మిళితం.
ఈ నేపథ్యంలో విమాన ప్రమాదాల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు, ప్రేక్షకుల్ని భయం, బాధ, సర్వైవల్, మానవ తత్వం అన్నీ ఒకేసారి అనుభూతి చెందించేలా చేస్తాయి. అవి కేవలం ఎమోషనల్ డ్రామాలు కాదు – నిజ జీవితాల మీద ఆధారపడి రూపొందిన కథలతో, మానవ సంకల్పానికి నిలువెత్తు నిదర్శనాలవుతాయి. విమానాలు కుప్పకూలినా… ఆశలు పుంజుకోవడమే మానవ స్వభావం
విమాన ప్రమాదాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాలు… మనల్ని తాత్కాలిక భయం నుంచే కాకుండా, ఆత్మవిశ్వాసం, సహనం, మానవ విలువల పట్ల ఆలోచింపజేస్తాయి. నిజ జీవితాల ఆధారంగా తీసిన ఈ సినిమాలు మానవుడు ఎంత బలమైనవాడో చూపించడంలో విఫలమవ్వవు.
ప్లేన్ ఎక్కే ముందు, ఈ సినిమాలు గుర్తొస్తే మీరు ఒక్కసారి లోతుగా ఆలోచిస్తారు. ఎందుకంటే కొన్ని విమానాలు మనిషి మనసునే సాహసయాత్రగా తీసుకెళ్తాయి.