‘సలాకార్’ వెబ్ సీరిస్ రివ్యూ
1978 నాటి కథతో స్పైథ్రిల్లర్;
పాకిస్థాన్ ఆర్మీ బ్రిగేడియర్ అస్రార్ ఖాన్ (సూర్య శర్మ) భారత్ కి షాక్ ఇచ్చే భారీ ప్లాన్ లో ఉన్నాడు..అది మరేదో కాదు భారత్ పై అణుబాంబ్ వేయడం! అది ఇప్పటి కల కాదు. అతని తాత జియా ఉల్లా (ముఖేశ్ రిషి) ప్రారంభించిన ఆపరేషన్ అది. ఆయన జీవిత కల అది. ఆ కలను రియల్ లైఫ్‌లోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం తన తాత 1978 రెడీ చేసిన రేర్ ఫైల్ ని వెతికి సాధిస్తాడు. అది కేవలం పేపర్ కాదు, పూర్తి మాస్టర్ ప్లాన్, అణుబాంబ్ ల్యాబ్స్, ఫండ్స్, రియల్ టైం డీటేల్స్, మొత్తం అందులో ఉన్నాయి! అస్రార్ ఖాన్ ఇప్పుడు ఆ మాస్టర్ ప్లాన్ కి వారసుడు – తన తాత కలను నిజం చేయాలనేది అతని అబ్సెషన్. అయితే అతను అనుకోగానే అది జరుగుతుందా?
అక్కడ పాకిస్దాన్ లో అణుబాంబు కి చెందిన ఫైల్ దొరకగానే ఢిల్లీలో ‘రా’ అలారం మ్రోగి టీమ్ అలర్ట్ అవుతుంది. వెంటనే తమ సూపర్ స్పై సృష్టి చతుర్వేది (మౌనీ రాయ్) ని రంగంలోకి దింపుతారు. ఇప్పుడు ఆమె ఏకైక మిషన్ అస్రార్ ఖాన్ ప్లాన్‌ను బ్రేక్ చేయడం, ఫైల్ లోని రహస్యాలను గ్రాబ్ చేసి, భారత భవిష్యత్తును సేఫ్ చేయడం.
ఈ క్రమంలో సృష్టి చతుర్వేది, అస్రార్ ప్లేస్ లో సాగే, సెక్యూర్ ల్యాబ్స్, డ్రోన్ స్టైల్స్, రియల్ టైం హై-టెక్ గేమ్‌లోకి అడుగుపెడుతుంది. ఇప్పుడు ఆమె ఏకైక లక్ష్యం...ఆ అణుబాంబులను ఎక్కడ తయారు చేస్తున్నారు? అందుకు అవసరమైన ఫండింగ్ ఎక్కడి నుంచి అందుతుంది? పాకిస్థాన్ పూర్తి ప్లాన్ ఏమిటి? తెలుసుకోవటం. అది జరిగిందా.. సృష్టి చతుర్వేది ఎలా ఆ కుట్రను ఛేదిస్తుంది. చివరకు ఏమైందనేది మిగతా కథ.
ఎనాలసిస్
దీని ట్రైలర్, ప్రమోషన్స్ చూడగానే మనం ఓ హిస్టారికల్ స్పై థ్రిల్లర్ చూడబోతున్నాం అనిపిస్తుంది. అయితే, కథా, కాన్సెప్ట్ కొత్తదేమీ కాదు. ఇది మనం ఇంతకుముందు చూసిన Mission Majnu, Rocket Boys లాంటి సినిమాలు, షోస్, రాబోయే Saare Jahan Se Acha వంటి ప్రాజెక్ట్‌లలో ఉన్నదే. దాంతో ఒరిజినాలిటీ విషయం లో షో సొంత గుర్తింపు పొందలేకపోయింది. ఈ షో ఫాస్ట్-పేస్, యాక్షన్ ఎప్పటికప్పుడు ఎంగేజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ సమస్య ఏంటంటే మనం క్యారక్టర్స్ తో కనెక్ట్ అయ్యే టైమ్ ఇవ్వదు.
సాధారణంగా OTT షో ల మెయిన్ USP ఏంటంటే – slow-burn character arcs, deep emotional layers. కానీ Salakaar వాటిని పక్కన పెట్టి, కేవలం యాక్షన్ ఛేజ్ లపై కాన్సర్టేట్ చేస్తుంది.లీడ్ క్యారక్టర్స్, సపోర్టింగ్ క్యారక్టర్స్ ఏవీ పూర్తిగా డవలప్ చెయ్యలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆడియన్స్ ఎమోషనల్ కనెక్షన్ ని అందిపుచ్చుకోలేదు. అలాగే డీటేలింగ్ మీద ఫోకస్ లేకపోవడంతో జస్ట్ ఓకే అనిపిస్తుంది.
OTT యుగంలో, యాక్యూరసీ, రియలిజం అత్యంత ముఖ్యమని చెప్పాలి; Salakaar ఈ ఫండమెంటల్ టెస్ట్ లో ఫెయిల్ అయ్యింది. కర్నల్స్ మామూలు కార్లలో తిరుగుతూంటారు. High Commission ను ఎప్పుడూ Embassy అని పిలుస్తూంటారు, కోవర్ట్ ఆపరేషన్స్ ను ఓపెన్‌గా చూపిస్తూంటారు. ఇవన్నీ ఫాక్టువల్ తప్పులని అర్దమై ఆసక్తి తగ్గిపోతుంది.
Salakaar – స్పీడ్, యాక్షన్, హై-ఎనర్జీ ఇస్తుంది, కానీ హార్ట్, రియలిజం, క్యారెక్టర్ డెప్త్ లేని షో. ఇలాంటివి పెద్దగా ఎక్సపెక్ట్ చేయనివారికి నచ్చుతుంది. డెప్త్ కోరుకునే వారిని మాత్రం disappointment చేస్తుంది.
టెక్నికల్ గా..
క్విక్ ఎడిటింగ్, అద్దూ అదుపూ లేని యాక్షన్ సీక్వెన్స్‌లు, set design అంతా బాగానే ఉంది. కానీ బడ్డెట్ పరిమితులు scale & grandeur లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటివి ఎక్కువ production value ఉన్న ఫీచర్ ఫిల్మ్ ఫార్మాట్ లో చేయడం మంచి ఫలితం ఇస్తాయి. ఫొటోగ్రఫీ ..బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ఎడిటింగ్ విషయానికి వస్తే, జస్ట్ ఓకే అనిపిస్తాయి.
చూడచ్చా
1978 కాలం నాటి దేశ పరిస్దితులు, అప్పటి అణుబాంబు కుట్రలు, మన దేశ RAW గురించి తెలుసుకోవాలంటే కొంతవరకూ పనికొస్తుంది.
ఫైనల్ థాట్
Salakaar సీరిస్ .. NSA అజిత్ దోవాల్ కు ట్రిబ్యూట్ గా రూపొందించబడింది – ఆయన స్పైమాస్టర్ గా ఓ ఆపరేషన్ లో ఏం సాధించాడు అనే దాన్ని ప్రపంచానికి చూపించడానికి ఎంచుకున్నదని అర్దమవుతుంది. పూర్ణేందు శర్మ గెటప్ నుండి, నవీన్ కస్తూరియా ఫిక్షనల్ పేరు వరకు – ఇవన్నీ ఆయనకు hommage. కానీ ట్రిబ్యూట్ లు అంటే బాగా చేయగలగాలి. సరిగ్గా చేయకపోతే, glorify చేయాలనుకున్న విషయాన్ని disrespect చేస్తాయి.అదే Salakaar కి జరిగింది.
ఎక్కడ చూడచ్చు
జియో హాట్ స్టార్ లో తెలుగులో ఉంది