శంకర్ షాకింగ్ డెసిషన్? నెట్ ప్లిక్స్ ఒత్తిడే కారణమా?

ఈ రోజు సినిమా పరిశ్రమను ఓటిటి సంస్దలు శాసిస్తున్నాయి. గతంలో ఏ సినిమా రిలీజ్ అయినా, దాని శాటిలైట్ హక్కులు ఎవరు కొన్నారు అనే అంశం అంత ప్రాచుర్యంలో ఉండేది కాదు.

Update: 2024-10-04 09:04 GMT

ఈ రోజు సినిమా పరిశ్రమను ఓటిటి సంస్దలు శాసిస్తున్నాయి. గతంలో ఏ సినిమా రిలీజ్ అయినా, దాని శాటిలైట్ హక్కులు ఎవరు కొన్నారు అనే అంశం అంత ప్రాచుర్యంలో ఉండేది కాదు. సినిమాను థియేటర్స్‌లోనే ఆడియన్స్ చూసెందుకు ఇంట్రెస్ట్ చూపేవారు. కానీ ఓటిటిలు వచ్చాక.. వాటి మార్కెటింగ్ కోసం సినిమాల విడుదలను కంట్రోల్ చేయటం మొదలుపెట్టాయి‌. ప్రతి సినిమా పోస్టర్‌లో ,టైటిల్స్ లో ఓటిటి సంస్దల లోగో తప్పనిసరిగా ఉంటూ.. ఆడియన్స్‌‌ను ముందు నుంచి ప్రిపేర్ చెస్తూ ఉండటంతో ప్రేక్షకుల్లో క్రమంగా థియేటర్స్ సినిమాను చూసే ఆసక్తి క్రమంగా తగ్గిపోతుంది. అంతేకాదు రిలీజ్ డేట్స్ ని సైతం ఓటిటి సంస్దలు నిర్ణయించే స్దితికి చేరుకున్నాయి. ఇప్పుడు శంకర్ వంటి పెద్ద దర్శకుడు సైతం ఓటిటి సంస్ద మాటకు కట్టుపడాల్సిన పరిస్దితి వచ్చిందని వినిపిస్తోంది. అసలేం జరిగింది..

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌ (Kamal Haasan), సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ (Shankar) కాంబినేష‌న్‌లో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’ (Bharateeyudu 2). టాప్ ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌ (Lyca Productions)తో పాటు.. రెడ్ జెయింట్ (Red Giant) బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన ఈ చిత్రంపై రిలీజ్ కు ముందు మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఒక్కసారి షో పడగానే మొత్తం కొలాప్స్ అయ్యిపోయాయి. సినిమా డిజాస్టర్ అయ్యిపోయింది. తర్వాత ఓటిటిలో రిలీజ్ అయ్యినప్పుడు సైతం అదే పరిస్దితి. విపరీతమైన ట్రోలింగ్ తప్పించి కలిసొచ్చిందేమీ లేదు. ఈ నేపధ్యంలో ‘భార‌తీయుడు 3’ని ఎలా ఊహింగలం. అదే శంకర్ ని, నిర్మాతలను ఆలోచనలో పడేసిందిట. దాంతో శంకర్ ఈ చిత్రం రిలీజ్ విషయమై షాకింగ్ డెసిషన్ తీసుకున్నారని తెలుస్తోంది.

మొదట ఇండియన్ 2 చిత్రం సింగల్ పార్ట్ మూవీగా ప్లాన్ చేసారు. అయితే డ్యూరేషన్ ఎక్కువ రావటం, బడ్జెట్ పెరగటంతో సినిమా టీమ్ ఈ చిత్రాన్ని రెండు పార్ట్ లుగా విభజించి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగా ఇండియన్ 2 వచ్చేసింది. ఆ సినిమా చివర్లో ఇండియన్ 3 ట్రైలర్ కూడా ఇచ్చేసారు. అంటే సినిమా ప్రమోషన్ మొదలెట్టేసారు. కానీ ఇండియన్ 2 డిజాస్టర్ అవటంతో ఇప్పుడు ఇండియన్ 3 చిత్రం చూడటానికి ఎవరూ ఆసక్తి కనపరచరు. బిజినెస్ కూడా ఏ మాత్రం అయ్యే అవకాసం లేదు.

దాంతో కేవలం సమ్మర్ 2025 రిలీజ్ అనుకున్న సినిమాని థియేటర్ రిలీజ్ ఆపేసి డైరక్ట్ ఓటిటి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ మేరకు నెట్ ప్లిక్స్ తో చర్చలు జరుగుతున్నాయని వినికిడి. నెట్ ప్లిక్స్ వారు భారతీయుడు 2 చిత్రంతో నష్టపోయారు కాబట్టి ఈ సినిమాతో కాంపన్సేట్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఈ మేరకు దర్శక,నిర్మాతలపై ఒత్తిడి తెస్తున్నారని, ఈ క్రమంలో ఈ నిర్ణయానికి వచ్చారని తమిళ మీడియా అంటోంది.

శంకర్ “భారతీయుడు 2”, “భారతీయుడు 3” రెండింటినీ ఒకేసారి చిత్రీకరించారు. “భారతీయుడు 3″ని 2025 సంక్రాంతికి విడుదల చేయాలనేది ముందు ఆలోచన. రెండవ భాగం సక్సెస్ అయితే .. మూడవ భాగంపై క్రేజ్ భారీగా ఉండేది. కానీ ఇప్పుడు, ఇది పూర్తిగా భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. అయితే భారతీయుడు 2 కంటే భారతీయుడు 3 బాగుంటుందని కమల్ హాసన్ ముందు నుంచి చెబుతున్నారు. ఇప్పటికీ మూడవ భాగం ఆకట్టుకునేలా రివర్టింగ్‌గా ఉంటుందని ఆయన భావిస్తున్నారు.

 

హీరో కమల్‌హాసన్‌ మాట్లాడుతూ.. ‘‘28 ఏళ్ల క్రితం నేను శివాజీ గణేశన్‌తో ఓ సినిమా చేద్దామనుకుంటున్న సమయంలోనే శంకర్‌ ‘భారతీయుడు’ కథతో నా దగ్గరకు వచ్చారు. ఆ కథలు రెండూ కొంచెం దగ్గరగా ఉండటంతో శివాజీ గణేశన్‌కు చెప్పా. ఆయన ‘శంకర్‌తోనే సినిమా చేయండి.. మనం ఇప్పటికే ఎన్నో చిత్రాలు కలిసి చేశామ’ని నాతో అన్నారు. ఆ ఒక్క మాట, నమ్మకంతో ‘భారతీయుడు’ చేశా. అప్పట్లోనే నేను సీక్వెల్‌ చేద్దామని అడిగా. కానీ, శంకర్‌ కథ రెడీగా లేదన్నారు. మళ్లీ 28ఏళ్లకు ‘భారతీయుడు 2’ చేశాం. నిర్మాత సుభాస్కరన్‌ వల్లే ఈ చిత్రం ఇక్కడి వరకు వచ్చింది. ఆయన మాపై పెట్టిన నమ్మకమే ఈ సినిమా. ’’ అన్నారు.

‘‘భారతీయుడు తాత మంచి వాళ్లకు మంచివాడు.. చెడ్డవాళ్లకు చెడ్డవాడు. కమల్‌హాసన్‌ 360డిగ్రీల కంటే ఒక డిగ్రీ ఎక్కువ నటించే సత్తా ఉన్న నటుడు. 70 రోజుల పాటు మేకప్‌తో నటించారు. ఆయన లాంటి నటుడు ప్రపంచంలోనే లేరు. తనతో ‘భారతీయుడు 2’, ‘భారతీయుడు 3’ చేయడం ఆనందంగా ఉంది. ఈ రెండూ ‘భారతీయుడు’ కంటే పెద్ద హిట్‌ అవుతాయి’’ అన్నారు దర్శకుడు శంకర్‌.

భారతీయుడు 3 కథేంటి

భారతీయుడు 2 సినిమాలో కమల్ హాసన్ తిరిగొచ్చి దేశాన్ని మారుద్దామనుకుంటే అతనికే వ్యతిరేకత ఎదురవుతుంది. భారతీయుడు 3 ట్రైలర్ లో చూపించిన దాని ప్రకారం ఫ్లాష్ బ్యాక్ లో వీరశేఖరన్ సేనాపతిగా కమల్ హాసన్ బ్రిటిష్ వాళ్ళతో యుద్దాలు చేస్తాడని, కాజల్ కూడా కమల్ తో కలిసి బ్రిటిష్ వాళ్లపై యుద్దాలు చేస్తుందని, యుద్ధ వీరులుగా ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూపించబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం సేనాపతిని పోలీసులు పట్టుకోవడంతో అతనికి ఉరిశిక్ష విధిస్తారని తెలుస్తుంది. భారతీయుడు 3 లో అదిరిపోయే ఫ్లాష్ బ్యాక్ యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు, ప్రస్తుతం భారతీయుడు ఏం చేసాడు అని కూడా చూపించబోతున్నారని భారతీయుడు 3 ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. దీంతో భారతీయుడు 2 ఎలా ఉన్న పార్ట్ 3పై మాత్రం బాగుంటుంది అనిపిస్తోంది.

Tags:    

Similar News