ప్రదీప్ రంగనాథన్ : 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' రివ్యూ
ఈ రోజున సినిమా హిట్టవ్వాలంటే ఖచ్చితంగా అది బాగా ఎంగేజ్ చేయగలగాలి.;
ఈ రోజున సినిమా హిట్టవ్వాలంటే ఖచ్చితంగా అది బాగా ఎంగేజ్ చేయగలగాలి. సెకన్ కూడా మన సెల్ ఫోన్ వైపు చూడకుండా చేయగలగాలి. అది సూపర్ స్టార్స్ కు కూడా సాధ్యం కావటం లేదు. కేవలం సూపర్ స్టోరి ఉంటేనే వర్కవుట్ అవుతుంది. 'లవ్ టుడే' అనే చిన్న సినిమాతో తమిళ వాళ్లనే కాదు తెలుగు వాళ్లను వైపు తన వైపుకి తిప్పుకున్న ప్రదీప్ రంగనాధన్ కు ఈ విషయం బాగానే తెలుసు. అయితే 'లవ్ టుడే' వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ఏ సినిమా చెయ్యాలనేది అతను ఎదురుకుండా ఉన్న ప్రశ్న. దానికి సమాధానం చెప్పగలిగాడా లేదా రివ్యూలో చూద్దాం.
కథేంటి
రాఘవన్(ప్రదీప్ రంగనాధన్) కాలేజీకు వెళ్ళేదాకా మంచి కుర్రాడే. బాగా చదువుకుని ఎక్కువ మార్కులు తెచ్చుకునే బుద్ధిమంతుడే. అయితేనేం అలాంటి వాళ్లను అమ్మాయిలు ఇష్టపడరని,కేవలం బ్యాడ్ బాయ్స్ నే గర్ల్స్ ఇష్టపడతారు అతి తొందరనో స్వయంగా తెలుసుకుంటాడు. అంతే అతను మారిపోతాడు. బీటెక్ లో కావాలని 48 సబ్జెక్ట్ ఫెయిల్ అవుతాడు. అయితే జీవితం అలాంటివారికి ఛాన్స్ లు , ఉద్యోగాలు ఇవ్వదు. దాంతో కాలేజీలో అతన్ని ఇష్టపడ్డ కీర్తి (అనుపమ పరమేశ్వరన్) నువ్వు నాకు అక్కర్లేదని బ్రేకప్ చెప్తుంది.
దాంతో రాఘవన్ ...ఎలాగైనా నెక్స్ట్ లెవెల్ కు వెళ్లాలని ఫేక్ సర్టిఫికెట్ లు సంపాదించి సాఫ్ట్ వేర్ జాబ్ కొడతాడు. తను అనుకున్న దారిలో కారు, ఇల్లు కొనుక్కుని మంచి సంబంధం చూసుకుని సెటిల్ అయ్యేందుకు దారి వెతుక్కుంటాడు. అతను అనుకున్నట్లే ఓ పెద్ద సంబంధం పల్లవి (కాయాదు) రూపంలో వస్తుంది. ఇంకా ఆమెతో పెళ్లి, అమెరికాలో సెటిల్మెంట్ అనుకున్న టైమ్ లో పిలవని పేరంటంలో అతని జీవితంలోకి రాఘవన్ కాలేజీ ప్రిన్సిపాల్ (మిస్కిన్) దిగుతాడు. రాఘవన్ ఫేక్ సర్టిఫికేట్స్ తో ఉద్యోగం చేస్తున్న ఆయనకి తెలిసి బయిటపెట్టేస్తానంటాడు.
అయితే అలా బయట పెట్టకుండా ఉండాలంటే రాఘవన్ కి ఓ కండిషన్ పెడతాడు. మూడు నెలలు కాలేజీలో అన్ని క్లాసులకు అటెండ్ అయ్యి పరీక్షలు రాసి 48 సప్లమెంటరీలు రాసి పాస్ అంటాడు. చేసేదేముంది కాలేజీకి వెళ్తాడు. అప్పుడు ఏమైంది. చివరికి అతని జీవితం ఏం మలుపు తిరిగింది అనేది మిగతా కథ
ఎలా ఉంది
ఈ సినిమా ఓ యాంగిల్ లో చూస్తే బాగానే ఎంగేజ్ చేస్తుంది. డ్రామా,రొమాన్స్, లైఫ్ లెసన్స్ గట్టిగానే కూర్చి వదిలారు. అయితే సినిమా చూసాక జస్ట్ ఓకే అనిపిస్తుంది. అందుకు కారణం సినిమాలో బలమైన కాంప్లెక్స్ పాయింట్ కనపడకపోవటమే. ఇందులో హీరో రాఘవన్ మిడిల్ క్లాస్ కుటుంబం అతన్ని బాగా చదువుకుని గొప్పవాడుగా చూడాలనుకుంటుంది. కానీ హీరోకి మాత్రం ఈ కాలం యూత్ లాగ ఎలోగైనా జీవితంలో సక్సెస్ అదీ చూడాలి. అదీ డబ్బుతో ముడిపడిందని అతనికి ఎదురైన ప్రపంచం చెప్తుంది. ఈ రెండింటి మధ్య నలుగుతారు.చివరకు సినిమా టెక్ పాఠాలు నేర్చుకుంటాడు.
సక్సెస్ కన్నా విలువలు గొప్పవని అర్దం చేసుకుంటాడు. అందుకోసం తన కుటుంబ త్యాగం కన్నా తన గర్ల్ ప్రెండ్స్ ఏక్సెప్ట్ చేయటం ముఖ్యమని మొదట నమ్మినా తర్వాత కాదు అని అర్దం చేసుకుంటాడు. అంతదాకా బాగానే ఉంది. ఓ మిడిల్ క్లాస్ జీవితం లాంటి చిన్న సినిమాకు అంతకు మించి ఏం కావాలి అనుకున్నాడు దర్శకుడు. కాసేపు నవ్వించి, చివర్లో ఏడిపిస్తే సరిపోతుందనే పాత సినిమా పాఠాన్నే ఇక్కడ చూపించాడు. అది కొంతమందికి ఎక్కచ్చు, మరికొంతమందికి ట్రాష్ అనిపించవచ్చు. ఏదైమైనా లోతుగా చూస్తే జీవితంలో సక్సెస్ మెట్లు ఎక్కడం ప్రధానం అనేది చివరకు తేలే అసలైన పాఠం. అయితే అది నిజాయితీ చెయ్యండనేది ఈ సినీ నీతి పాఠం.
టెక్నికల్ గా
ఓ మై కడవులే డైరెక్టర్ అశ్వథ్ మారిముత్తు తన అంతకు ముందు చిత్రం ఓ మైకడవులే రూట్లో కు వెళ్ళాడు. ఇందులో కథ జీవితం మరో ఛాన్స్ ఇవ్వడం. ఇక్కడ ప్రిన్సిపాల్ మరో ఛాన్స్ ఇస్తాడు మరోసారి అతని జీవితాన్ని మార్చుకుని రుజు వర్తనతో మెలగమని. అంతా బాగానే ఉంది కానీ కాస్త మెసేజ్ ఎక్కువైన ఫీలింగ్ వచ్చింది. ఫస్టాఫ్ ఇంకాస్త బాగా తీసుకోవాల్సింది. టెక్నికల్ గా చూస్తే... యూత్ ఫుల్ సాంగ్స్ లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం లియోన్ జేమ్స్ బాగా ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ ప్రతీ సీన్ ని కలర్ ఫుల్ గా పర్పస్ ఫుల్ గా కనిపించడం లో సక్సెస్ అయ్యింది. ఎడిటింగ్ ..కొంత లాగిన ఫీలింగ్ ఫస్టాఫ్ లో వచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగా ఖర్చు పెట్టారు.
నటీనటుల్లో..
ప్రదీప్ రంగనాథన్ ఫెరఫెక్ట్ గా తన పాత్రకు సూటయ్యాడు. చాలా ఎనర్జీతో చేసాడు. అలాగే అనుపమ సినిమాకు నిండుతనం తెచ్చింది. ఖయాదు లోహార్, మిష్కిన్, కేఎస్ రవికుమార్, గౌతమ్ మీనన్, నెపోలియన్ వంటి సీనియర్స్ తమ పాత్రలకు న్యాయం చేసుకుంటూ వెళ్లిపోయారు.
చూడచ్చా
సరదాగా నవ్వుకోవటానికి, తీసుకోగలగితే ఓ జీవిత పాఠం నేర్చుకోవడానికి ఈ సినిమా చూడచ్చు. కాలక్షేపానికి లోటు ఇవ్వని సినిమానే