'రెట్రో' మూవీ రివ్యూ

ఈ రెట్రో రైడ్ లో విషయం ఏమిటి ? రివ్యూలో చూద్దాం.;

Update: 2025-05-02 07:03 GMT

‘కంగువా’తో భారీగా దెబ్బ తిన్న సూర్య కు అర్జెంట్ గా ఓ హిట్ కావాలి. ఆ డిజాస్టర్ ని మరిపించి తనను తెరిగి ట్రాక్ లో పెట్టగల డైరెక్టర్ కావాలి. ఈ క్రమంలో తమిళంలో యంగ్ డైరెక్టర్ లో పేరున్న కార్తీక్ సుబ్బరాజ్ సీన్ లోకి వచ్చారు. సూర్యని “రెట్రో” అంటూ తెరపైకి వచ్చాడు. టైటిల్ వినగానే కొంచెం నోస్టాల్జియా, ట్రైలర్ చూస్తే… కామెడీ, రొమాన్స్‌, యాక్షన్ అన్నీ కలిపిన మిశ్రమంలా అనిపించింది. అయినా అభిమానులు మాత్రం సందేహించలేదు – “సూర్య ఉంటే చాలు” అన్నట్టు థియేటర్లకు వచ్చేశారు. వారి నమ్మకాన్ని సూర్య నిలబెట్టారా, కార్తీక్ సుబ్బరాజ్ స్టైల్‌కు సరపడ కథా బలం దొరికిందా? ఈ రెట్రో రైడ్ లో విషయం ఏమిటి ? రివ్యూలో చూద్దాం.

కథేంటి

గ్యాంగ్‌స్టర్ తిలకన్‌ (జోజు జార్జ్) తన కొడుకులా చూసుకుంటూ పెంచిన పారివేల్‌ కన్నన్‌ (సూర్య) తో కలసి ఓ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తూ ఉంటాడు. అయితే రుక్మిణి (పూజా హెగ్డే) ...పారివేల్ కన్నన్ జీవితంలోకి ప్రవేశించాక అతనిలో మార్పు మొదలవుతుంది. ఆమె పెళ్లి చేసుకున్నాక హింసాత్మక జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఇది తిలకన్ కు ఇష్టం ఉండదు. పెళ్లి సమయంలోనే తన మనుష్యులతో ఎటాక్ చేస్తాడు తిలకన్. అక్కడే తండ్రి చెయ్యి నరికేసి పారి జైలుకు వెళ్తాడు.

పెళ్లి ఆగిపోతుంది. రుక్మిణి..ఇలాంటి హింసా ప్రవృత్తి కలవాడు తనకు వద్దని వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఆమె అండమాన్ లోని ఒక దీవిలో ఉంటుందని తెలుస్తోంది. దాంతో ఆమెను ఎలాగైనా కలుసుకోవాలని జైలు నుంచి తప్పించుకున్న పారివేల్‌ ఆమె ఉన్న చోటుకు వెళ్తాడు.

ఇక ఆ అండమాన్ దీవిని బ్రిటిష్ వాళ్ల నుంచి హక్కుగా పొందుతాడు రాజ్ వేల్(నాజర్), అతను, అతని కొడుకు మైకేల్ అక్కడి ప్రజలను బానిసలుగా చేసుకుని వాళ్ల ప్రాణాలతో ఆడుకుంటూంటారు. వారితో ఒక ఢీల్‌ సెట్‌ చేసుకుని తిలకన్‌ అక్కడికి చేరుకుంటాడు. తన ప్రియురాలు రుక్మిణి కోసం పారివేల్‌ ఆ ప్రాంతంలో అడుగుపెట్టగానే మళ్లీ గ్యాంగ్‌ వార్‌ మొదలౌతుంది. అప్పుడు ఏమైంది, పారి, రుక్మిణి ప్రేమ కథ చివరకు ఏమైంది? అనాధ కాక ముందు పారి అసలు ఎవరు? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ ...

ఈ సినిమా మూడు గంటలు సేపు నడిచే క్యారెక్టర్ డ్రైవర్ స్టోరీ. ఈ కథలో మల్టిపుల్ జానర్ ని ట్రై చేశాడు దర్శకుడు. వాటిలో యాక్షన్, రొమాన్స్ హైలెట్ చేద్దామనుకున్నాడు. అయితే అందుకు తగ్గ కొత్త కథ అయితే లేదు. ఇప్పటిదాకా చూసిన ఎన్నో కథలను గుర్తు చేస్తూ రెట్రో నడవడంతో కొత్తదనానికి చోటు లేకుండా పోయింది. ప్రేమ కోసం అన్నీ వదులుకోవడానికి ప్రయత్నించే ఒక గ్యాంగ్‌స్టర్ మనకు రొటిన్‌గానే అనిపించవచ్చు.

స్క్రీన్ ప్లే పరంగా కార్తీక్ సుబ్బరాజ్ ..నేరేషన్ లో గ్రిప్ కనపడదు. కథ లో ఓ గందరగోళం ఏర్పడింది. అయితే మేజర్ గా మొదటి సీన్ నుంచే ఈ కథ రొమాన్స్ కు హింస మధ్య ఊగిసలాడుతుంది అర్థమవుతుంది. ఆ తర్వాత మెల్లిగా పాత్రల పరిచయం, కథలోకి వెళ్లడం జరిగింది. ఆ తర్వాత 15 నిమిషాల పాటు ఓ వెడ్డింగ్ సీక్వెన్స్ సింగిల్ షాట్ లో పెట్టి తన టెక్నికల్ నాలెడ్జ్ ని మనకు కార్తీక్ సుబ్బరాజు చూపిస్తుంటాడు.

లవ్‌.. లాఫ్టర్‌.. వార్‌.. ధర్మం.. అంటూ ప్రతి దాన్ని ఓ పెద్ద చాప్టర్‌లా వివరిస్తూ.. చూసేవారి సహనానికి పరీక్ష పెట్టాడు. అంతే తప్పించి కథ నడుస్తోందా, చూసే వారి పరిస్థితి ఏమిటి అనేది చూసుకోలేదు. కట్ అండ్ రైట్ అనుకుని ముందుకు వెళ్ళిపోయాడు. ఇది క్యారెక్టర్ డ్రైవర్ స్టోరీ..అంతే తప్పించి కథ నడిపించే సినిమా కాదు. దాంతో ఎక్కడా ఏమీ జరిగినట్లు అనిపించదు. అలా సీన్స్ వస్తూంటాయి. వెళ్తుంటాయి. అలా 170 నిముషాల సినిమా మూడు వందల నిముషాల సినిమా అనే ఫీల్ కలిగించింది.

టెక్నికల్ గా..

ఈ సినిమాలో డైరెక్టర్ తన టెక్నికల్ టీమ్ ఫెరఫెక్ట్ గా చేసింది ఒకటే అది 1960 - 1993ల నాటి వాతావరణాన్ని.. ఫ్యాషన్‌ను చక్కగా రీక్రియేట్‌ చేయటం. ఈ క్రమంలో సంతోష్ నారాయణన్ సంగీతం బాగా ప్లస్ అయ్యింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చాడు. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ 70ల నాటికి తీసుకెళ్లింది. అయితే షఫీక్ మహమ్మద్ అలీ ఎడిటింగ్ సినిమాను సినిమాని దెబ్బకొట్టింది. ఫీల్ కోసం..సినిమాని డెడ్ స్లో గా నడపటం సహనానికి పరీక్ష పెట్టింది.

నటీనటుల్లో ..

సూర్య ఒక గ్యాంగ్‌స్టర్ గా , ప్రేమికుడుగా రెండు వెరియేషన్స్ బాగా ఇచ్చాడు. ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు ఆయనకు కొట్టిన పిండే.ఇక పూజా హెగ్డే ఒక నార్మల్ అమ్మాయిగా నచ్చుతుంది. ఇద్దరి కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయ్యింది. ప్రకాష్ రాజ్, జోజు జార్జ్, జయరాం, నాజర్ వంటి నటులు రెగ్యులర్ గా చేసుకుంటూ వెళ్లిపోయారు.

చూడచ్చా

దాదాపు మూడు గంటల ఈ సినిమాని ఫ్యాన్స్ తప్పించి మిగతావారు ఏకబిగిన చూడటం కష్టమే.

Tags:    

Similar News