సైన్స్ ఫిక్షన్ : 'రహస్యం ఇదం జగత్‌' మూవీ రివ్యూ

టైటిల్‌లో కొత్తదనం నింపుకున్న ‘రహస్యం ఇదం జగత్’ తెరపైనా కొత్త అనుభూతిని ఇవ్వగలిగిందా...అసలు టైటిల్ అర్థం ఏమిటి.. వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

Update: 2024-11-10 07:36 GMT

ఓటిటిల ఇంపాక్ట్‌తో సైన్స్‌ ఫిక్షన్‌, మైథాలాజికల్‌ థ్రిల్లర్స్‌ వంటి విభిన్నమైన జానర్ ఫిల్మ్‌లు తెరకెక్కటానికి అవకాశం ఏర్పడింది. కొత్త జనరేషన్ వీటిని ఇంట్రస్ట్‌గా చూస్తున్నారు కూడా. తాజాగా ఈ జానర్‌లో వచ్చిన సినిమానే రహస్యం ఇదం జగత్. టైటిల్‌లో కొత్తదనం నింపుకున్న ఈ చిత్రం తెరపైనా ఓ కొత్త అనుభూతిని ఇవ్వగలిగిందా...అసలు ఆ టైటిల్ అర్థం ఏమిటి..కథ ఏంటి..చూడదగ్గ సినిమానేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

అమెరికాలో ఉన్న అకీరా (స్రవంతి) తండ్రి చనిపోవడంతో తల్లి కోసం ఇండియాకు తిరిగి వద్దామనుకుంటుంది. అయితే ఈమె బాయ్ ఫ్రెండ్ అభి (రాకేష్) కూడా ఆమెతోపాటు ఇండియా వద్దామనుకుంటాడు. ఈ క్రమంలో స్నేహితులందరికీ పార్టీ ఇవ్వాలనుకుంటారు.. అందుకోసం అడవిలో ఉన్న చిన్న ఊరుకు వెళ్తారు. అక్కడ వాళ్లు బుక్‌ చేసుకున్న హోటల్‌ క్లోజ్‌ అవడంతో ఓ ఖాళీ ఇంట్లో బస చేస్తారు. అక్కడకి అకీరా మాజీ బాయ్‌ఫ్రెండ్ విశ్వ కూడా వస్తాడు. అంతా హ్యాపీగా ఉన్న టైమ్‌లో చిన్న గొడవతో హత్యలు మొదలవుతాయి. అయితే అక్కడే కథ మలుపు తిరుగుతుంది.

వాళ్ల ప్రెండ్స్‌లో ఒకరైన అరు సైంటిస్ట్. ఆమె మల్టీ యూనివర్స్ పై రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. వాటిని గురించి ఆ టైమ్‌లో మాట్లాడుకుని, కాసేపటికి మాటలు పెద్దవై గొడవకు దారి తీస్తాయి. అభి, విశ్వకు గొడవ జరుగుతుంది. అదే సమయంలో విశ్వ ఓ భయంకరమైన డ్రగ్ తీసుకొని అకీరా, కళ్యాణ్‌లను చంపేస్తాడు. మరోవైపు మల్టీ యూనివర్స్‌కు వెళ్లే దారి ఆ ఊళ్ళోనే ఉందని తెలుసుకొని అభిని తీసుకొని వెళ్తుంది అరు. అక్కడికెళ్లాక ఆమెను ఎవరో చంపేస్తారు. అసలు ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? నిజంగానే మల్టీ యూనివర్స్ ఉందా? ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియాలంటే వెండితెరపై చూడాల్సిందే!

ఎలా ఉంది

కాన్సెప్టు పరంగా ఇంట్రెస్టింగ్‌గా ఉన్న ఈ సినిమా ఎగ్జిక్యూషన్ పరంగా ఫెయిలైందనే చెప్పాలి. తక్కువ బడ్జెట్‌లో మంచి అవుట్ పుట్ ఇవ్వాలని చేసిన ప్రయత్నం కొంతవరకూ సక్సెస్ అయ్యింది. అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు నిర్మించిన ఈ చిత్రం చాలా ఇంగ్లీష్ వెబ్ సీరిస్‌లు, హాలీవుడ్ సినిమాలు చూసి రాసుకున్నట్లు అనిపిస్తుంది. అయితే నేటివిటి టచ్ కోసం పురాణాలను కలిపారు. హనుమంతుడు ఒక లోకం నుంచి ఇంకో లోకానికి వెళ్ళడం.. కృష్ణుడు ఒకేసారి చాలా చోట్ల కనిపించడం.. శ్రీచక్రం నుంచి వామ్ హోల్ ఏర్పడటం వంటివి చూపించి మనని మెప్పించే ప్రయత్నం చేశారు.

ఫస్టాఫ్‌ అంతా ఫ్రెండ్స్‌ ట్రిప్‌కి వెళ్లడం అక్కడ గొడవలతో ఇంట్రస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా రాయలేకపోయారు. అలాగే ఇంటర్వెల్‌ ముందు అభి, కల్యాణ్‌ చనిపోవడంతో అరుతో కలిసి విశ్వ ఏం చేయబోతున్నాడనే ఆసక్తి కలిగింది. ఇక సెకండ్‌ హాఫ్‌లో వార్మ్‌ హోల్‌ ద్వారా టైం ట్రావెల్‌ చేసిన అభి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని ఎలా కాపాడతాడు అనేది ఆసక్తి రేకెత్తించింది. క్లైమాక్స్‌కు ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్‌ను లింక్‌ చేయాలనుకున్నారు. అక్కడే మనం చాలా కన్‌ఫ్యూజ్‌ అవుతాం. దానికి తోడు టీనటులు అంతా కొత్తవారు కావడం, తెరపై తెలిసిన ఫేస్‌ ఒకటి కూడా లేకపోవడం, అమెరికన్‌ ఇంగ్లిష్‌లోనే డైలాగ్స్‌ చెప్పడం ఇబ్బందే. క్లైమాక్స్‌ మాత్రం బాగుంది.

టెక్నికల్‌గా..

సినిమాటోగ్రఫీ చాలా జాగ్రత్తలు తీసుకుని చేశారు. కొత్త లొకేషన్స్‌తో విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కాస్త సౌండ్ తగ్గిస్తే బాగుండేది. సాంగ్స్ జస్ట్ ఓకే. డబ్బింగ్ క్లారిటీ లేదు. డైరక్టర్ ఏదో కొత్తగా చెప్పాలనే ప్రయత్నం బాగుంది. అయితే స్క్రీన్ ప్లేలో ఆ మ్యాజిక్ చెయ్యలేకపోయారు. నిర్మాణ పరంగా కూడా ఉన్నంతలో బాగానే ఖర్చుపెట్టి మంచి అవుట్ పుట్ ఇవ్వడానికి ప్రయత్నించారనే చెప్పాలి.

ఫైనల్ థాట్

సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఇష్టం ఉండే వారిని ఈ సినిమా మెప్పిస్తుంది. మామూలు వాళ్లను కూడా రొటీన్‌ సినిమా కాకుండా.. కొత్త మూవీ చూసినట్లు అనిపిస్తుంది.

ఎక్కడుంది

ప్రస్తుతం థియేటర్స్ లో ఆడుతోంది , చూడండి

నటీనటులు: రాకేష్‌ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్‌ గోపీనాథం, కార్తీక్‌ తదితరులు

సాంకేతిక నిపుణులు:

సినిమాటోగ్రఫీ: టైలర్‌ బ్లూమెల్‌

సంగీతం: గ్యానీ

ఎడిటింగ్‌: ఛోటా కె ప్రసాద్‌

నిర్మాతలు: పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల

దర్శకత్వం: కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌

Tags:    

Similar News