'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' మూవీ రివ్యూ
ప్రయోగం సగట ప్రేక్షకుడిని ఆకట్టుకుందా? వర్షం లేని ఊర్లో నవ్వుల వాన కురిపించిందా? అనేది ఈ రివ్యూలో చూద్దాం!;
‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే టైటిల్‌తో మొదటి ప్రేమ కథ చెప్పిన యాంకర్ ప్రదీప్ , కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ అంటూ మళ్లీ మన ముందుకు వచ్చారు. అయితే ఈ సారి తన ప్రేమ కథే కాదు, ఊరందరకి సరపడే ప్రేమ కథ కూడా! పక్కా విలేజ్ సెటప్, ఊరు మొత్తం కలిసి నిర్ణయాలు తీసుకునే సంస్కృతి, ఒక్క ఆడపిల్ల చుట్టూ తిరిగే అరవై మంది అబ్బాయిల వింత వేషాలు... ఇవన్నీ కలిపి ఓ వినోద ప్రయోగం. ఇక ఆ ప్రయోగం సగట ప్రేక్షకుడిని ఆకట్టుకుందా? వర్షం లేని ఊర్లో నవ్వుల వాన కురిపించిందా? అనేది ఈ రివ్యూలో చూద్దాం!
స్టోరీ లైన్
భైరిలంక గ్రామంలో వర్షాలు పడకపోవడానికి కారణం ఆ ఊళ్లో ఆడపిల్లలేకపోవటమే కారణమని నమ్ముతారు. ఈలోగా ఆ ఊళ్లో ఓ ఆడపిల్ల రాజకుమారి (దీపిక) పుడుతుంది. వర్షాలు కురుస్తాయి. దాంతో అందరూ ఆమెను అదృష్ట దేవతలా చూస్తారు. ఆమె పెరిగి పెద్దదవుతుంది. ఆమె ఊరు వదిలి వెళ్లిపేతే తమ ఊరి అదృష్టం పోయినట్లే అని, ఆ ఊరి కుర్రాడినే పెళ్లి చేసుకోవాలని ఆ ఊరి పెద్దలు కండీషన్ పెడతారు. ఆ ఊళ్లో అరవై మందికి పైగా వయస్సు వచ్చిన కుర్రాళ్లు ఉంటారు. వాళ్లంతా ఆమె కోసం పోటీ పడుతూంటారు. ఇతర గ్రామాలకు చెందిన అబ్బాయిలను తమ ఊరిలో అడుగుపెట్టకుండా వారందరూ చూసుకుంటూ ఉంటారు.
ఇదిలా ఉండగా..ఆ ఊళ్లో మరుగుదొడ్లు కట్టించటానికి సివిల్ ఇంజనీర్ కృష్ణ (ప్రదీప్ మాచిరాజు) వస్తాడు. రాజకుమారి గురించి విన్న అతనికి ఆమె మీద ఆసక్తి పెరుగుతుంది. అయితే మరో ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆ గ్రామంలో అడుగుపెట్టడం ఆ 60మందికి నచ్చదు. రాజాను పెళ్లి చేసుకునేందుకు అతను ఎక్కడ పోటీకి వస్తాడో అని వారు అడ్డుపడుతారు.
అయితే ఊహించినట్లుగానే ఒకరోజు రాజా (దీపికా పిల్లి), కృష్ణ (ప్రదీప్ మాచిరాజు) ఇద్దరూ అనుకోకుండా కలవడం ఆపై ప్రేమలో పడిపోవడం జరిగిపోతుంది. వారి ప్రేమ ఫలించిందా, రాజా, కృష్ణల పెళ్లికి ఉన్న అడ్డంకులు దాటగలిగారా? రాజాను పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ 60 మంది కలిసి కృష్ణను ఏం చేశారు..?చివరకు ఏమైంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
సినిమాకు మంచి కాన్సెప్ట్ ఉంది – గ్రామ జీవనంలోని మూఢనమ్మకాలపై ఓ వినోదాత్మక డ్రామా చెయ్యాలన్న ఆలోచన. మొదటి సగం వరకూ ఓకే అనిపించినా… రెండో భాగంలో కథ పై పట్టులేకపోవడం పెద్ద మైనస్. వరస పెట్టి వస్తున్న కామెడీ సీన్లు స్కిట్‌లా అనిపిస్తాయి. కథలో ఉన్న మెయిన్ ఎలిమెంట్ నవ్విస్తూ ఆలోచింపజేసేలా తీర్చిదిద్దాలి కానీ, ఇక్కడ కొంత చోట్ల అతి చేసినట్టుగా ఫీల్ అవుతుంది.
అరవై మంది అబ్బాయిలు అన్న ఆలోచన వినోదానికి బావుంటుందనిపించినా, వాళ్ల పాత్రలు సరైన ఉపయోగం లేని ట్రాక్‌లుగా మిగిలిపోయాయి. సత్య, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ లాంటి స్ట్రాంగ్ కామెడీ ఆర్టిస్టులు ఉన్నా, వారి పాత్రలకు బలంలేదు.
సినిమా ప్రారంభం స్క్రీన్‌ప్లే ఇంట్రస్టింగ్ గానే ఉంది— "ఊరికి వర్షాలు రావడం లేదు → ఆడపిల్లలు పుట్టడం లేదు" అన్న యూనిక్ కాన్సెప్ట్‌తో మొదలెట్టారు. దాంతో మనం మంచి mythical layer కలిగిన satireలా feel కూడిన సినిమా చూడబోతున్నాం అనుకుంటాం.
అయితే కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉన్నా, దానిని థీమ్‌కి గట్టిగా బేస్ చేయకపోవడంతో ఇంట్రస్ట్ పోయింది. ఈ myth-like premise ని serious satireగా తీసుకెళ్లితే బాగుండేది . కానీ దాన్ని పక్కనపెట్టి, కామెడీ స్కిట్ల మీద ఎక్కువగా ఫోకస్ చేశాడు దర్శకుడు.
ఎవరెలా చేసారు
ప్రదీప్ మాచిరాజు – ఓకే ఎనర్జీ. కానీ పాత్రకి depth లేదంటే ఎంత ఎనర్జీ వచ్చినా పనిచెయ్యదు.
దీపిక పిల్లి – స్క్రీన్ మీద presence ఉంది, కానీ ఎమోషన్ కోసం GPS పెట్టినా కనిపించదు.
కమెడియన్స్ గోల – సత్య, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ లాంటి వాళ్లు ఉన్నా… వాళ్ల మీద కూడా కథ నడవదు. మూడ్ బాగుంటే నవ్వొచ్చేదే కానీ, ఇక్కడ కథే సీరియస్‌గా లేదు.
టెక్నికల్ గా..
సంగీతం, కెమెరా వర్క్ బాగుంది. చిన్న బడ్జెట్ సినిమా అయినా టెక్నికల్ క్వాలిటీస్ బాగానే ఉన్నాయి. కథ బలం లేకుండా పోయింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓ మంచి కాన్సెప్ట్... ఓకే నటీనటులు... బాగానే ఉన్న సెటప్. కానీ దాన్ని సజావుగా తీసుకెళ్లే స్క్రీన్‌ప్లే మిస్ అయింది.
చూడచ్చా
ఓటిటిలో వచ్చేదాకా ఆగచ్చు. అంత అర్జెంట్ గా వెళ్లి చూసే సినిమా అయితే కాదు.
నటీనటులు: ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్,రోహిణి, ఝాన్సీ తదితరులు
ఎడిటింగ్: కొడాటి పవన్ కల్యాణ్
కథ, డైలాగ్స్: సందీప్ బొల్లా
సంగీతం: రధన్
సినిమాటోగ్రఫీ: ఎమ్‌ఎన్ బాల్‌రెడ్డి
నిర్మాత: మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్
దర్శకత్వం, స్క్రీన్‌ప్లే: నితిన్–భరత్