నెట్ ప్లిక్స్ కు మన తెలుగు ఆడియన్స్ అక్కర్లేదా?

ఇంగ్లీష్ లోనే విడుదల కానున్న ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ

Update: 2024-12-20 04:42 GMT

తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాతరాలు దాటించి, ఆస్కార్ లెవెల్‌కు తీసుకెళ్లిన ఫ‌స్ట్ మూవీగా ఆర్ఆర్ఆర్ చ‌రిత్ర‌ తిర‌గ‌రాసిన సంగతి తెలిసిందే. ‘నాటు నాటు’ పాట‌కుగాను బెస్ట్ ఒరిజిన‌ల్ స్కోర్ విభాగంలో ఆస్కార్‌ను అందుకున్న‌ అరుదైన సందర్బం ఈ సినిమాదే. ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్‌తో పాటు అంత‌ర్జాతీయ స్ధాయిలో ఎన్నో అవార్డుల‌ను అందుకుని ప్రజాదరణ పొందిందీ చిత్రం.

ఈ సక్సెస్ ని బేస్ చేసుకుని, చిత్ర మేకింగ్ వెనక ఉన్న కష్టాన్ని వివరిస్తూ... ఆర్ఆర్ఆర్ మూవీపై ఓ డాక్యుమెంట‌రీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ డాక్యుమెంట‌రీ టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్‌ని కూడా మేక‌ర్స్ ప్రకటించారు. అంతవరకూ బాగానే ఉంది.

తారక్, రామ్ చరణ్ అభిమానులతో పాటు, రాజమౌళి అభిమానులు కూడా తెగ ఆనందపడ్డారు. అయితే అదే సమయంలో నెట్ ప్లిక్స్ పై మండిపడుతున్నారు. ఎందుకు అంటే అభిమానులు చెప్పే ఆ రీజన్స్ సమంజసంగానే ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...

దాదాపు రెండేళ్ల తర్వాత ప్రతిష్టాత్మకమైన ఆర్ఆర్ఆర్ మూవీపై ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్‌ బియాండ్ ( RRR: Behind & Beyond )అనే టైటిల్‌తో ఈ డాక్యుమెంట‌రీ తెర‌కెక్కి రిలీజ్ కాబోతోంది. ఈ డాక్యుమెంట‌రీ పోస్ట‌ర్‌ను, ట్రైలర్ ను మేక‌ర్స్ ఇప్పటికే రివీల్ చేశారు.
ఈ పోస్ట‌ర్‌లో రాజ‌మౌళి ఛైర్‌లో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ క‌నిపిస్తున్నాడు. అత‌డి కింద వంద‌లాది సినిమా రీల్స్ క‌నిపిస్తోన్నాయి. ‘ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్‌ బియాండ్ డాక్యుమెంట‌రీ’ని డిసెంబ‌ర్‌ 20 న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ డాక్యుమెంట‌రీ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.
ఆర్.ఆర్. ఆర్ సినిమా బిహైండ్ సీన్స్ ఆసక్తికరమే. అయితే ఇప్పటికే వదిలిన ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ కు మిక్సెడ్ రెస్పాన్స్, రియాక్షన్స్ వచ్చాయి. అందుకు సగం కారణం ఈ డాక్యుమెంటరి మొత్తం ఇంగ్లీష్ లో తీశారు. ఆర్.ఆర్.ఆర్ సినిమా అభిమానులు ఎక్కువ శాతం రీజనల్ లాంగ్వేజ్ లకు చెందిన వాళ్లే. తెలుగు లో హీరోలు అభిమానులు ఇద్దరూ కూడా తెలుగు భాష మాత్రమే అర్దం చేసుకోగలిగిన వాళ్ళు. అయితే ఓటిటి రిలీజ్ లు మల్టీ లాంగ్వేజ్ ఆప్షన్ ఉంటుంది ఖచ్చితంగా. కానీ మేకర్స్ థియేటర్ రిలీజ్ ఎనౌన్స్ చేసారు.
ప్రపంచ మార్కెట్ కోసం ఇంగ్లీష్ లో డాక్యుమెంటరీ చేసినా, రీజనల్ ఆడియన్స్ ముఖ్యంగా ఆంథ్రా,తెలంగాణా, నార్త్ ఇండియాలలో కనెక్ట్ అవటం కష్టం. ఆర్.ఆర్.ఆర్ మీద ఎంత ప్రేమ ఉన్నా వారు ఇంగ్లీష్ వెర్షన్ ని ఆదరించలేరు. దానికి తోడు ఎక్కడ స్క్రీన్స్ ఇచ్చారు.
లొకేషన్స్ విషయంలో ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇది అభిమానులను పూర్తిగా నిరాశపరిచే అంశం. అయితే నెట్ ప్లిక్స్ ఆలోచన ...ఈ డాక్యుమెంటరీ గ్లోబల్ ఆడియన్స్ ని రీచ్ అవ్వాలనేది. గ్లోబల్ లో మనవాళ్లు ఉన్నారనే విషయం మర్చిపోతే ఎలా అనేది సోషల్ మీడియా జనం అడుగుతున్న ప్రశ్న.
ఇక ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్‌ బియాండ్ ట్రైలర్ మొదట్లోనే ఆర్ఆర్ఆర్ గురించి ఒక్క ముక్కలో చెప్పేశారు రాజమౌళి. కెరీర్‌లో ఇప్పటివరకూ 12 సినిమాలు చేసినా ఎప్పుడూ భయపడలేదు కానీ ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం భయపడ్డా.. అంటూ జక్కన్న అన్నారు. అసలు ఇలాంటి ఐడియాను ఎలా కార్యరూపంలోకి తీసుకురావాలా అని ఆలోచించా.. అసలు ఇద్దరు పెద్ద హీరోలని ఒకే సినిమాలో చూపించాలనే కోరిక ఎప్పటినుంచో ఉందంటూ రాజమౌళి అన్నారు.
అదే సమయంలో తారక్, చరణ్ అయితే ఈ సినిమా షూటింగ్‌ సమయంలో చాలా ఎక్సైట్ అయ్యామని.. సెట్ కొచ్చిన ప్రతిసారి ఓ రకమైన ఆసక్తి ఉండేదంటూ చెప్పుకొచ్చారు. చరణ్ అయితే ఈ సినిమా కోసం నా బెస్ట్ ఫ్రెండ్ తారక్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.. తారక్‌ని చూసి చాలా జెలస్ ఫీలయ్యా అంటూ చరణ్ అన్నారు. మరోవైపు చరణ్ ఇంట్రడక్షన్ సీన్‌‌లో జంప్ గురించి ప్రత్యేకంగా చెప్పారు ఎన్టీఆర్. ఇలా టెక్నీషియన్లు అందరూ ఆర్ఆర్ఆర్ సినిమా వెనుక ఉన్న కష్టాన్ని, సెట్‌లో అల్లరిని ఇలా చాలా విషయాలు పంచుకున్నారు.
చారిత్రక నేపథ్యంలో ఓ పిక్షన్ చిత్రంగా, యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద 1387 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే అత్య‌ధిక‌ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన మూడో సినిమాగా రికార్డ్ నెల‌కొల్పింది. బాహుబ‌లి 2 త‌ర్వాత తెలుగు ఇండ‌స్ట్రీలో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన మూవీగా నిలిచింది.
1920 బ్యాక్ డ్రాప్ లో ఫిక్షనల్ స్టోరీగా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఆర్ ఆర్ ఆర్ మూవీని తెర‌కెక్కించాడు. అలియా భ‌ట్ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ్‌గ‌ణ్, శ్రియా, స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఎమ్ఎమ్ కీర‌వాణి మ్యూజిక్ అందించాడు. రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఆర్ ఆర్ ఆర్ మూవీకి క‌థ‌ను అందించాడు.


Tags:    

Similar News