రివ్యూ: ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’డాక్యుమెంటరీ

నయనతార పర్శనల్ లైఫ్ ని బేస్ తీసుకుని రూపొందిన ఈ డాక్యుమెంటరీ లో నయన్‌ - విఘ్నేశ్‌ కలిసి వర్క్‌ చేసిన తొలి చిత్రం;

Update: 2024-11-20 06:34 GMT

రీసెంట్ గా బాగా వివాదాస్పదమైన డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’.నయనతార పర్శనల్ లైఫ్ ని బేస్ తీసుకుని రూపొందిన ఈ డాక్యుమెంటరీ లో నయన్‌ - విఘ్నేశ్‌ కలిసి వర్క్‌ చేసిన తొలి చిత్రం ‘నానుమ్‌ రౌడీ దాన్‌’(2015)లోని సీన్స్ ను చూపించాలనుకున్నారు. కాకపోతే చిత్ర నిర్మాత అయిన ధనుష్‌ దానికి అంగీకరించకపోవడంతో నయన్‌ సోషల్‌ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. ధనుష్‌ను విమర్శిస్తూ నయనతార ఘాటు లేఖ రాయడంతో అది వివాదమైంది. ఈ లోగా వాటికి సంభందం లేకుండా అనుకున్న టైమ్ కు నెట్‌ఫ్లిక్స్‌ ఈ డాక్యుమెంటరీని స్ట్రీమింగ్ చేసింది. అసలు ఈ డాక్యుమెంటరీలో ఏముంది...ఎలా ఉంది? ఇంతకీ ఇందులో ‘నానుమ్‌ రౌడీదాన్‌’ సన్నివేశాలను చూపించారా? అన్నది ఈ రివ్యూలో చూద్దాం!

కాన్సెప్టు ఏమిటంటే...

‘జనాలు ఎప్పుడు మగాళ్లను ఏమీ అడగరు. కేవలం మహిళలను మాత్రమే ప్రశ్నిస్తుంటారు. నటీమణులు మాత్రమే రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు.. వాళ్లు మాత్రమే ప్రేమిస్తున్నట్లు రాశారు’ వంటి కాంట్రవర్శి వ్యాఖ్యలని కలుపుకుని ఈ డాక్యుమెంటరీ రూపొందింది. అలాగే ఈ డాక్యుమెంటరీలో నెట్ ప్లిక్స్ ...సౌత్‌ లేడీ సూపర్‌స్టార్‌ నయనతార జీవితాన్ని అద్దంలో చూపించినట్లు, ఓ కలలా, ఒక అందమైన కథలా చెప్పే ప్రయత్నం చేసింది. నయనతార ఫ్యామిలీని, ఆమె చిన్నప్పటి ఫొటోలను, చదువు ఇతర విషయాలను చెబుతూ మొదలెట్టిన సీరిస్ అలా అలా వెళ్లిపోయింది. మొదటి చిత్రం Manasinakkare (2003-Malayalam) ప్రస్తావనతో మొదలై రీసెంట్ జవాన్ (2023-Hindi)చిత్రంతో నడుస్తుంది.

తాను చిన్నప్పుడు అస్సలు సినిమాలు చూసేదాన్ని కాదని, ఎప్పుడైనా బంధువులు వస్తే వెళ్లేదానినని నయన్‌ చెప్పటం వంటి అంశాలు ఇందులో చోటు చేసుకున్నాయి. అలాగే నగల దుకాణం వ్యాపార ప్రకటన చూసి, సినిమా ఛాన్స్‌ ఎలా వచ్చింది? మలయాళం నుంచి తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎలా ప్రవేశించింది వంటి విషయాలను ఆయా దర్శకులతో చెప్పించారు. ఇక గజినీ’ మూవీ సమయంలో తనపై ఎందుకు విమర్శలు వచ్చాయి? పత్రికలు, ఇండస్ట్రీ ఎలా స్పందించింది.

తనని ఎలా బాడీ షేమింగ్‌ చేశారో చెబుతూ బాధపడిన సందర్భాలను నయనతార వివరించింది. ధైర్యం చేసి ‘బిల్లా’ కోసం బికినీ వేసుకుని నటించడం వంటి సాహసాలు చేసిన విధానం ఆమె చెప్పుకొచ్చింది. ‘శ్రీరామరాజ్యం లో అవకాశం రావడం అందరూ ఆ చిత్ర టీమ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వార్తలు రాసినప్పుడు నయనతార పడిన మానసిక క్షోభ తదితర వివరాలను కూడా ఆయా నటీనటులు, నిర్మాతలతో చెప్పించారు. ఇలాంటి విషయాలతో నయనతార సమగ్ర దర్శనం చేస్తుందీ డాక్యుమెంటరీ.

ఎలా ఉంది

డాక్యుమెంటరీ అయినా ఇంట్రెస్టింగ్ నేరేషన్ తో ముందుకు తీసుకెళ్లారు. ప్రారంభ సన్నివేశాల్లో విశ్నేష్, నయనతార వివాహం గురించి డ్రమెటిక్ గా డిస్కషన్స్ , వాళ్ళు తిరుపతిలో వివాహం చేసుకోవాలనుకున్నా అది జరగకపోవటం ప్రస్తావిస్తారు. ఈ పార్ట్ కొంచెం సినిమాటిక్ గానే,ఊహించలేని విధంగానే ఉంటుంది. అయితే కాసేపటికే నయనతార జీవితం గురించి మొదలవుతుంది. సీనియర్ మళయాళ దర్శకుడు సత్యన్ ( Sathyan Anthikad)కనపడి..తాను ఎలా ఆమెను ఓ పాపులర్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనపడుతుందో వివరిస్తాడు. అలాగే ఆమె ఒరిజినల్ పేరు డయానా కురియన్ Diana Kurian అని తన మొదటి సినిమాకు మార్చుకున్నానని తెలుస్తోంది. తన సినిమా పరిచయం అసలు ప్లాన్ చేసింది కాదని చెప్పుకొస్తోంది.

ఆమె తల్లి మాట్లాడుతూ...తాను తన భర్త మొదట్లో సినిమా అంటే ఆసక్తి చూపలేదని చెప్తారు. అయితే ముందుకు వెళ్లాలనే అనుకున్నామని చెప్తారు. ఈ భాగంలో కాస్తంత ఎమోషన్ ఉంటుంది. ఆమె తండ్రి ఎలా షూటింగ్ లొకేషన్ కు వచ్చేవారో చెప్పుకొచ్చారు. రెండు మూడు తమిళ సినిమాల తర్వాత నయనతార తండ్రి అనారోగ్యం పాలవటం, ఆమె తండ్రికు ఓ న్యూరోపతిక్ neuropathic సమస్య ఉందని తెలియటం జరిగిందని ఎమోషన్ అవుతూ చెప్పుకొచ్చింది. ఆమె తల్లి,తండ్రిని ఎలా కేరళలో చూసుకుంటోందో చెప్పుకొచ్చారు.

ఈ డాక్యుమెంటరీలో నయనతారకు రాధికా శరత్ కుమార్, రానా దగ్గుబాటి, విజయ్ సేతుపతి, చిరంజీవి,డైరెక్టర్ అట్లీ, విష్ణు వర్దన్, పార్వతీ, తమన్నా వంటివారితో అనుబంధం చూపిస్తుంది. వాళ్లంతా తమిళ సినిమాల్లో నయనతార వెలుగుతున్న తీరును ఓ సెలబ్రేషన్ గా అభివర్ణించారు.

అలాగే ఓ చోట రాధిక శరత్ కుమార్ చెప్తూ.... ‘నానుమ్‌ రౌడీదాన్‌’షూటింగ్ టైమ్ లో ధనుష్ తనతో ఓ రోజు విఘ్నేష్ , నయనతార కు మధ్య లవ్ స్టోరీ నడుస్తోందని రివీల్ చేసారని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు అదే ధనుష్ ఈ డాక్యుమెంటరీకు విలన్ గా నిలవడం ఐరనీ గా కనిపించడం లేదు. అలాగే డాక్యుమెంటరీలో నయనతార...తనకున్న రిలేషన్ షిప్ ల గురించి కూడా చెప్పుకొచ్చింది. అయితే ఎవరి పేర్లూ ప్రస్తావించలేదు. ఇలా వివిధ దశలలో నయనతార జీవితం, సినిమాలు, ప్రస్థానం చెప్పుకొచ్చింది. డాక్యుమెంటరీ చివరిలో నయన్‌, విఘ్నేష్‌ల పిల్లలు ‘ఉలగం, ఉయిర్‌’లను చూపిస్తూ ఎండ్‌ కార్డ్‌ వేశారు.

చూడచ్చా

ఈ ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’డాక్యుమెంటరీ నయనతార, ఆమె వివాహం గురించి ప్రధానంగా ప్రస్తావన ఉంటుంది. మధ్యలో ఆమె కెరీర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. ఆమె అభిమానులే కాక, సరదాగా ఓ నటి బయోగ్రఫీని చక్కటి విజువల్స్ తో చూడాలనుకుంటే ఓ లుక్కేయవచ్చు.

ఎక్కడుంది

నెట్ ప్లిక్స్ ఓటీటీలో తెలుగు లో ఈ డాక్యుమెంటరీ ఉంది

నిడివి: 1.22 గంటలు

దర్శకత్వం: అమిత్‌ కృష్ణన్‌

Tags:    

Similar News