మోహన్ లాల్ 'బరోజ్' ఓటీటీ మూవీ రివ్యూ!

మలయాళ స్టార్‌ మోహన్‌ లాల్‌ (Mohan Lal)కి ప్రత్యేకమైన మార్కెట్ ఉంది. ఆయనకు మన సౌతిండియన్ భాషలన్నిటిలోనూ అభిమానులు ఉన్నారు.;

Update: 2025-01-30 12:26 GMT

 మలయాళ స్టార్‌ మోహన్‌ లాల్‌ (Mohan Lal)కి ప్రత్యేకమైన మార్కెట్ ఉంది. ఆయనకు మన సౌతిండియన్ భాషలన్నిటిలోనూ అభిమానులు ఉన్నారు. హీరోగా కాకపోయినా సహాయ పాత్రలో,మరో పాత్రలోనే కనపడుతూనే ఉంటారు. లేదా ఆయన మళయాళ సినిమాలు డబ్బింగ్ అయ్యి అభిమానులను పలకరిస్తూంటాయి. ఇలా నటుడుగా బహుముఖంగా వెలుగుతున్న ఆయన ఇప్పుడు డైరక్షన్ వైపు తన దృష్టి పెట్టారు. తనే హీరోగా చేస్తూ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘బరోజ్‌ ’ (Barroz ). థియేటర్ లో ఓ మాదిరి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటిటిలోకి వచ్చింది. ఇన్నేళ్ల తన సినీ అనుభవంతో మోహన్ లాల్ ఎలాంటి కథను ఎంచుకుని ఉంటారు., మోహన్ లాల్ డైరక్షన్ ప్రతిభ ఎలా ఉందో చూద్దాము.

స్టోరీ లైన్

బరోజ్(మోహన్ లాల్) 1663 సమయంలో పోర్చుగీసు నుంచి ఇండియాకి వచ్చి స్థిరపడిన రాజకుటుంబంకు విధేయుడు . అయితే ఓ యుద్ద టైమ్ లో ఆ రాజు నెల రోజుల్లో వస్తాను అని గోవా వదిలి తన పరివారంతో వెళ్లిపోతాడు. వెళ్లిపోయేముందు తన వద్ద ఉన్న భారీ నిధికి కాపలాగా ఉండాలి అని బరోజ్ కి చెప్తాడు.. అప్పటి నుంచి బరోజ్ ఇప్పటిదాకా ఆ నిధికి కాపలా కాస్తుంటాడు.

ఈ క్రమంలో 400 ఏళ్లు గడిచిపోతారు. . సముద్రతీరంలోల ఉన్న ఆ రాజభవనాలను రాచరికపు వస్తువులతో కూడిన మ్యూజియంగా మారుస్తారు. అక్కడి దగ్గరలో ఉన్న ఒక పాత బంగ్లాలో ఆ రాజుకి చెందిన నిధి అక్కడ నిక్షిప్తం చేయబడి ఉంటుంది. ఆ బంగ్లాను కూల్చి 'క్యాసినో' నిర్మిచాలనే ఆలోచాలని కొందరు ప్లాన్ చేస్తూంటారు. అయితే ఆ నిధిని అప్పటి నుంచి భూతంగా మారిన బరోజ్ కాపాలా కాస్తూ రక్షిస్తూ ఉంటాడు. ఆ నిధిని కొల్లగొట్టడానికి ప్రయత్నించినవారిని ఆ భూతం తరిమికొడుతూంటాడు.

రాజవంశీకులకు ఆ నిధిని అప్పగించే రోజు కోసం భూతమైన బరోజ్ ఎదురుచూస్తూ ఉంటాడు. అలాగే ఆ రాజవంశీకులకు తప్ప ఇతరులకు ఆ భూతం కనిపించదు. అలాంటి పరిస్థితుల్లో విదేశాల నుంచి ఇసబెల్లా (మాయా రావ్) వస్తుంది. రాజవంశానికి చెందిన 13వ వారసురాలు ఆమె. ఇసబెల్లాకి నిధి అప్పగించాలని 'బరోజ్' ఆలోచన. అదే సమయంలో ఆమె ద్వారా ఆ భూతాన్ని బంధించాలని, ఆ ప్రాంతానికి చెందిన 'మరియా' అనే మాంత్రికురాలు ప్రయత్నిస్తూ ఉంటుంది.చివరకు ఏమైంది? మరియా ప్రయత్నాలు ఫలిస్తాయా?బరోజ్ తను కాపాలా కాసే నిధిని ఆ పాపకు అప్పగించారా? చివరికి ఏమైంది? అనేది కథ.

ఎలా ఉంది

కరోనాకు ముందు ప్రారంభమైన చిత్రం పలు కారణాల చేత ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ క్రమంలో మారిన ప్రేక్షకులు ఆలోచనలను ఈ సినిమా అందుకోలేకపోయింది., మోహన్‌లాల్‌ అభిమానులు పెట్టుకున్న అంచనాలను కూడా రీచ్ కాలేదు. అయితే ప్లస్ ఏమిటీ అంటే పిల్లలకు నచ్చే ఫాంటసీ కావటం, త్రీడీలో తెరకెక్కడంతో చిన్నారులకు ఈ సినిమా నచ్చింది. అలాగే బడ్జెట్ కి వెనుకాడకుండా క్వాలిటీగా సినిమా తీసి పాన్ ఇండియా రిలీజ్ చేసి సక్సెస్ సాధిద్దామనుకున్న మేకర్స్ కు నిరాశే ఎదురైంది. 400 సంవత్సరాల క్రితం పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ కూడా ఉండడంతో అప్పటి పోర్చుగీస్ కల్చర్ ని,కింగ్ థీమ్ ని చాలా రిచ్ గా ప్రెజెంట్ చేసారు.

ఈ సినిమాలో గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ కి చాలా స్కోప్ ఉంది. వాటిని క్వాలిటీగానే తీసారు. అంతా బాగానే ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లు కథ,కథనమే బోర్ కొట్టించింది. కథా పరంగా సినిమాలో ఎక్కడా కూడా ఆ భూతంకి పెద్దగా ఛాలెంజ్ విసిరే సమస్యలు ఉండవు.కేవలం ఎమోషనల్ ప్లే తో లాగుదామనే ప్రయత్నం ఫలించలేదు. డబ్బింగ్ సైతం కుదరలేదు. అన్నిటికన్నా పెద్ద మైనస్ ..మోహన్ లాల్ గెటప్ డిఫరెంట్ గా కనిపిస్తుందే తప్ప, భూతంగా మాత్రం అనిపించదు.

చూడచ్చా

ఓవరాల్ గా ఈ సినిమా పిల్లలకు నచ్చే ఒక ఫాంటసీ డ్రామా. అంతకు మించి మోహన్ లాల్ ఉన్నాడు కదా ఎక్కువ ఎక్సపెక్ట్ చేస్తే నిరాశే మిగులుతుంది.

ఎక్కడ చూడచ్చు

డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ (Disney plus hotstar)లో చూడచ్చు ఒరిజినల్‌ మళయాళం సహా తెలుగు ఇతర పాన్‌ ఇండియా (Pan India movie) భాషల్లో అందుబాటులో ఉంది.

Tags:    

Similar News