మిరాయి vs కిష్కిందపురి: డేట్ క్లాష్ ఎవరిని దెబ్బకొట్టింది?
బాక్స్ ఆఫీస్ లో ఎవరు గెలుపు?;
ఈ వీకెండ్ కి రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ఒకటి థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన కిష్కింద పురి ఒకటి కాగా ఒక డిఫరెంట్ అటెంప్ట్ తో వచ్చిన మిరాయ్ మరొకటి. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన కిష్కింద పూరి సినిమాను కౌశిక్ పెగల్లపాటి డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. కిష్కింద పురి సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ ఇదివరకు రాక్షసుడు సినిమాతో హిట్ అందుకున్నారు. ఆ సినిమా తర్వాత మళ్లీ ఇద్దరు కలిసి చేసిన సినిమా ఇదే. అంతేకాదు బెల్లంకొండ హీరో ఇలాంటి థ్రిల్లర్ జోనర్ ట్రై చేసిన టైం లోనే హిట్ అందుకున్నాడు. అలా సినిమా మీద స్పెషల్ బజ్ ఉంది.
ఇక మరోపక్క పోటీగా వస్తున్న తేజా సజ్జ మిరాయ్ సినిమాను కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేశాడు. మిరాయ్ సినిమా లో మంచు మనోజ్ కూడా ఉన్నాడు. తేజ, మనోజ్ ఇద్దరు కూడా సినిమాకు తమ బెస్ట్ ఇచ్చారు. మిరాయ్ సినిమా ట్రైలర్ తోనే సినిమాపై హ్యూజ్ బజ్ క్రియేట్ అయ్యేలా చేసుకున్నారు. రిలీజ్ కు ముందు ఆడియన్స్ లో రెండు సినిమాలకు మంచి బజ్ ఉంది. కిష్కిందపురి, మిరాయ్ రెండు వేరు వేరు జోనర్ సినిమాలు. దాంతో రెండు ఒకేరోజు వచ్చినా కూడా సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కచ్చితంగా రెండు సినిమాలు సక్సెస్ అందుకునే ఛాన్స్ ఉంటుంది అని ట్రేడ్ అంచనా వేసింది. అయితే ఆ అంచనా తప్పింది. అందుకు కారణం డేట్ క్లాష్ కూడా ఓ కారణం అని ఇప్పుడు అంటున్నారు.
మిరాయ్ వర్సెస్ కిష్కిందపురి సినిమాల మధ్య ఈ ఫైట్ ఆడియన్స్ లో కూడా ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది. హనుమాన్ సక్సెస్ తర్వాత తేజా సజ్జ చేసిన సినిమా కిష్కిందపురి కాగా.. భైరవం తో నిరాశపరచిన బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన కిష్కిందపురి సినిమా తో మెప్పించాలని చూసాడు.
వాస్తవానికి భారీ సినిమాలు రిలీజ్ డేట్ ప్లాన్ చేసేటప్పుడు, అదే రోజు ఏ సినిమాలు భాక్సాఫీస్ ముందుకు వస్తున్నాయో తెలుసుకోవటం అత్యంత ముఖ్యమైన వ్యూహం. కానీ ఎంత ప్లాన్ చేసినా ఒక్కోసారి ఊహించని డేట్ క్లాష్ సమస్యలు రావడం సాధారణమే. తెలుగు ఇండస్ట్రీలో ఒకే రోజున రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే సందర్భాలు కొత్తేమీ కాదు, కానీ ఈసారి ఫలితం మార్కెట్ డైనమిక్స్‌ను చూపుతున్నాయి . ఫాంటసీ అడ్వెంచర్ మిరాయి, హారర్ థ్రిల్లర్ కిష్కిందపురి ను బాక్స్ ఆఫీస్‌లో పూర్తిగా ఓవర్ షాడో చేసేసింది.
మిరాయి మొదట సెప్టెంబర్ 5న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నప్పటికీ, సెప్టెంబర్ 12కి షిఫ్ట్ అయింది. ఈ నిర్ణయం కిష్కిందపురి టీమ్‌తో డిస్కస్ చేయకుండా తీసుకోవడం, ఓపినింగ్స్ కలెక్షన్ ఫలితాలపై భారీ ప్రభావం చూపింది. అప్పటికి కిష్కిదపురి హీరో బెల్లంకొండ శ్రీనివాస్ స్పష్టంగా చెప్పారు: “మిరాయి టీమ్ మాకు రిలీజ్ డేట్ గురించి సమాచారం ఇవ్వలేదు. మేం కొంచెం కో ఆర్డినేట్ చేసుకున్నా, డే 1లో మంచి నంబర్స్ సాధించవచ్చు” అని. ఇలా చేయకపోవటం వల్ల ఏం జరిగింది
* కిష్కిందపురి పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ పొందినా అనుకున్న స్దాయిలో భాక్సాఫీస్ దగ్గర నంబర్స్ నమోదు చెయ్యలేదు, వీకెండ్ లో గ్రోత్ పెద్దగా లేదు.
* కానీ మిరాయి కు అదే కలిసి వచ్చింది. అదిరిపోయే టాక్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ , యూత్ ని ఎట్రాక్ట్ చేస్తోంది. దాంతో ఈ హారర్ చిత్రాన్ని పూర్తిగా ప్రక్కన పెట్టేలా చేసింది.
* సింగిల్ గా ఈ వీకెండ్ కు వస్తే, కిష్కిందపురి డే 1లో డబుల్ డిజిట్ సాధించేది అని ట్రేడ్ అంటోంది.
మార్కెట్ ఇంపాక్ట్:
* ఈ క్లాష్ ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రమే కాకుండా, వీకెండ్ మూమెంట్ కి కూడా బారియర్‌గా మారింది.
* మిరాయి ఆడియన్స్ పుల్ ఎక్కువగా ఉండటం, కిష్కిందపురి ఆడియన్స్ ఎక్కువగా niche—హారర్ క్రేజ్—మాత్రమే, కాబట్టి క్లాష్ లో లూజర్ గా నిలిచింది.
* ఇక్కడ స్పష్టంగా సోలో ప్లానింగ్, స్ట్రాటజిక్ డేట్ సెలక్షన్ ఎంత ముఖ్యమో ప్రూవ్ చేసినట్లు అయ్యింది.
ఇండస్ట్రీ పాయింట్:
* పెద్ద బడ్జెట్, మాస్ ఎంటర్టైనర్ సినిమాలు,ఇలాంటి హారర్ జానర్స్ ను ఓవర్ షాడో చేసిన చరిత్ర చాలా కాలం నుంచి ఉంది.
* కో ఆర్డినేషన్ లేకపోతే, ఇలాంటి వేరే జానర్ సినిమాలు సఫర్ అవుతాయి.
* అందుకే మిరాయి మీద ఎలాంటి ఎఫెక్ట్ లేదు, కానీ కిష్కిందపురి పూర్తిగా ప్రభావితమైంది.
ఇండస్ట్రీ లెసన్:
ఒక్కో చిన్న ప్లానింగ్ మిస్ అయినా, భాక్సాఫీస్ కలెక్షన్స్ పై గట్టి ప్రభావం చూపవచ్చు. మిరాయి క్లియర్లీ విన్నర్, కిష్కిందపురి దురదృష్టవశాత్తు లూజర్ అని చెప్పొచ్చు.