మరో సూపర్ హీరో కథ : 'మిరాయ్' రివ్యూ

చందమామ కథలా మొదలై, మార్వెల్ స్కేల్‌లో ఎగిరిన ఫాంటసీ!;

Update: 2025-09-12 10:58 GMT

హిమాలయాల నిశ్శబ్ద గుహల్లో మొదలైన ఒక రహస్య సాహస యాత్ర ఇది. సన్యాసిని విభ (రితిక నాయక్ ) కి ఒక అసాధారణ కర్తవ్యం అప్పగించబడుతుంది. హైదరాబాద్ వీధుల్లో చిన్న మోసాలు చేసుకుని బ్రతుకుతున్న వేద ప్రజాపతి (తేజ సజ్జా) ని కనుక్కుని, అతని నిజమైన వారసత్వాన్ని మేల్కొలపడం. అదే సమయంలో వేద ను ఓ యోధ గా సంసిద్దం చేయటం.

కానీ అనాధ అయిన వేదకు తన జీవితంలో వేరే కర్తవ్యం ఉందని, తనలో తనకే తెలియని అనేక శక్తులు, జ్ఞాపకాలు ఉన్నాయని తెలియదు. అంతే కాదు తను అనాధ కాదని అతని తల్లి అంబిక (శ్రియ) ఒకప్పుడు తొమ్మిదవ పవిత్ర గ్రంథం ను కాపాడేందుకు తన ప్రాణాలు అర్పించిందని అసలు తెలియదు. ఇప్పుడు తను తన తల్లిలాగే ఆ పవిత్ర గ్రంధాల భాధ్యత తీసుకోవాల్సిన సమయం వచ్చింది.

ఎందుకంటే మహా క్రూరుడు, దుర్మార్గుడు అయిన మహావీర్ అలియాస్ బ్లాక్ స్వోర్డ్ ఇప్పటికే ఎనిమిది పవిత్ర గ్రంథాలను తన చేతుల్లోకి తెచ్చుకున్నాడు. అమరత్వం కోసం చివరి పవిత్ర గ్రంధం సాధించటం కోసం బయిలుదేరాడు. దాన్ని పొందేందుకు అతను ఏ స్థాయిలోకైనా తెగిస్తాడు. ఎంతటి ప్రళయాన్ని అయినా సృష్టిస్తాడు. అతన్ని ఆపాలి. లేకపోతే అల్ల కల్లోలం అయ్యిపోతుంది.

ఇప్పుడు సన్యాసులు, మహా పురుషులు నమ్ముతున్నది ఒక్కటే:

మహావీర్‌ను ఆపగల శక్తి ఉన్నది కేవలం ఒకరికి మాత్రమే —అతనే వేద.

మరి ఒక మోసపూరిత జీవితానికి అలవాటు పడిన వేద ఓ దివ్య యోధుడిగా మారగలడా? అసలు 'మిరాయ్' అంటే ఏమిటి...అందులో దాగి ఉన్న రహస్యం ఏమిటి?అలాగే తొమ్మిది పవిత్ర గ్రంధాల విషయం ఏమిటి...మహావీర్ ..ఆ తొమ్మిది గ్రంధాల సాయింతో ఏం సాధిద్దామని బయిలుదేరాడు. వేద కు భగవాన్ శ్రీరాముని ఆశీస్సులు ఎలా లభించాయి? దేవతల అనుగ్రహం, పూర్వికుల త్యాగం, భవిష్యత్తు ఆశ వీటిన్నటితో వేద..ఎలా మహావీర్ ని పెద్ద వినాశనం నుంచి ఆపాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్

'మిరాయ్' అంటే భవిష్యత్తు . కానీ ఈ సినిమాలో అది ఒక దివ్య ఆయుధం అనే అర్దంలో వాడారు. దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని తనే రైటర్ గా మారి...మన భారతీయ పురాణాలు, అశోకుడి చరిత్ర, మార్వెల్ తరహా సూపర్‌హీరో ఎలిమెంట్స్— అన్ని కలిపి రాసుకున్న సూపర్ హిరో కథని ఓ బలమైన విజువల్ స్పెక్టకిల్ చూపించే ప్రయత్నం చేసారు.

ఈ చిత్రం ప్రారంభ కథ శతాబ్దాలను దాటుతూ, అశోకుడి కళింగ యుద్ధం నుండి మొదలై, రామాయణంలోని పక్షుల గాథలను టచ్ చేస్తూ, ప్రస్తుతకాలంలో ఒక reluctant superhero ప్రయాణంగా సెటిల్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ భాగం స్టోరీ సెటప్ కే సరిపోయింది. అశోకుడు ..ఆయన తొమ్మిది పవిత్ర గ్రంధాలు గురించి చెప్పటం, అలాగే హీరో , విలన్ ఇంట్రడక్షన్ లు, హీరో తల్లిని పరిచయం చేయటం, పవిత్ర గ్రంధాల రక్షకుడుగా హీరోని సీన్ లోకి తీసుకురావటానికి ప్రయత్నాలు ఇవే సరిపోయాయి. ఇందులో ఎంగేజింగ్ గా ఉంది అనేకన్నా విజువల్లీ స్టన్నింగ్ గా కొన్ని విజువల్స్ ఉన్నాయని చెప్పాలి.

ఇక సెకండ్ హాఫ్ లో ప్రెడిక్టబుల్ ట్రోప్స్, రొటీన్ నేరేషన్, వీక్ క్లైమాక్స్ అన్నట్లు ఒకదానికి మరొకటి పోటిపడి నడిచాయి. అందుకు కారణం సెకండాఫ్ లో విలన్ మంచు మనోజ్ ..ప్లాష్ భ్యాక్ చెప్పటం, హీరో తల్లి ప్లాష్ బ్యాక్ చెప్పటానికే ఎక్కువ టైమ్ తీసుకోవటం జరిగింది. ఇలా కథను మధ్యలో ఆపి రెండు ప్లాష్ బ్యాక్ లు చెప్పేసరికి కథ ఎక్కడకీ కదిలినట్లు అనిపించలేదు. అయితే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో శ్రీరాముడు ఎపిసోడ్..ఆ తర్వాత విలన్ తో ఫైట్ తో ఆ లోపాలని సర్దుకున్నాడు.

కథ సింపుల్‌గా “అండర్‌డాగ్ టు సూపర్‌హీరో” ఫార్మాట్‌లో ఉన్నా, దానికి అశోకుని Nine Unknown Men బ్యాక్‌డ్రాప్ జోడించడంతో కథకి మిస్టిక్ ఫ్లేవర్ వచ్చేసింది.

కార్తిక్ ఐదు బ్లాక్స్‌ని బాగా హ్యాండిల్ చేశాడు:

ప్రీ-ఇంటర్వెల్ సీక్వెన్స్

‘వేద’ నుండి ‘యోధ’గా మారే ట్రాన్స్‌ఫర్మేషన్

విలన్ బ్యాక్‌స్టోరీ

జైత్రయ పాటతో మాంటేజ్ సన్నివేశాలు

క్లైమాక్స్‌లో శ్రీరాముడి ఎంట్రీ

హైలైట్స్

ప్రభాస్ వాయిస్ ఓవర్ తో సినిమా ప్రారంభం కావటం

సంపాతి రివీల్ — రామాయణంలోని ఈ మైథికల్ బర్డ్‌ని డ్రాగన్ ఎలిమెంట్స్‌తో కలిపి VFXలో చూపించడం goosebumps.

కోదండం రీ-ఇమాజిన్ — హ్యారీ పోటర్ వాండ్ ఇన్‌స్పిరేషన్‌తో, శ్రీరాముని ఆయుధం గా తీసుకురావడం క్రియేటివ్.

మార్వెల్-స్టైల్ యాక్షన్ — మోడ్రన్ టచ్ ఇచ్చింది.

మైనస్ లు

మిరాయ్ లో ‘వైబ్ ఉందిలే పిల్లా వైబ్ ఉందిలే’ పాట థియేటర్లలో రాలేదు.

స్క్రీన్ ప్లే లో జగపతిబాబు ఎంట్రీ తర్వాత నేరేషన్ ప్రెడిక్టబుల్ కావటం.

క్లైమాక్స్‌లో శ్రీరాముడి దర్శనం ఎమోషనల్‌గా ఉన్నా, ఎక్స్‌పెక్ట్ చేసినంత పంచ్ లేదు

హీరో ఇంట్రడక్షన్ యాక్షన్ ఎపిసోడ్, ఫ్రెండ్స్- పోలీస్ లు కామెడీ, రొమాంటిక్ ట్రాక్ – ఇవన్నీ కలిపి 20-25 నిమిషాలు స్లో అయ్యాయి.

వెంకటేష్ మహా, కిషోర్ తిరుమల కామెడీ ట్రాక్స్ – ఫోర్స్‌డ్‌గా, అనవసరంగా కనిపించాయి.

కొన్ని విజువల్స్‌లో AI వాడకం ఎక్కువగా ఫీల్ అయ్యింది.

“అండర్‌డాగ్ టు సూపర్‌హీరో” జర్నీ – హనుమాన్ డెజావూ ఫీలింగ్ ఇచ్చింది.

పర్ఫార్మెన్సెస్

తేజ సజ్జా — బాగా ఇంప్రెస్ చేశాడు. యాక్షన్ సీన్స్‌లో కాంఫిడెన్స్ కనబడింది. శ్రియా సరణ్ (అంబిక) — మేచ్యూర్, ఎమోషనల్, కథకి వెయిట్ ఇచ్చిన రోల్.

మంచు మనోజ్ (మహావీర్/బ్లాక్ స్వోర్డ్) — సప్రైజ్ ప్యాకేజ్. రిస్ట్రెయిన్‌డ్, న్యూట్రల్ యాక్టింగ్. మిగతావాళ్లు చేసుకుంటూ వెళ్ళిపోయారు.

టెక్నికల్ గా కొన్ని చోట్ల బ్రిలియెంట్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ఫైనల్ ధాట్

ప్రారంభంలో అశోకుడు, చివర్లో శ్రీరాముడు, ఇలా హిస్టరీ, మైథలాజికల్ ఏదీ వదలలేదు దర్శకుడు ఈ కథ తయారు చేసుకునేటప్పుడు. అయితే కథలో కావాల్సినన్ని లేయర్స్, ప్లాష్ బ్యాక్ లు, ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ కథకు కావాల్సిన టెన్షన్ ని, అటెన్షన్ ని క్రియేట్ చేసే స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు. ఖచ్చితంగా చెప్పాలంటే 'మిరాయ్' ..విజువల్స్ మీద పూర్తిగా దృష్టి పెట్టిన సినిమా. అద్భుతమైన విజువల్స్, స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ దీన్ని థియేట్రికల్ ఎక్సపీరియన్స్ గా నిలబెట్టాయి. సెకండ్ హాఫ్ లో రొటీన్‌ గా అనిపించినా , మైథాలజీ, ఫ్యాంటసీ, సూపర్‌హీరో ఫ్యూజన్ కోసం ఓ సారి చూడచ్చు.

Tags:    

Similar News