హాలీవుడ్ చిత్రం "ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్" రివ్యూ

ఈ కొత్త సినిమా వాటన్నిటికన్నా భిన్నంగా, ఆసక్తిగా ఉందంటూ ప్రచారం చేస్తూ వచ్చారు. అందులో నిజం ఎంత, అసలు సినిమాలో కథేమిటి వంటి విషయాలు చూద్దాం.;

Update: 2025-07-25 12:15 GMT

మార్వెల్ స్టూడియోస్ నుంటి వచ్చే సినిమా అంటే ఓ క్రేజ్. ఈ సంస్ద నుంచి వచ్చే సినిమాలపై ప్రతీ సారి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తి, అంచనాలు ఉంటూ వస్తున్నాయి. అవి సక్సెస్ అయినా కాకపోయినా ఈ స్టూడియో ఫిల్మ్ లకు ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే తాజాగా వచ్చిన మరో సినిమా ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్. ఫెంటాస్టిక్ ఫోర్ అనేది మార్వెల్ తొలి సూపర్‌హీరోల గ్రూప్. వీళ్లకోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇదివరకూ వచ్చిన ఫెంటాస్టిక్ ఫోర్ సినిమాలు బాగా నడవకపోయినా… ఈ కొత్త సినిమా వాటన్నిటికన్నా భిన్నంగా, ఆసక్తిగా ఉందంటూ ప్రచారం చేస్తూ వచ్చారు. అందులో నిజం ఎంత, అసలు సినిమాలో కథేమిటి వంటి విషయాలు చూద్దాం.

కథేంటి:

ఈసారి, కథ 1960 కాలంలో ప్రారంభమవుతుంది. ఫెంటాస్టిక్‌ ఫోర్‌ సభ్యులు, భార్యాభర్తలైన రీడ్ రిచర్డ్స్‌ (పెడ్రో పాస్కల్‌), స్యూ స్ట్రామ్‌ (వన్నెస్సా కిర్బీ) — త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నట్లు తెలిసి ఆనందంగా ఉంటారు. ఆ టైమ్ లో ఆ కుటుంబపు ఆనందాన్ని మింగేయడానికి ... గలాక్టస్‌ అనే విశ్వ వినాశక రాక్షసుడు వస్తున్నాడని తెలుస్తుంది. అతని ముందు దూతగా సిల్వర్ సర్ఫర్‌ (షల్లా) భూమికి వచ్చి ఈ విషయం హెచ్చరించి వెళ్తుంది. దాంతో వెళ్లి నక్షిత్రమండలాలు దాటి గలాక్టస్‌ ని కలుస్తారు వీళ్లు. అప్పుడు అతనో కండీషన్ పెడ్తాడు.

భూమిని మింగేయడం ఆపేయాలంటే రీడ్, స్యూ తన బిడ్డను గలాక్టస్‌కు సమర్పించాలి — ఇదీ గలాక్టస్‌ డిమాండ్. ఇంతటి పరిస్దితుల్లో ఫెంటాస్టిక్ ఫోర్ మిగతా సభ్యులైన బెన్‌ (మోస్ బాక్రాక్‌), జానీ స్ట్రామ్‌ (జోసెఫ్ క్విన్‌) లతో వారు ఏం చేసారు. తమ బిడ్డను,ప్రపంచాన్ని ఎలా రక్షించుకున్నారు. అసలు వాళ్ల బిడ్డను గలాక్టస్‌ ఎందుకు అడిగాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్

కరోనా తర్వాత మార్వెల్‌ను చూసే ప్రేక్షకులపై ఒక ఒత్తిడి ఏర్పడింది — ఒక సినిమా చూడాలంటే ముందు ఆరు సినిమాలు, రెండు సిరీస్‌లు చూసుండాలి! ఈ ఇంటర్‌కనెక్టెడ్ ప్రపంచం ఓ అద్భుత ప్రయోగం అయినా, సాధారణ ప్రేక్షకులకు అది భారంగా మారింది. ఈ సమస్యకు ఫెంటాస్టిక్ ఫోర్ మంచి పరిష్కారం చూపింది.

ఎందుకంటే ఇది MCU నుంచి దూరంగా, Earth-828 అనే కొత్త యూనివర్స్‌లో చోటుచేసుకున్న కథ. ఎలాంటి ప్రీవియస్ సినిమాల జ్ఞానం అవసరం లేదు. మీరు దీన్ని చూసేందుకు ముందుగా ఏదీ తెలుసుకోనవసరం లేదు — ఇది గత సినిమాలతో సంభంధం లేకుండా సొంతంగా నడిచే సినిమా. ఇది మార్వెల్‌కు ‘రీసెట్ బటన్’ కాదు... కానీ దానివైపు వేసిన కొత్త బలమైన అడుగు.

ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ – పైకి ఒక ఫ్యామిలీ డ్రామా లా అనిపించినా, ఇది వాస్తవానికి గ్రహాంతర స్థాయి ఎడ్వెంచర్!ఈ కథ మొత్తం ఆ టీమ్ చుట్టూ తిరిగినప్పటికీ, ఇందులో ఉన్న ప్రమాదం మాత్రం చిన్నది కాదు — అది భూమి మొత్తాన్నే మింగేయాలనుకునే గాలాక్టస్ రూపంలో వస్తుంది. ఈ సినిమా అసలు ఎట్రాక్షన్ ఏమిటంటే, ఇది తొలిదశ MCU సినిమాలా అనిపిస్తుంది: సరదాగా ఉంటుంది కానీ అవసరంలేని హాస్యంతో ఇబ్బంది పెట్టదు. సీరియస్‌గా ఉంటుంది కానీ నెగటివ్ మూడ్‌లో నెట్టిపెట్టదు . గెలాక్సీ వంటి హంగులతో నిండిందే కానీ కథను వదలి పెట్టదు.

అలాగే Spider-Man: No Way Home లేదా Doctor Strange in the Multiverse of Madness తర్వాత ఇదే అత్యంత ఫన్‌ని కలిగించిన మార్వెల్ సినిమా అనిపిస్తుంది. కానీ ఇందులో ఒక ప్రధాన బలం — ఇది పూర్తిగా స్వతంత్ర కథ. ఇదే కలిసొచ్చింది. ఫస్ట్ స్టెప్స్ సినిమాకు మరో కీలక ప్లస్ విలన్ చిత్రీకరణ. రాల్ఫ్ ఇన్నెసన్‌ పోషించిన గాలాక్టస్‌ పాత్ర బాగా ఆకట్టుకుంటుంది.

చూడచ్చా

ఇలాంటి సినిమాలు రెగ్యులర్ గా చూసేవాళ్లు ఎలాగూ వెళ్తారు. మిగతా వాళ్లకు కూడా కొత్త ఎక్సపీరియన్స్ ఇస్తుంది.

ఫైనల్ థాట్

Fantastic Four: First Steps కథలో ఎమోషన్, యాక్షన్, హ్యూమర్ అన్నీ ఉన్నా... ఇందులో ముఖ్యంగా అర్దంకానీ సంక్లిష్టత కనిపించదు, స్పష్టత ఈ సినిమాకు పెద్ద ప్లస్. ఇది కొత్తదనంతో ముందుకు వచ్చిన మార్వెల్ సినిమా. ఎలాంటి baggage లేకుండా, ఒక ఫ్రెష్ స్టార్ట్‌గా భావించవచ్చు. ఆ ప్రయోగం చాలా వరకు విజయవంతమైనట్లే. మొత్తానికి, ఇది మార్వెల్ సొంత మ్యాజిక్‌ను మళ్లీ గుర్తు చేసేలా చేసింది. కానీ ఇప్పుడు ప్రశ్న ఇదే — ఇక్కడి నుంచి వాళ్లు ఏ దిశలో వెళ్తారు? అనేదే.

ఈ సినిమా చూస్తుంటే, “మార్వెల్ మళ్లీ తన స్థాయిని తిరిగి పొందే రోజు చాలా దూరంలో లేదు” అనే ఆశ కొత్తగా చిగురిస్తుంది. ఇదే మార్గంలో ముందుకు సాగితే, ఫ్రాంచైజీకి తిరుగులేదు.

Tags:    

Similar News