ఒక నోస్టాల్జిక్ రైడ్! ‘లిటిల్ హార్ట్స్‌’ రివ్యూ

ఫ్యామిలీతో కలిసి చూసి కామెడీ!;

Update: 2025-09-09 02:30 GMT

2009-2020 మధ్య కాలంలో జరిగే కథ ఇది. నల్లి అఖిల్ (మౌళి త‌నూజ్‌) చదువులో బిలో యావరేజ్. కానీ అల్లరిలో, అమ్మాయిల విషయంలో మాత్రం స్పీడుగా దూసుకుపోతూంటాడు. దాంతో ఎంసెట్ లో ర్యాంక్ రాదు. పేమెంట్ సీటుతో ఇంజినీరింగ్ లో చేరాలనుకుంటాడు. కానీ తండ్రి గోపాల‌రావు (రాజీవ్ క‌న‌కాల‌) మాత్రం సీట్ కొట్టే ఇంజినీరింగ్ కాలేజీలో చేరాలని లాంగ్ ట‌ర్మ్ కోచింగ్‌కి పంపిస్తాడు.

ఇక మరో ప్రక్క కాత్యాయ‌ని (శివానీ నాగారం)ది కూడా కొంచెం అటూ ఇటూలో అలాంటి సిట్యువేషనే. ఆమె త‌ల్లిదండ్రులిద్ద‌రూ డాక్ట‌ర్లే కావటంతో ఆమె కూడా తమలాగే డాక్టర్ చేయాలనేది వారి కోరిక. కానీ కాత్యాయని చదవు అంతంత మాత్రం కావటంతో ఎంబిబియస్ లో సీట్ రాక లాంగ్‌ట‌ర్మ్ కోచింగ్‌లో చేరుతుంది.

ఈ ల్యాంగ్ టెర్మ్ కోచింగ్ లోనే అఖిల్‌, కాత్యాయ‌ని ప‌రిచ‌యమవుతారు. తర్వాత అఖిల్ లవ్ ప్రపోజల్ పెడతారు. అయితే అప్పుడు కాత్యాయని తనకు చెందిన ఓ విషయం రివీల్ చేస్తుంది. ఆ విషయం విన్న అఖిల్ షాక్ అవుతాడు. ఆలోచనలో పడతాడు. అది తమ ప్రేమకు అడ్డం అని అర్దం చేసుకుంటాడు. ఇంతకీ ఆ విషయం ఏమిటి... చివరకు ఈ ప్రేమ కథ పాజిటివ్ టర్న్ తీసుకుందా లేదా అనేది మిగతా కథ.

విశ్లేషణ

“జియో సిమ్ రాకముందు లవ్ స్టోరీలు ఇలా ఉండేవి ” అంటూ మొదలెట్టన ఈ చిత్రం ఒక నాస్టాల్జిక్ యూత్ ట్రిప్ గా డిజైన్ చేసారు. కథ కొత్తేమీ కాదు. రెగ్యులర్ టీనేజ్ లవ్‌స్టోరీ ఫార్ములానే. కానీ… డైరెక్టర్ రాసుకున్న సన్నివేశాలు, పంచ్ డైలాగులు, ఫన్ ట్రీట్మెంట్ – ఇవే Little Heartsని నిలబెట్టాయి. 2009–2020 మధ్య కాలేజీ చదివిన వారికైతే? “అదే మన కథే!” అని ఫీలయ్యేంతగా కనెక్ట్ చేయగలిగారు. ముఖ్యంగా ఎమ్ సెట్ కోచింగ్ సెంటర్‌లో హీరో-హీరోయిన్ల పరిచయం, అఖిల్ కాత్యాయిని ఇంప్రెస్ చేయడానికి చేసే ఎఫర్ట్స్, ఫ్రెండ్ వేసే పంచ్‌లు – ఇవన్నీ హాల్‌లో “నవ్వుల వర్షం” కురిపిస్తాయి.

“Drama is life with the dull bits cut out.” – Alfred Hitchcock.

హిచ్‌కాక్ చెప్పినట్టే, ఇక్కడ dull bits ఏవీ లేవు.

సెకండాఫ్ మొదలయ్యాక కామెడీ డోస్ పెంచారు. హీరో చేసిన సర్‌ప్రైజ్‌లు, ఇంట్లో వాళ్లకు తెలిసిన తర్వాత వచ్చే టెన్షన్ సీన్స్, కాత్యాయిని పాట చుట్టూ అల్లిన కామెడీ – ఇవన్నీ థియేటర్‌లో నవ్వించాయి.

సిల్లీ సీన్స్

అయితే చిన్న పిల్లలను వాడుకున్న కొన్ని సన్నివేశాలు మాత్రం “ఎందుకీ సీన్?” అన్న భావన కలిగిస్తాయి. అలాగే ఒకటి రెండు డైలాగులు ఫ్యామిలీ ఆడియన్స్‌ను అసౌకర్యానికి గురి చేస్తాయి. కానీ, మిగతా యూత్‌ఫుల్ సినిమాలతో పోలిస్తే వల్గారిటీ చాలా తక్కువ. ఇది ఈ సినిమా biggest plus point.

“గోల్స్ ఎప్పుడూ అందంగా ఉండాలి” అనే లైన్‌తో మొదలైన ట్రాక్, క్లైమాక్స్‌లో ఎమోషనల్‌గా సెట్ కావడం బావుంటుంది. అయితే ఈ చిత్రానికి ప్రీక్లైమాక్స్‌, క్లైమాక్స్‌ను మరింత ఎంటర్‌టైనింగ్‌గా రాసుకుంటే బాగుండేది అనిపించింది.

హైలెట్స్

హీరోయిన్ కి దగ్గరయ్యేందుకు అఖిల్ ట్రైలు, ఆమె బర్త్‌డే సర్‌ప్రైజ్, అవి ఇంట్లోవాళ్లకి తెలిసిపోవడం… ఫుల్ లాఫ్ రయట్.

“కాత్యాయని” పాటని చుట్టూ అల్లిన సన్నివేశాలు అయితే డబుల్ ఇంపాక్ట్ ఇచ్చింది.

నటీనటుల్లో...

అఖిల్ పాత్ర‌లో మౌళి త‌నూజ్ త‌న వ‌య‌సుకు త‌గ్గ ఆ పాత్ర‌ని ఈజ్ తో చేసేసాడు. అలాగే కాత్యాయ‌ని గా శివానీ నాగారం గా ఫెరఫెక్ట్ ఛాయిస్. ఇక హీరో స్నేహితుడిగా క‌నిపించిన జ‌య‌కృష్ణ పంచ్ లు పెద్ద ప్లస్. రాజీవ్ క‌న‌కాల‌, అనిత చౌద‌రి, ఎస్‌.ఎస్‌.కాంచి, స‌త్య‌కృష్ణ‌న్ హీరో హీరోయిన్ల త‌ల్లిదండ్రులుగా క‌థ‌లో కీ రోల్స్ లో చేసుకుంటూ పోయారు.

ఫైనల్ థాట్

‘లిటిల్ హార్ట్స్’ అనేది కొత్తదనం లేని కథ అయినా, నవ్వులు, నాస్టాల్జియా, నిజాయితీతో రాసిన స్క్రీన్‌ప్లే వల్ల గుర్తుండిపోయే యూత్ కామెడీగా నిలుస్తుంది.ఇది ఖచ్చితంగా చెప్పాలంటే నిబ్బా-నిబ్బి లవ్ స్టోరీ. సరైన రిథమ్ ఉన్న సీన్స్, సింపుల్ గా రిలేటబుల్ అయ్యే క్యారెక్టర్స్, ఫన్‌తో పాటు సాఫ్ట్ మెసేజ్ ఇచ్చే క్లైమాక్స్. ఇవన్నీ ఉంటే, చిన్న సినిమా కూడా పెద్దగా అనిపిస్తుంది. అదే ఈ చిత్రానికి నిజమైన హార్ట్‌బీట్.

Tags:    

Similar News