బడ్జెట్ 50 లక్షలు కలెక్షన్స్ 100 కోట్లు

గుజరాతీ చిత్రం ‘లాలో’ సక్సెస్ స్టోరీ

Update: 2025-11-25 02:30 GMT

కేవలం ₹50 లక్షల బడ్జెట్‌తో తీసిన గుజరాతీ చిత్రం ‘లాలో – కృష్ణ సదా సహాయతే’ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ నటించిన ‘చావా’ ను మించి, 2025లో 6వ వారం అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డ్ సెట్ చేసింది. ఇవి ఏ పెద్ద పాన్–ఇండియా సినిమాలకైనా చిన్న నంబర్లే. కానీ అతి చిన్న, స్వచ్ఛమైన గుజరాతీ కథ ఈ అసాధ్యాన్ని సాధించింది.

గుజరాతీ సెన్సేషన్ ‘లాలో – కృష్ణ సదా సహాయతే’ బాక్సాఫీస్‌ వద్ద ఏ మాత్రం తగ్గే సూచనలు చూపడం లేదు. ఇప్పటికే 7వ వారంలోకి వచ్చినా, ఈ భక్తిరసమయ డ్రామాకు థియేటర్లలో ఇంకా పూర్తిగా హౌస్‌ఫుల్ షోలు.

₹50 లక్షల చిన్న బడ్జెట్… కానీ ఇప్పటి వరకు చేసిన వసూళ్లు?

మొత్తం ₹73 కోట్లు!

ఇది గుజరాతీ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా రికార్డు సెట్ చేసింది.

100 కోట్ల మార్క్ వైపు దూసుకెళ్తున్న అద్భుతం!

7వ వారం వరకు కూడా జనాలు థియేటర్లకు పరుగులు పెడుతుండడంతో, ‘లాలో’ ఇప్పుడు అరుదైన ₹100 కోట్ల క్లబ్‌కి చేరడానికి చేయి చాస్తోంది.

14,000% లాభం! భారతీయ రీజినల్ సినిమాల్లో ఇదే అతిపెద్ద మిరాకిల్

₹50 లక్షల సినిమాకి 14,000% కంటే ఎక్కువ ప్రాఫిట్ రావడం ఇండియన్ రీజినల్ సినిమా హిస్టరీలో ఇప్పటిదాకా వినిపించని విషయం. ‘లాలో’ ఏం రుజువు చేసిందంటే— చిన్న సినిమాలూ దేవుడి విశ్వాసం + కంటెంట్ పవర్‌తో ఏ స్థాయి మిరాకిల్స్ చేయగలవో.

స్లో స్టార్ట్ నుంచి ఇండస్ట్రీ హిస్టరీ దాకా — ‘లాలో’ ఇలా బ్లాక్‌బస్టర్‌గా మారిందా? 50 లక్షల సినిమా 100 కోట్లకు ఎలా చేరింది!

‘లాలో – కృష్ణ సదా సహాయతే’ బాక్సాఫీస్‌లో చేసిన జర్నీ… సాధారణం కాదు, చరిత్రే అయింది. ఇండస్ట్రీ ట్రాకర్ Sacnilk ప్రకారం, సినిమా ఇప్పటివరకు ₹73.35 కోట్లు వసూలు చేసింది. ఈ వారం 50 రోజులు పూర్తిచేయబోతోంది — అది కూడా ఫుల్ డిమాండ్తో!

1వ వారం: 26 లక్షలు మాత్రమే… 3వ వారం నుంచి అద్భుత మార్పు!

సినిమా మొదటిసారి రిలీజ్ అయ్యే సమయంలో—

1వ వారం: ₹26 లక్షలు

2వ వారం: చిన్న మెరుగుదల మాత్రమే

అంతే.

ఇక్కడే సినిమాలు సాధారణంగా కూలిపోతాయి.

కానీ ‘లాలో’? !

3వ వారం: 100% జంప్!

4వ వారం: 1,800% జంప్ — ఇదే అసలు బ్రేక్!

మూడో వారంలో కలెక్షన్స్ రెట్టింపు అయ్యాయి.

ట్రేడ్ కూడా షాక్‌లోకి వెళ్లింది.

కానీ నాలుగో వారం వచ్చిన జంప్?

అది బాక్సాఫీస్ లో వినిపించని రేంజ్ —

1,800% భారీ సర్జ్!

అక్కడినుంచి ఇంజిన్ ఆగలేదు. డిమాండ్ మరింత ఎక్కువైంది, షోలు పెరిగాయి, హౌస్‌ఫుల్స్ వరుసగా వచ్చాయి.

5వ, 6వ వారాలు: ఒక్కో వారం దాదాపు ₹25 కోట్లు!

చిన్న రీజినల్ సినిమా ఇలా వరుసగా రెండు వారాలు ₹25 కోట్ల రేంజ్‌లో ఆడడం— ఇది భారత సినిమా చరిత్రలో చాలా అరుదు.

7వ వారం: వీకెండ్‌తోనే ₹10 కోట్ల దాకా!

ఏడో వారంలో కూడా అసలే స్లోడౌన్ లేదు. ఫ్యామిలీ ఆడియన్స్, రిపీట్ విజిట్స్, డివోషనల్ కనెక్ట్ — ఇవన్నీ కలిపి సినిమా ఇంకా హాట్‌గా పరుగెడుతోంది.

ఇప్పుడు ‘లాలో – కృష్ణ సదా సహాయతే’ అధికారికంగా— గుజరాతీ ఇండస్ట్రీ ఆల్-టైమ్ హయ్యెస్ట్ గ్రోసర్!

మన ఇండియన్ బాక్సాఫీస్‌లో మరోసారి రుజువైంది — “పెద్ద బడ్జెట్‌ కాదు… పెద్ద కథే హిట్‌ను తయారు చేస్తుంది.”

చిత్రం కథేంటి

“తన తప్పుల్లోనే పూర్తిగా చిక్కుకున్న మనిషిని… కృష్ణుడు ఎలా బయిటకు తెచ్చి తిరిగి దారిలో పెట్టాడు? అనేదే ‘లాలో’ కథ స్టోరీ లైన్.

లాలో – కృష్ణ సదా సహాయతే కథలో లాలో (కరణ్ జోషి) అనేది తన అహంకారం, కోపం, తప్పులు అన్నింటి మధ్య నలిగిపోయిన మనిషి. ఒక రాత్రి భార్య తులసి (రీవా రచ్)తో భారీ వాదన తర్వాత, ఆవేశంతో… మద్యం మత్తులో… ఇంటిని వదిలి వెళ్లిపోతాడు. అడ్డు వచ్చిన దొంగతనం ప్రయత్నం అతన్ని ఒక అడవిలో ఉన్న రహస్యమైన ఇంటికి తీసుకుపోతుంది.

“ఒక్కడే… బయటకే దారి లేదు… ఓటమి వైపు లాక్కుంటున్న గది!”

ఆ ఇల్లు లోపలికి వచ్చిన వెంటనే లాలోకి ఏదో తప్పు జరిగిందన్న ఫీలింగ్ వస్తుంది. కిటికీ గ్రిల్స్ మొత్తం ఎలక్ట్రిక్ కరెంట్. బయటికి వెళ్లే మార్గం లేదు. ఆహారం లేదు. నీరు లేదు. సహాయం చేసేవాళ్లు… మైళ్ల దూరంలో కూడా లేరు. ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ, అతని మానసిక స్థితి క్రమంగా కూలిపోతుంది.

ఒంటరితనం, భయం, పశ్చాత్తాపం… ఇవి అన్నీ కలిసి అతన్ని నెమ్మదిగా లోనికి లాగేస్తాయి. “అక్కడే మొదలవుతుంది—లాలో జీవితంలోని అందమైన గతం తిరిగి తెరబడటం!”

అతని ప్రేమకథ… అతని భార్యతో గడిపిన స్వర్గసమాన రోజులు… ఒక్క అహంకారం, చిన్న తప్పులే ఎలా అతన్ని అంధకారంలోకి నెట్టాయో… ఇవి అన్నీ అతని కళ్ల ముందే తిరిగి ఆడతాయి. లాలో పూర్తిగా ఏం చేయలేని నిస్సహాయ పరిస్దితుల్లో — అకస్మాత్తుగా ఒక వెలుగు వచ్చి చేరుతుంది.

ఎదురుగా కనిపించేది వేరే ఎవరో కాదు— కృష్ణుడే! (శ్రుహద్ గోస్వామి పోషణ అద్భుతం)

ఆయన మిరాకిల్స్ చేయడు…గోడలు పగల కొట్టడమూ లేదు… తలుపులు తెరవడమూ లేదు… కేవలం పాఠాలు నేర్పుతాడు.

మనస్సులోని చీకటిని వెలుగుతో నింపుతాడు. అతని తప్పులను లాలోకి చూపించి, సరిదిద్దుకోడానికి ధైర్యం ఇస్తాడు.

ఒక చిన్న గదిలో జరిగిన మానవుడు–దేవుడు సంభాషణ అతని జీవితాన్ని మళ్లీ నిర్మిస్తుంది. “తప్పుకి శిక్షా? లేక… ఆత్మను మేల్కొల్పే దైవ పరీక్షా?”. ఇంటి నుండి బయటకు రావడం సాధ్యమేనా?. లేక ఈ బంధనమే అతనిని విముక్తి వైపు తీసుకెళ్లేందుకు కృష్ణుడు వేసిన దివ్య ప్రణాళికా? సమాధానాలు చివరి వరకు ఊహించలేనివి. సినిమా ముగిసే సరికి ప్రేక్షకులు ఆలోచనలో పడిపోయి… హృదయం నిండిపోయి థియేటర్ నుంచి ఇంటికి బయలుదేరుతారు.

ఏదైమైనా ఇది ఇండియన్ సినిమాలో చాలా అరుదైన అచీవ్‌మెంట్. ఇది చిన్న పేలుడు కాదు… భారీ విస్ఫోటం!

‘లాలో – కృష్ణ సదా సహాయతే’ ఇప్పుడు కేవలం గుజరాతీ సినిమా కాదు… ఇది ఒక స్మాల్-బడ్జెట్ మిరాకిల్, భారత బాక్సాఫీస్‌కు ఇన్స్పిరేషన్ కేస్ స్టడీ.

Tags:    

Similar News