జాకీచాన్ తండ్రి ఓ స్పై, తల్లి ఓ డ్రగ్ డీలర్ ..వాళ్లిద్దరూ ఎక్కడ కలిసారంటే...

Know about this love affair of Jackie Chan's parents

Update: 2024-06-15 06:40 GMT

యాక్షన్ సినిమా అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు జాకీచాన్. తనదైన స్టైల్ యాక్షన్‌తో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారాయన. అలాగే పోలీస్ స్టోరీ సీరిస్‌తో జాకీచాన్ ప్రపంచవ్యాప్తంగా పిల్లలను, పెద్దలను ఆకర్షించగలిగారు. ఒక సినిమాను మించి ఇంకో సినిమాలో ప్రవేశపెట్టిన వినూత్నమైన ఫైట్లు, ఛేజింగులు, యాక్షన్ సన్నివేశాలతో అదిరిపోయే తరహాలో వీటిని తీర్చిదిద్దారు. అందుకే జాకీచాన్ సినిమాలంటే ఇప్పటికీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.. జాకీచాన్ మార్క్ ఫైటింగులు, హాస్యాన్ని మన తెలుగు హీరోలు సైతం చాలా సినిమాల్లో అనుకరించారు. అనుసరించారు. కాపీ కొట్టారు.

రీసెంట్ గా 70 వ పుట్టిన రోజు జరుపుకున్న జాకీచాన్ ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘రష్‌ అవర్‌ 4’తో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన కుటుంబం గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు అభిమానులు షేర్ చేసుకుంటున్నారు. “Traces of the Dragon: Jackie Chan and His Lost Family” అనే పేరుతో వచ్చిన డాక్యుమెంటరీలో జాకీ చాన్ కొన్ని స్వయంగా చెప్పుకొచ్చారు. వాటిలో కొన్నిటిని చూద్దాం.

ఈ హాంగ్ కాంగ్ సూపర్ స్టార్ తన తండ్రి ఓ స్పై అని, తల్లి డ్రగ్ డీలర్ అని చెప్పుకొచ్చారు జాకీ చాన్. జాకీచాన్ తండ్రి ఛార్లెస్ చాన్ ఒకప్పుడు చైనా నేషనలిస్ట్ స్పై గా చేశారు. అలాగే ఆ తర్వాత గ్యాంగ్ లాండ్ బాస్ గా చేశారు. తల్లి లీలీ ఛాన్ ..డ్రగ్ డీలర్ అలాగే షాంఘై లో పేరున్న గాంబ్లర్ . అలాగే అతని అక్క అండర్ వరల్డ్ కు చెందిన వ్యవహారాల్లో పనిచేస్తుండేది. ఇవన్నీ తెలిశాక జాకీ చాన్ షాక్ కు గురి అయ్యాడట. హాంగ్ కాంగ్ లో జాకీ ఛాన్ ని తల్లిని ఓ కామన్ హౌస్ వైఫ్ గా, చాలా జెంటిల్ గా, దయగల మహిళగా అనుకునేవారట.

చైనాలో తన తండ్రి స్పై గా పనిచేసి ప్రభుత్వం మారాక తనపై ఎటాక్ లు జరగవచ్చు అనే ఆలోచనతో ఆస్ట్రేలియాలో ఉన్న అమెరికా ఎంబసీలో తన పరిచయాలతో సెటిల్ అయ్యారు. జాకీ తల్లిని తండ్రి ఓ డ్రగ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయినప్పుడు కలుసుకున్నారు. ఆమె తన మొదటి భర్త వలన పుట్టిన ఇద్దరు అమ్మాయిలను సాకడానికి డ్రగ్ స్మగ్లింగ్ లోకి వచ్చానని చెప్పారు. ఆమె మొదటి భర్త జపాన్ బాంబ్ దాడిలో చనిపోయారు. అక్కడ నుంచి ఆమె డ్రగ్ డీలర్ గా మారారు. అయితే ఆమె చాలా డిగ్నిఫైడ్ గా, ఫన్నీగా, స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉండేదని తండ్రి చెప్పారు. తన ఇంటిపేరు ఫాంగ్ అని , తన పేరు Fang Dolang తర్వాత జాకీ ఛాన్ అని పేరు మార్చుకున్నట్లు చెప్తారు

హాంగ్‌కాంగ్‌లో పుట్టిన చాన్ చిన్నప్పటినుంచి అతి చురుకుగా ఉండటంతో తల్లిదండ్రులు, దగ్గరి బంధువులు అతడిని ‘పావొ-పావొ’ అని ముద్దుగా పిలిచేవారు. చైనీస్‌లో దాని అర్థం ‘ఫిరంగి’. ఆ తరువాత కుటుంబం ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాకు వలసవెళ్లారు. అక్కడ కూలీలు చాన్‌ను జాకీ ఆప్యాయంగా పిలిచేవారు. చివరకు అదే పేరు విశ్వవ్యాప్తమైంది. స్టేజ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు ‘బికమ్ ది డ్రాగన్’ అని పిలిచేవారు.

జాకీ చాన్ పుట్టిన సమయంలో ఆస్పత్రిలో చెల్లించడానికి డబ్బుల్లేని తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఆయనకు తెలుసు. తనను ఇంటికి తెచ్చుకోవడానికి తల్లిదండ్రులు అందరి దగ్గరా చందా పోగుచేసి తెచ్చుకున్న విషయాన్ని ఆయన ఏనాడూ మర్చిపోలేదు. స్కూల్ కు వెళ్లి చదువుకున్నది చాలా తక్కువే. జీవితాన్ని చదవడం ప్రారంభించాడాయన. ప్రఖ్యాతిపొందిన చైనా ఒపెరా మాస్టర్ యూజిమ్ యాన్ దగ్గర శిష్యరికం చేశాడు. కుంగ్‌ఫూ, కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్‌లో అనుభవాన్ని సంపాదించడం ప్రారంభించారు.

స్టంట్‌మెన్‌గా షావ్‌బ్రదర్స్ ఫిలిం అకాడమీలో పనిచేసాడు. ఆ తర్వాత గోల్డెన్ హార్వెస్ట్ కంపెనీతో జాకీచాన్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో భాగంగానే 1971లో బ్రూస్‌లీ నటించిన ‘ఏ ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ, ఎంటర్‌ది డ్రాగన్’ చిత్రాలలో హీరోతో ఢీకొనే ఫైటర్‌గా నటించాడు. తర్వాత చాలా సినిమాలు చేసినా ఏది పేరు తేలేదు. కానీ 1978లో వచ్చిన ‘స్నేక్ ఇన్ ది ఈగిల్ షాడో’ జాకీచాన్ పేరును మారుమ్రోగించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు తననుంచి ఏ విధమైన చిత్రాలను కోరుకుంటున్నారో అర్దం చేసుకున్నాడు. అప్పటినుండి కుంగ్‌ఫూ నేపథ్యంలో కథలు రాసుకుని దానికి కామెడీ జోడించి చిత్రాలు తీయడం ప్రారంభించాడు జాకీచాన్.

అవాంతరాలు

మరో ప్రక్క చిన్నతనంలోనే ఓపెరా స్కూల్‌లో సంగీత పాఠాలకు వెళ్లేవాడు జాకీచాన్. 1980లోనే తాను కంపోజ్ చేసిన అనేక ఆల్బమ్స్‌ను రికార్డ్ చేశాడు. మంచి గొంతు వున్న గాయకుడిగా హాంగ్‌కాంగ్‌లోనే గుర్తింపు పొందాడు. దాదాపు 20 ఆల్బమ్స్ స్వీయ సంగీతంలో విడుదల చేసిన సంగీత జ్ఞాని జాకీ. జపాన్, తైవాన్, మాండరిన్ దేశాలలో ఆయనకు ఇప్పటికీ సంగీత అభిమానులు విశేషంగా వున్నారు. ఉయ్ ఆర్ రెడీ (2007)అనే ఆయన విడుదల చేసిన ఒలింపిక్ ట్రాక్ క్రీడాకారులకు ఉత్సాహాన్నిచ్చింది.

భారత్‌తో అనుబంధం

జాకీచాన్‌కు భారత్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ బాలీవుడ్ నటులతో మంచి సంబంధాలు ఉన్నాయి. చైనా ఫిలిమ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవాలకు మన దేశానికి వస్తుంటారు. మల్లికాషెరావత్‌తో కలసి నటించిన ‘ద మిత్’ షూటింగ్‌ కోసం మనదేశంలో చాలా ప్రాంతాల్లో పర్యటించారు. ఆ తర్వాత బహుభాషా చిత్రం ‘కుంగ్ ఫు యోగ’లో భారతీయ నటులు సోనుసూద్, దిషాపటాని, అమర్ దస్తూర్, ఆరిఫ్ రెహ్మాన్‌లతో కలసి నటించాడు. జైపూర్‌లో నిర్వహించిన షూటింగ్‌కు హాజరయ్యాడు.

కామెడీ ,ఫన్ అంటే తెగ ఇష్టపడే జాకీచాన్ తన సినిమాల్లో హాస్య చతురతతో కూడిన సన్నివేశాలకు ప్రాధాన్యం ఇచ్చేలా చూస్తాడు. యుద్ధమైనా, మరణమైనా అందులో హాస్యం పోకడ కన్పించాలని అంటాడు. హాస్యనటుడు చార్లీ చాప్లిన్, బస్టర్ కీటన్, హెరాల్డ్ లాయిడ్ అంటే చాలా ఇష్టం.

Tags:    

Similar News