ప్రియాంక చోప్రా 'హెడ్స్ ఆఫ్ స్టేట్ 'Movie Review!

ప్రియాంక చోప్రా నటించిన ఈ సినిమా ఎలా ఉంది. చూడదగినదేనా? నవ్వించిందా? ఈ రివ్యూలో చూద్దాం..;

Update: 2025-07-04 02:25 GMT

డైరక్టర్ ఇలియా నైషుల్లెర్ పేరు వినగానే మీకు “Hardcore Henry” లాంటి పాయింట్-ఆఫ్-వ్యూలో తీసిన యాక్షన్ ఫిల్మ్ గుర్తొస్తుంది. అలాగే “Nobody” సినిమా (జైలర్ కు ప్రేరణ) చూసినవాళ్లకి ఆయన స్టైల్ అంటేనే ఓ హైపర్ ఎనర్జీ అని అర్దమవుతుంది. ఇప్పుడు అదే దర్శకుడు ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’తో తిరిగి వచ్చాడు – కానీ ఈసారి యాక్షన్ మాత్రమే కాదు, దానికి కామెడీని కూడా జోడించాడు. ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలో డైరక్ట్ గా లీజైంది. మన ఇండియన్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించిన ఈ సినిమా ఎలా ఉంది. చూడదగినదేనా? నవ్వించిందా?

స్టోరీ లైన్

అమెరికా అధ్యక్షుడు విల్ డెరింజర్ (జాన్ సీన్) – ఒకప్పటి యాక్షన్ సినిమాల సూపర్ స్టార్. కానీ రాజకీయాలను రంగస్థలంగా, ప్రజాస్వామ్యాన్ని ఒక వినోద కార్యక్రమంలా మార్చేసిన అతను, మెగా స్టార్ ఇమేజ్‌ ఆధారంగా అమెరికా ప్రెసిడెంట్ పీఠాన్ని అధిరోహిస్తాడు.మరో వైపు, బ్రిటన్ ప్రధాని సామ్ క్లార్క్ (ఇద్రిస్ ఎల్బా) – చాలా కష్టమైన రాజకీయ ప్రయాణం తర్వాత పదవిని ప్రధాని అయిన వ్యక్తి. విల్ డెరింజర్ స్టైల్ చిలిపి అయితే, క్లార్క్ స్టైల్ చాలా కఠినమైనది.

ఒక డిప్లొమాటిక్ ఈవెంట్ కోసం లండన్‌లో ఈ ఇద్దరూ కలుసుకుంటారు. అయితే విభిన్న నేపధ్యాల నుంచి వచ్చిన వారి మధ్య అభిప్రాయాల యుద్ధం జరుగుతుంది. అయినప్పటికీ, ప్రపంచ మీడియా ముందు తాము కలిసి ఉన్నామని చూపించాల్సిన అవసరం ఉండటంతో, ఇద్దరూ "మేము స్నేహితులం" అనే హంగామాను రీహార్సలేంటీ, ఓ స్క్రిప్ట్‌ లా ప్లాన్ చేస్తారు. అందుకోసం NATO సమ్మిట్ కోసం విమానంలో యూరప్‌ వరకూ ఇద్దరూ కలసి ప్రయాణం మొదలెడతారు.

కానీ ఈ హై-ప్రొఫైల్ ప్రయాణం ఒక్కొక్క నిమిషం గడుస్తూండగా ఒక ఊహించని కుట్రలోకి దిగుతుంది. ఇద్దరినీ ఒకేసారి చంపటానికి రష్యన్ ఆర్మ్స్ డీలర్ విక్టర్ గ్రాడోవ్ (ప్యాడీ కాన్సిడైన్) ప్లాన్ చేస్తాడు. విమానం గాల్లో ఉన్నప్పుడు ఒక దాడి మొదలవుతుంది. విమానం దెబ్బతింటుంది. అపాయం తలెత్తడంతో డెరింజర్, క్లార్క్ ఇద్దరూ ప్యారాచూట్ సాయంతో దూకి, యూరప్ లోని అత్యంత ప్రమాదకరమైన అడవుల్లో ఒకటైన బెలారూస్ ఫారెస్ట్‌లో పడతారు. అక్కడ నుంచే అసలు కథ మొదలవుతుంది.

ఇప్పుడు –

ఒకరు పబ్ ఫైట్స్‌లో గెలిచి వచ్చిన సూపర్ స్టార్ ప్రెసిడెంట్, మరొకరు పబ్లిక్ డిబేట్స్‌లో నిపుణుడు అయిన బ్రిటిష్ స్టేట్స్‌మన్ –

వీళ్లద్దరూ తమ దేశాధినేతలుగా కాదు, మామూలు మనుషులుగా జీవించి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వారి గమ్యం ఒక్కటే – బయటపడటం.

ఈ లోగా MI-6 ఇంటెలిజెన్స్ ఏజెంట్ నోయెల్ (ప్రియాంక చోప్రా) రంగంలోకి దిగుతుంది. ఆమె మిషన్: వీళ్లిద్దరిని ఎవరికీ కనిపించకుండా రక్షిత ప్రాంతానికి చేర్చటం. కానీ ఆమె పని అంత సులభం కాదు. ఎందుకంటే శత్రువు అన్ని వైపుల నుంచి దాడి చేస్తున్నాడు. ఇంతకీ నోయెల్ ఆ ఇద్దరు ప్రముఖులను రక్షించగలిగిందా..చివరకు ఏమైందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

ఐడియా పరంగా ఈ సినిమా కామెడీని, యాక్షన్‌ని, రాజకీయ సెటైర్‌ని కలపగలిగే కాన్సెప్ట్. కథలో డ్యూయల్ ప్రొటగనిస్ట్స్ డైనమిక్స్ ఉన్నాయి.

విల్ డెరింజర్ (జాన్ సీనా) మరియు సామ్ క్లార్క్ (ఇడ్రిస్ ఎల్బా) పాత్రలు ఒకరి శైలి మరోకరికి పూర్తిగా విరుద్ధంగా ఉండడం స్క్రిప్టులోని "బడ్డీ-డైనమిక్" కోసం బలమైన బేస్ ఇచ్చింది. ఇది సినిమాకు ఫన్ యాంగిల్ తేవడంలో చాలా ఉపయోగపడింది. అయితే సినిమాలో అసలైన సమస్య విలన్ విక్టర్ గ్రాడోవ్ పాత్ర బాగా వీక్ గా ఉండటం.

దాంతో చాలా పవర్ ఫుల్ సినిమాగా యాక్షన్ ఎపిసోడ్స్ తో మొదలైన సినిమాకు సరిపడ కాంప్లిక్ట్, థ్రెట్ లేదు. విలన్ ఆలోచనల వెనుక ఉన్న పర్సనల్ డ్రైవ్ లేదా రాజకీయ కోణం అన్నీ షాలోగా మిగిలిపోయాయి. అలాగే స్క్రిప్టు.. కామెడీకి వెళ్లిన చోట యాక్షన్, యాక్షన్‌కు వెళ్లిన చోట రొమాన్స్, రొమాన్స్‌కు వెళ్లిన చోట తిరిగి సైటైర్ అన్నట్లు ఒక టోన్‌ నుంచి మరొకదానికి షిఫ్ట్ అవుతూ మారిపోతూ ఉంటుంది. డైలాగ్స్ ఫన్నీగా బాగున్నాయి కానీ డెప్త్ లేదు.

Heads of State స్క్రిప్ట్ ఒక "concept-driven screenplay" – కానీ character-driven screenplay కాదు. అంటే, కాన్సెప్ట్ బలంగా ఉంటుంది కానీ పాత్రలు ఆ డెప్త్ లో నడవవు. ఇది హాలీవుడ్‌లో చాలాసార్లు జరిగే ఒక కామన్ లోపం.

టెక్నికల్ గా ...

కథ, స్క్రీన్‌ప్లే, టేకింగ్ అన్నీ బాగున్నాయి. కానీ స్క్రిప్టులో డెప్తే లేదు. చూసినంతసేపు బాగుంటుంది. ఆ తర్వాత ఏం చూసామంటే గుర్తుకు రాదు. , ఇక నటీనటుల అభినయం చాలా సహజంగా ఉంది. హాలీవుడ్ చిత్రం ...ఆ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేసింది. ఎక్కువ విజువల్ నెరేషన్‌ కే ప్రయారిటీ ఇచ్చారు. ఎడిటింగ్ ఫెరఫెక్ట్ .

ముఖ్యంగా ఈ సినిమా తెలుగు డబ్బింగ్‌ విషయానికి వస్తే – సాధారణంగా ఇలాంటి హ్యూమర్ బేస్డ్ యాక్షన్ చిత్రాల్లో డబ్బింగ్ డైలాగులు ఇబ్బంది పెడతాయి. అసహజంగా ఉంటాయి. కానీ ఈ సినిమాకు ఆ ఇబ్బంది లేదు.

ఫైనల్ థాట్

“Heads of State” పాప్‌కార్న్ ఫిల్మ్. వేడిగా, స్పైసీగా ఉంది కానీ కానీ ఏదో మిస్సింగ్ అనే ఫీల్ తెచ్చింది. ఎమోషన్ ఉంటే ఈ సినిమా Kingsman meets Rush Hour meets Air Force One అనిపించేదే. ఇలాంటి కథను పేపర్ మీద చూసినప్పుడు బాగుంటుంది. కానీ ఆన్‌స్క్రీన్‌కి తీసుకొచ్చినప్పుడు ఒక డిఫాల్ట్ స్పూఫ్ ఫార్ములాని అనుసరించింది అనిపిస్తుంది.

చూడచ్చా

యాక్షన్ కామెడీలు ఇష్టపడేవాళ్లు ఓ లుక్కేయవచ్చు

ఎక్కడుంది

అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో ఉంది .

Tags:    

Similar News