“ ఓజీ (OG)” క్రేజ్ : ఇవి బాక్సాఫీస్ రికార్డ్ లు కాదు – టికెట్ రేట్లు రికార్డులు!

పవర్ స్టార్ అభిమానుల కొత్త ఆలోచనలు!

Update: 2025-09-24 02:30 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “దే కాల్ హిమ్ ఓజీ (OG)” సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించకముందే, అభిమానుల మైండ్‌సెట్ దగ్గరే హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం టికెట్లు ఇప్పుడు సాధారణ కొనుగోలు కాదు – లడ్డూ లాగా వేలంపాట మాదిరిగా పోటిగా జరుగుతోంది. సినిమా టికెట్లు ఇప్పుడు కేవలం ఎంట్రీ పాస్ కాదు – భక్తి, అంకితభావం, రాజకీయ గుర్తింపు అన్నీ కలిసిన కల్చరల్ ఫెనామినాన్‌గా మారిపోయాయి.

ఈ సినిమాపై ఉన్న విపరీతమైన క్రేజ్‌ను తమ అభిమాన నేత రాజకీయ పార్టీ అయిన జనసేనకు మద్దతుగా మారుస్తోంది. సినిమా టిక్కెట్లను వేలం వేసి, వచ్చిన లక్షల రూపాయల మొత్తాన్ని పార్టీకి విరాళంగా అందించి అభిమానులు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. పవన్ కల్యాణ్ అభిమాన సంఘాలు 'ఓజీ' సినిమా ఫస్ట్ డే టిక్కెట్లను వేలం వేయడం ద్వారా భారీ మొత్తంలో నిధులను సమీకరిస్తున్నాయి.

ఇలా సేకరించిన విరాళాలను చెక్కుల రూపంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ నాగబాబుకు అందజేస్తున్నారు. వివిధ నగరాల్లోని అభిమానులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

ముఖ్యంగా, బెంగళూరుకు చెందిన అభిమాన సంఘం ఏకంగా రూ. 3.61 లక్షల భారీ మొత్తాన్ని విరాళంగా అందించింది. అలాగే చెన్నైలోని పవన్ కల్యాణ్ అభిమానులు రూ. 1.72 లక్షలు, చిత్తూరు జిల్లా అభిమానులు రూ. 1 లక్ష చొప్పున చెక్కులను పార్టీకి సమర్పించారు. ఈ మొత్తాలను నాగబాబు స్వీకరించి, అభిమానుల నిబద్ధతను ప్రశంసించారు.

మరో ప్రక్క యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్‌లో జరిగిన బెనిఫిట్ షో వేలంపాటలో, ఒక్క టికెట్ ఏకంగా ₹1,29,999కు అమ్ముడైంది. హార్ట్ కోర్ ఫ్యాన్ ఆముదాల పరమేష్ ఈ టికెట్‌ను దక్కించుకుని, ఆ మొత్తాన్ని జనసేన పార్టీ కార్యాలయానికి విరాళంగా ఇస్తానని ప్రకటించారు.

“పవన్ గారి సినిమా కోసం ఎంతైనా ఖర్చు చేస్తాం, ఈ డబ్బు పార్టీకి ఇవ్వడం మా ఆరాధన” అని ఆయన చేసిన వ్యాఖ్య – అభిమానుల్లో ఉన్న భక్తి స్థాయి క్రేజ్‌ను బలంగా ప్రతిబింబిస్తోంది.

ఫ్యాన్ డెవోషన్: సినిమా టికెట్ = భక్తి కానుక

అయితే ఇది పవన్ సినిమాలకు కొత్తేమీ కాదు. “ఖుషీ” కాలం నుండి పవన్ అభిమానులు టికెట్ల కోసం క్రేజ్ చూపుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ క్రేజ్ పతాక స్థాయికి చేరింది. ఒక టికెట్ అంటే కేవలం ఎంట్రీ పాస్ కాదు – అది “మన లీడర్‌కి మనం చూపించే గౌరవ కానుక” గా మారిపోయింది.

అందుకే ఒకరు లక్ష రూపాయలు పెట్టి టికెట్ కొంటే, మరొకరు దాన్ని ఇంకాస్త రేటు పెంచి మూడున్నర లక్షలు పెట్టటానికి ప్రయత్నిస్తున్నారు. దాన్నో ఆరాధనగా భావిస్తున్నారు.

చిత్తూరు టికెట్: లక్ష రూపాయలు – అభివృద్ధి కోసం

అటు శనివారం చిత్తూరు నియోజకవర్గంలో కూడా మొదటి టికెట్ వేలంపాటలో ఓ అభిమాని లక్ష రూపాయలు వెచ్చించాడు. ఆ డబ్బును గ్రామాల అభివృద్ధి పనులకు ఉపయోగపడేలా జనసేన పార్టీ ఆఫీస్‌కు పంపుతామని థియేటర్ యాజమాన్యం ప్రకటించింది.

ఈ మోడల్‌ను నెటిజన్లు “సినిమా క్రేజ్‌ని సమాజ ప్రయోజనానికి మలచిన మంచి ఆలోచన” అంటూ ప్రశంసిస్తున్నారు. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో “ఇదే పవన్ ఎఫెక్ట్” అంటూ హోరెత్తిస్తున్నారు.

తమ అభిమాన నటుడి సినిమా విడుదల వేడుకను కేవలం సంబరంగానే కాకుండా, ఆయన రాజకీయ ప్రస్థానానికి అండగా నిలిచే ఒక అవకాశంగా అభిమానులు భావిస్తున్నారు. సినిమా రంగంలో పవన్ కల్యాణ్‌కు ఉన్న అశేష ప్రజాదరణ, ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఏ స్థాయిలో ఉపయోగపడుతుందో చెప్పడానికి ఈ సంఘటనే ఒక నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఫ్యాన్ సైకాలజీ: టికెట్ = కానుక

పవన్ సినిమాలు ఎప్పుడూ సినిమా లిమిట్‌కి మించి ఉంటాయి. టికెట్ అనేది అభిమానులకు కేవలం పాస్ కాదు – తమ లీడర్‌కి ఇచ్చే కానుక గా భావిస్తున్నారు . టికెట్ రేటు ఎక్కువగా ఉంటే, “మా అంకితభావం కూడా అంతే ఎక్కువ” అనే ఆనందం కలుగుతుంది.

ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు – ఈ టికెట్ మానియాతో మొదటి రోజే భారీ రాబడి చూస్తారు. అభిమానులకు, ఒక టికెట్ కొనడం అంటే “నేను పవన్ కోసం చేశాను” అనే గర్వకారణం. సినిమా రీలీజ్ కంటే ముందే, ఓజీ లాంటి సినిమాకి సామాజిక-రాజకీయ శక్తి పెరుగుతుంది. అయితే సినిమా అనుభవం అందరికీ సమానంగా కాకుండా, “ఎవరు ఎంత ఇస్తారనే పోటీ”గా మారిపోతుంది. ఈ సైకాలజీ వలన టిక్కెట్ వేలంపాటలు ..లడ్డూ వేలం పాటలు మాదిరిగా మారిపోతున్నాయనే విమర్శలకు తావిస్తున్నాయి.

పవన్ క్రేజ్ = పండుగ + రాజకీయ సింబల్

జగన్ కాలంలో టికెట్ రేట్ల నియంత్రణ కఠినంగా ఉండగా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అధికారంలో ఉండటం వలన “ఓజీ”కి అధిక రేట్లు, ప్రత్యేక అనుమతులు రావడం సహజంగా చెప్తున్నారు. అందువల్ల ఈ టికెట్ వేలంపాటలు కేవలం ఫ్యాన్ క్రేజ్ కాదు – రాజకీయ శక్తి ప్రదర్శన కూడా అని ఓ వర్గం మీడియా అంటోంది.

ఫైనల్ గా..

ఒక సినిమా టికెట్ ₹1,29,999కి అమ్ముడవడం సాధారణ మార్కెట్ లాజిక్ కాదు – అది ఫ్యాన్ డెవోషన్, రాజకీయ చిహ్నం, బాక్సాఫీస్ ఆర్థిక శక్తి అన్నీ కలిసిన ఫెనామినాన్. “ఓజీ”తో పవన్ అభిమానులు చూపుతున్న ఆరాధన – భక్తి అనిపించేంత పాజిటివ్ ఫోర్స్ కావొచ్చు,

సుజీత్ దర్శకత్వం వహించి ఈ యాక్షన్ క్రైమ్ డ్రామాలో పవన్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించబోతున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా, ఇమ్రాన్ హష్మీ విలన్‌గా, ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి వంటి బలమైన నటీనటులు నటిస్తున్నారు.

తమన్ సంగీతం అందించిన ఈ సినిమా సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే బెనిఫిట్ షోలు, ఫ్యాన్స్ మానియా – అన్నీ కలిపి “ఓజీ”ని కేవలం సినిమా కాకుండా ఒక ఉద్యమంగా మార్చేశాయి.

Tags:    

Similar News