నవంబర్ భాక్సాఫీస్ : రివ్యూలు ఫుల్- కలెక్షన్స్ నిల్

పొగిడిన సినిమాలే ఎందుకు ఫెయిల్ అయ్యాయి?

By :  Akhilaja
Update: 2025-12-03 02:30 GMT

సినిమా రిలీజ్ అయ్యే రోజే టాలీవుడ్ లో అయినా బాలీవుడ్ లో అయినా ఎక్కడైనా నర్వస్‌నెస్ మొదలవుతుంది. ఫస్ట్ షో పూర్తయ్యే సరికి నిర్మాతలు, దర్శకులు, రైటర్లు, హీరోలు… అందరూ ఒకే పని చేస్తారు— ఫోన్లు చేతిలో పట్టుకుని రివ్యూల కోసం వెబ్‌సైట్లను, సోషల్ మీడియాలోని ఫీడ్స్‌ను రిఫ్రెష్ చేస్తూ కూర్చోవడం.

ఎవరి సినిమా అయినా సరే, చిన్నదైనా పెద్దదైనా,

“క్రిటిక్స్ ఏమంటారు?”,

“రేటింగ్ ఎన్ని స్టార్‌లు?”,

“ప్రేమించేనా… లేక పీక్కుతింటారా?”

అన్న ఆలోచనే విడుదల రోజు ప్రశాంతంగా ఉండనివ్వదు.

ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి ఒక నమ్మకం ఉంది—

“రివ్యూలు బాగా వస్తే సినిమా హిట్ అవుతుంది… పాజిటివ్ టాక్ అంటే కలెక్షన్లు పక్కా.” అంటే రివ్యూ సైట్‌లో రేటింగ్ 3.5 అంటే, నిర్మాతల గుండెల్లో లాభాల లెక్కలు మొదలవుతాయి. 4 స్టార్‌లు అంటే… “ సూపర్ హిట్ వచ్చేసింది, లాంగ్ రన్ పక్కా” అని నమ్మకం పెరుగుతుంది.

కాని అసలు నిజం ఏమిటి?

క్రిటిక్స్ ప్రేమించిన సినిమాలనే ఆడియెన్స్ కూడా ప్రేమిస్తారా? ఇదే ప్రశ్నకు నిజమైన, క్లియర్, అన్‌కట్ సమాధానం ఇచ్చిన నెల —

2025 నవంబర్. ఎందుకంటే ఈ నెలలో రివ్యూలు ఆకాశానికెత్తిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఖాళీ సీట్లను చూసాయి… మరోవైపు పాజిటివ్ టాక్ వచ్చిన కొన్ని సినిమాలు కూడా కలెక్షన్లలో ఆశించిన పెరుగుదల కనపడలేదు.

నవంబర్ బాక్సాఫీస్ ఒకటే ప్రూవ్ చేసింది— “రేటింగ్ హిట్‌కు గ్యారంటి కాదు… రివ్యూలు బాగున్నా, మార్కెట్ వైపు మాత్రం పబ్లిక్ మైండ్‌సెట్ డిసైడ్ చేస్తుంది.”

ఇదే కోణం నుంచి, ఈ నవంబర్ ఎలా సాగింది?

ఏ సినిమాలకు రివ్యూలు బాగున్నాయి?

ఏవి బాక్సాఫీస్‌ను అట్రాక్ట్ చేయలేదు?

“రివ్యూ vs రిజల్ట్” ఫైట్‌లో ఎవరు గెలిచారు?

ది గర్ల్‌ఫ్రెండ్

రష్మిక మందన్నా – రాహుల్ రవీంద్రన్ కాంబో, సోషల్ మీడియాలో మంచి డిబేట్ తెచ్చింది. రివ్యూస్ స్ప్లిట్ అయినా, అర్బన్ సర్క్యూట్‌లో డీసెంట్ స్టార్ట్. కానీ మాస్ బెల్ట్స్‌లో పిక్ అప్ కాలేకపోయింది.

జటాధర (సుధీర్ బాబు – సోనాక్షి సిన్హా)

కాన్సెప్ట్ బాగున్నా, ఓపెనింగ్స్ మాత్రం బలహీనంగా. కంటెంట్ కనెక్ట్ కాకపోవడంతో వీక్ ఎండ్‌కే స్లోడౌన్.

Hawk Predator: Badlands

ఇమ్రాన్ హష్మీ + యామీ గౌతమ్ ఉన్నప్పటికీ, హాలీవుడ్ స్టైల్ లో కథనం భారతీయ మార్కెట్‌కు పని చేయలేదు. BOలో నోయిజ్ తక్కువ – ఫుట్‌ఫాల్స్ ఇంకా తక్కువ.

నవంబర్ 14 రిలీజ్‌ల రష్ – ఒక ఎక్స్‌పెరిమెంట్, ఒక క్రౌడ్-ప్లీజర్

కాంతా (దుల్కర్ – రానా – భాగ్యశ్రీ) డాక్యుమెంటరీ ఫీలింగ్, స్లో నేరేషన్… క్లాస్ ఆడియెన్స్‌కే లిమిట్‌డ్. ట్రేడ్ టాక్: “ఎఫర్ట్ ఉంది… కమర్షియల్ హిట్ కాదు.”

సంతాన ప్రాప్తిరస్తు (బిందూ చంద్రమౌళి – చాందినీ – తరుణ్ భాస్కర్)

యూత్ అటెన్షన్ తెచ్చినా, కంటెంట్ మిక్స్‌డ్‌గా ఉండడంతో BOలో లాంగ్ రన్‌కు వీలుకాలేదు. వర్డ్-ఆఫ్-మౌత్: “కష్టం”

నవంబర్ 21 – హిందీ మార్కెట్ హోప్ & ఇంగ్లీష్ యాక్షన్

De De Pyaar De 2 (అజయ్ దేవగణ్ – మాధవన్ – రకుల్) హిందీ బెల్ట్స్‌లో ఓపెనింగ్స్ ఓకే. సౌత్‌లో మాత్రం ఆకర్షణ తక్కువ.

టాలీవుడ్ బాక్సాఫీస్‌లో కలెక్ట్ చేయడానికి స్టార్ పుల్ సరిపోలేదు.

120 బహదూర్: Wicked 2 ఇంగ్లీష్ మార్కెట్‌కు లిమిట్‌డ్ రిలీజ్. మల్టీప్లెక్స్‌లలో మాత్రమే పికప్. గమనించదగ్గ కలెక్షన్లు రావడం లేదు.

నవంబర్ 28 – టాలీవుడ్ హోప్ & హాలీవుడ్ బిగ్ హైప్

ఆంధ్రా కింగ్ తాలూకా (రామ్ పోతినేని – భాగ్యశ్రీ) రామ్ స్టార్డమ్‌కు తగ్గ ఓపెనింగ్ రాలేదు. కంటెంట్ మిక్స్‌డ్‌గా ఉండటంతో వర్డ్-ఆఫ్-మౌత్ స్ట్రాంగ్ కాలేదు. ట్రేడ్ ఫలితం: “అవుట్‌పుట్ ఓకే… బాక్సాఫీస్ ప్లాఫ్.”

తేరే ఇష్ మేన్ (ధనుష్ – కృతి సనన్)

కంటెంట్ ఎమోషనల్‌గా బాగున్నా, టాక్ యావరేజ్ గా ఉండటంతో పెద్దగా నడవలేదు. లాభాలు లేవు.

Zootopia 2

హాలీవుడ్ నుంచి వచ్చిన ఈ యానిమేషన్ పెద్ద బజ్‌తో వచ్చింది. రివ్యూలు మామూలుగా లేవు. కానీ డిస్నీ ఇండియా మార్కెటింగ్ తక్కువగా ఉండటంతో ఇండియా కలెక్షన్లు మోడరేట్‌.ఫ్యామిలీ ఆడియెన్స్‌తో వీకెండ్స్‌లో మాత్రమే స్పైక్.

కంక్లూజన్ ఏమిటంటే… “రివ్యూస్ అదిరిపోయాయి… కలెక్షన్లు మాత్రం కనపడలేదు!”

నవంబర్ మొత్తం రిలీజ్‌లు చాలా, హైప్ బాగుంది, క్రిటిక్స్ కొన్ని సినిమాలను చేతులెత్తి ఓ రేంజిలో పొగిడారు… కానీ ఒక పెద్ద హిట్? ఒక షాక్ సక్సెస్? జీరో రిజల్ట్. ఉన్నంతలో ది గర్ల్ ప్రెండ్, రాజు వెడ్స్ రాంబాయి వంటి కొన్ని మాత్రమే డీసెంట్ రన్ ఇచ్చాయి. మిగతావన్నీ మిక్స్‌డ్ టాక్ నుంచి ఫ్లాప్ వరకూ.

ప్రస్తుతం థియేటర్స్ “డిసెంబర్ & సంక్రాంతి హీరోలు వచ్చే వరకు… వెయిటింగ్ లోనే ఉంటాయి.”

Tags:    

Similar News