“కాంతా” సినిమాపై హైకోర్టులో సంచలన పిటిషన్!
దుల్కర్‌కి నోటీసులు — సమస్యలో రిలీజ్?!
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) తాజాగా నటిస్తున్న చిత్రం కాంత (Kaantha). సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరో మూడు రోజుల్లో రిలీజ్ కాబోతూండగా..ఈ చిత్రం రిలీజ్ ని ఆపాలంటూ ఓ కేసు నమోదైంది.
“కాంతా (Kaantha)” సినిమా రిలీజ్‌ను అడ్డుకోవాలని మద్రాస్ హైకోర్టులో లెజెండరీ నటుడు, సంగీత విద్వాంసుడు ఎం.కె. త్యాగరాజ భాగవతార్ (M.K. Thyagaraja Bhagavathar) కుటుంబం పిటిషన్ దాఖలు చేసింది.
భాగవతార్ మనవడు బి. త్యాగరాజన్ ఈ పిటిషన్‌లో పేర్కొన్న వివరాలు సంచలనం సృష్టించాయి. ఆయన ఆరోపణ ప్రకారం — “కాంతా సినిమాలో మా తాతను చెడు నైజం గల వ్యక్తిగా, నీతి లేని మనిషిగా చూపిస్తున్నారు. ఇది పూర్తిగా అవమానకరం, అసత్యం. మా కుటుంబాన్ని దూషించే ప్రయత్నం ఇది.”
భాగవతార్ గురించి ఆయన ఇలా గుర్తు చేశారు — “ఆయన కేవలం తొలి సూపర్ స్టార్ మాత్రమే కాదు, భక్తి, వినయం, దానశీలతతో పేరు గాంచిన గాయకుడు. ఆయనపై ఒకప్పుడు తప్పుడు క్రిమినల్ కేసు వేసినా, చివరికి నిర్దోషిగా నిరూపితమై గౌరవంగా జీవించారు. 1959లో మరణించే వరకు ఆయన పేరు చెడిపోలేదు.”
పిటిషన్‌లో మరో ముఖ్యమైన పాయింట్ — ఈ సినిమా తీయడానికి ముందు భాగవతార్ కుటుంబం నుండి ఎటువంటి అనుమతి తీసుకోలేదని, పేరు మార్చినా వ్యక్తి గుర్తుపడేలా చూపిస్తే అది డిఫమేషన్‌గానే పరిగణించబడుతుందని వాదించారు.
దీనిపై మద్రాస్ హైకోర్టు దుల్కర్ సల్మాన్ మరియు సినిమా టీమ్‌కి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 18కి వాయిదా వేసింది. ఇక ఈ పరిణామంతో నవంబర్ 14న ప్లాన్ చేసిన “కాంతా” రిలీజ్‌పై పెద్ద అనిశ్చితి నెలకొంది. కోర్టు తీర్పు ఆధారంగా మాత్రమే సినిమా విడుదల జరగనుంది. ఇకపోతే, “కాంతా” ట్రైలర్‌పై పెద్దగా బజ్ లేకపోవడంతో, బుకింగ్స్ కూడా స్లోగా సాగుతున్నాయి. పాత తమిళ సినిమా నేపథ్యంతో కూడిన ఈ సినిమా, తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో అనేది కూడా సందేహమే.
ఎవరీ భాగవతార్?
లెజండరీ తమిళ నటుడు ఎంకే త్యాగరాజ భాగవతార్ గురించి ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. అప్పట్లో ఆయనే మొదటి ఇండియన్ సూపర్ స్టార్. 14 సినిమాలు చేస్తే 10 సినిమాలు సూపర్ డూపర్ హిట్. ముఖ్యంగా హరిదాసు అనే సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఒక డైరెక్టర్ తో జరిగిన వివాదం.. చిలికి చిలికి గాలివానగా మారి పగ తీర్చుకొనేవరకు వెళ్లింది.
దాంతో సదురు డైరెక్టర్.. ఒక జర్నలిస్ట్ హత్యను ఎంకేటీ మీద మోపి రెండేళ్ళు జైలుకు పంపాడు. జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన మరోసారి సినిమాలలో నటించడానికి ప్రయత్నించాడు కానీ, విఫలమయ్యాడు. లగ్జరీ లైఫ్ చూసిన ఎంకేటీ అనారోగ్యంతో 49 ఏళ్లకే మరణించాడు. ఇక ఆయన బయోపిక్ నే కాంత సినిమాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఎంకేటీ గా దుల్కర్ నటిస్తుండగా.. డైరెక్టర్ గా సముద్రఖని నటిస్తున్నాడని అంటున్నారు.
మొత్తానికి — దుల్కర్ సల్మాన్ సినిమా రిలీజ్‌కు ముందే కోర్ట్ డ్రామా ప్రారంభమైంది! ఇక “కాంతా” థియేటర్స్‌కి వస్తుందా… లేక కోర్టు తాళం వేసేస్తుందా? రాజీపడి ,సెటిల్మెంట్ చేసుకుంటారా అన్నది చూడాలి!