నైజాం ఏరియాలో Pushpa 2 vs OG – ఎవరి వ్యూహం గెలుస్తుంది?

తెలుగు సినిమా బిజినెస్‌లో నిజాం ఏరియా అనేది కేవలం ఒక టెర్రిటరీ మాత్రమే కాదు ...

Update: 2025-09-21 02:30 GMT

తెలుగు సినిమా బిజినెస్‌లో నిజాం ఏరియా అనేది కేవలం ఒక టెర్రిటరీ మాత్రమే కాదు – ఇది మొత్తం టాలీవుడ్ ట్రేడ్ డైనమిక్స్‌ను డిఫైన్ చేసే మార్కెట్. అత్యధిక రెవెన్యూ కలిగిన ఏరియా: ఏ సినిమా హిట్, బ్లాక్‌బస్టర్, ఇండస్ట్రీ హిట్ అని లెక్కించేటప్పుడు మొదటగా చూసేది నిజాం కలెక్షన్. ఒక సినిమా యొక్క డే 1 షేర్‌లో 35%–40% వరకు నిజాం నుంచే వస్తుంది.

ప్రీమియం ప్రైసింగ్, టికెట్ హైక్ పాలసీస్, ప్రీమియర్ కల్చర్ అన్నీ ముందుగా నిజాంలోనే ఎక్స్‌పెరిమెంట్ అవుతాయి. హైదరాబాదు సిటీ మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్స్ కలిపి డిమాండ్‌ను పెంచుతాయి. ట్రెండ్ సెట్టింగ్ మార్కెట్: నిజాంలో ఒక సినిమా వర్కౌట్ అయితే – AP ఇతర ఏరియాల్లో, ఓవర్సీస్ మార్కెట్లో కూడా పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతుంది.

ఇన్వెస్టర్స్ ఫోకస్: డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ నిజాం రిటర్న్స్‌నే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే, ROI (Return on Investment) మొదటగా ఈ ఏరియా నుంచే రికవర్ అవుతుంది. అందుకే ప్రతి పెద్ద సినిమా రిలీజ్‌కి ముందు “నిజాం ఏరియాలో టికెట్ ధరలు ఎంత?”, “ఎన్ని షోలు వస్తున్నాయి?”, “డే 1 ప్రీమియర్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారు?” అనే ప్రశ్నలు ఇండస్ట్రీ మొత్తానికి కీలకంగా మారుతాయి.

ఈ క్రమంలో తెలంగాణ బాక్సాఫీస్, ముఖ్యంగా నైజాంలో , ఇప్పుడు టికెట్ ప్రైసింగ్ ఎకానమీలో పెద్ద చర్చకు వేదిక అవుతోంది. దీనికి కారణం – అల్లుఅర్జున్ ‘పుష్ప 2: ది రూల్’, పవన్ కళ్యాణ్ ‘OG’. ఈ రెండు సినిమాల టికెట్ ధరల్లో ఉన్న వ్యత్యాసం, వాటి ఓపెనింగ్ రికార్డుల మీద నేరుగా ప్రభావం చూపబోతోంది.

అల్లుఅర్జున్ ‘పుష్ప 2: ది రూల్’ నిజాం ఏరియాలో ఫోర్ డిజిట్ అఫీషియల్ టికెట్ రేట్లు దక్కించుకున్న మూవీగా రికార్డులు సృష్టించింది. భారీ ప్రీమియర్స్, షో కౌంట్స్‌తో కలిపి ఆ సినిమా RRR రికార్డుని బ్రేక్ చేసి, 25 కోట్ల షేర్ (జీఎస్టీతో కలిపితే 29.5 కోట్లు) వసూలు చేసి, ఆల్ టైమ్ నెంబర్ 1 ఓపెనర్ అయింది. ఇక పవన్ కళ్యాణ్ ‘OG’ కోసం కూడా అంతే హైప్ ఉంది. కానీ టికెట్ ధరల విషయంలో మాత్రం ‘పుష్ప 2’తో పోలిస్తే గణనీయమైన తేడా కనిపిస్తోంది. అదే రికార్డ్ బద్దలు కొట్టడంలో ప్రధాన అడ్డంకిగా మారే అవకాశం ఉంది.

1. పుష్ప 2 – ప్రైసింగ్ స్ట్రాటజీ & ఫలితం

ప్రీమియర్స్ ప్రైస్: మల్టీప్లెక్స్ – ₹1239 | సింగిల్ స్క్రీన్ – ₹1121

వీకెండ్ ప్రైస్: మల్టీప్లెక్స్ – ₹531 | సింగిల్ స్క్రీన్ – ₹354

ఈ మోడల్ అంతర్జాతీయ మార్కెట్‌లో కనిపించే ప్రీమియం ప్రైసింగ్ (Premium Pricing) స్ట్రాటజీని పోలి ఉంది.

ఫలితం?

రికార్డ్ డే 1 షేర్ – ₹25 Cr (జీఎస్టీతో కలిపి ₹29.5 Cr)

RRR ను క్రాస్ చేసి ఆల్ టైమ్ నెం.1 ఓపెనర్

ఇక్కడ ప్రైసింగ్‌తో పాటు మరో ముఖ్యమైన బిజినెస్ పాయింట్ – రిలీజ్ టైమింగ్. ఎలాంటి పెద్ద సినిమాలు లేని డ్రై పీరియడ్ను ఉపయోగించుకోవడం ద్వారా, పుష్ప 2 మాక్సిమమ్ స్క్రీన్ యాక్సెస్ పొందింది.

2. OG – ప్రైసింగ్ & మార్కెట్ రియాలిటీ

ప్రీమియర్స్ ప్రైస్: మల్టీప్లెక్స్ + సింగిల్ స్క్రీన్ – ₹800

వీకెండ్ ప్రైస్: మల్టీప్లెక్స్ – ₹445 | సింగిల్ స్క్రీన్ – ₹277

ఇది మిడ్-రేంజ్ ప్రైసింగ్ (Mid-Tier Strategy). ఇక్కడ అడ్వాంటేజ్ – ఎక్కువ ఫుట్‌ఫాల్ (audience reach) రావచ్చు. కానీ డిస్అడ్వాంటేజ్ – రికార్డ్ క్రియేషన్‌కి అవసరమైన గ్రాస్ తగ్గిపోవడం.

అదనంగా, OGకి ఒక మార్కెట్ లిమిటేషన్ ఉంది:

రిలీజ్ సమయానికి మిరాయి, కిష్కిందపురి, లిటిల్ హార్ట్స్ వంటి సినిమాలు మంచి కలెక్షన్స్ ఇస్తున్నాయి. దీని వలన స్క్రీన్ షేరింగ్ తప్పనిసరి అవుతోంది.

4. మార్కెట్ ఇన్‌సైట్స్

Pushpa 2 ఉపయోగించిన హై-టికెట్ ప్రైసింగ్ + డీ-కాంపిటీటివ్ మార్కెట్ కలిపి ఒక బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్ కేస్ స్టడీ.

OG మాత్రం మాస్ ఫుట్‌ఫాల్ మోడల్కి దగ్గరగా ఉంది. ఇది ఎక్కువ మంది థియేటర్‌కి రప్పించవచ్చు, కానీ రివెన్యూ డెన్సిటీ (Revenue per Screen) తక్కువగా ఉంటుంది.

ఫైనల్ గా...

ఇలా అయితే పుష్ప 2 రికార్డు బ్రేక్ చేయడం OGకి చాలా కష్టం. అయితే OG, పవన్ కళ్యాణ్ బ్రాండ్ పవర్ + మాస్ ప్రీమియర్స్తో టాప్ 3 ఓపెనింగ్స్‌లో స్థానం సంపాదించగలదు.

వ్యాపార పరంగా, ఇది రెండు వేర్వేరు ప్రైసింగ్ మోడల్స్ టెస్ట్ కేస్‌లు.

పుష్ప 2 → ప్రీమియమ్ ప్రైసింగ్ మోడల్

OG → మాస్ -ఎఫెర్డబుల్ మోడల్

కాబట్టి OG, పుష్ప 2 రికార్డులకు దగ్గర కావాలంటే మాస్ ప్రీమియర్స్ & స్పెషల్ షోలు తప్పనిసరి.

పవన్ కళ్యాణ్ ‘OG’ నిజంగా పుష్ప 2 ఓపెనింగ్ రికార్డుని బ్రేక్ చేస్తుందా? లేక టికెట్ ధరల తేడా OG కలను అడ్డుకుంటుందా? అన్నది ఇప్పుడు ట్రేడ్ లో పెద్ద క్యూరియాసిటీగా, డిస్కషన్ పాయింట్ గా మారింది.

Tags:    

Similar News