రష్మిక Vs శ్రీలీల : దీపావళికి ఈ ఇద్దరి మధ్యే పోటీ

ఈ దీపావళి 2025 స్పెషాలిటీ ఏమిటంటే రెండు పెద్ద సినిమాలు మధ్య హోరాహోరీ పోరు జరగనుంది.;

Update: 2025-02-17 12:04 GMT

సంక్రాంతి మనకు ఎలాగో దీపావళి బాలీవుడ్ బాక్సాఫీస్ కు అలాగ. అయితే ఇప్పుడు ఈ దీపావళి 2025 స్పెషాలిటీ ఏమిటంటే రెండు పెద్ద సినిమాలు మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. అయితే అందులో విశేషం ఏమిటంటే...ఆ రెండు సినిమాల్లో లీడ్ రోల్స్ చేస్తోంది మన స్టార్ హీరోయిన్స్ . శ్రీ లీల, రష్మిక చేస్తున్న రెండు సినిమాలు ఒకేసారి రాబోతున్నాయి. అవి కూడా డిఫరెంట్ జానర్స్ తో . ఒక వైపు, హారర్-కామెడీ అయిన 'థమా' ఉంది. ఇది మాడాక్ యూనివర్స్ బ్యానర్‌పై విడుదలవుతోంది. ఇందులో ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న నటించారు. ఇక శ్రీ లీల ఆషికి 3 లో చేస్తోంది. ఈ ఇద్దరూ ఒకేసారి బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుండటంతో అందరి దృష్టీ వీరిపై పడింది.

రష్మిక రచ్చ

ప్రస్తుతం రష్మిక కి గోల్డెన్ పీరియడ్‌ నడుస్తోంది. ఆమె వరస హిట్స్ యానిమల్, పుష్ప 2, చావా మూడు సూపర్ హిట్స్ కావడంతో ఆమె హవా మామూలుగా లేదు. రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ పరిశ్రమలోని స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా ఎదిగిపోయారు. అలాగే ఇప్పుడు హారర్-కామెడీ జానర్ కు బాగా డిమాండ్ ఉంది. మరీ ముఖ్యంగా మాడాక్ బ్యానర్‌లో పనిచేశారు కాబట్టి 'థమా' తప్పనిసరిగా చూడవలసిన చిత్రం గా అందరూ ఎదురుచూస్తున్నారు. ఖచ్చితంగా హిట్ కొడతామనే నమ్మకంగా ఉంది టీమ్.

శ్రీ లీల సినిమా విషయానికి వస్తే...

కార్తీక్ ఆర్యన్, శ్రీ లీల నటించిన మరో సినిమా రిలీజవుతోంది, ఇది ఓ ప్రేమ కథ. అయితే అందులో ప్రత్యేకత ఏమిటి అంటారు. అది ఆషికీ 3. ఆషికీ సినిమాలకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ ప్రాంఛైజీ లో వచ్చే సినిమాలు శ్రావ్యమైన పాటలు , వెన్ను జలదరించే కథలు తో నిండి ఉంటాయి అని రెండు సార్లు ప్రూవ్ చేసాయి. దేశవ్యాప్తంగా ఆషికీ కి ఫ్యాన్స్ ఉన్నారు. దాంతో ఫ్రాంచైజ్ సిరీస్ పై చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.

కార్తీక్ కోసం ఈ సినిమా చూసే వాళ్ళు ఉన్నారు. , ఈ చిత్రం అతని రీసెంట్ వరుస కామెడీలకు కొనసాగింపు కాకపోయినా క్రేజ్ కు సీక్వెల్ లాంటిది.ఈ సినిమాతో కార్తీక్ ఆర్యన్ ప్రేమ, శృంగార జానర్ లోకి అడుగు పెడుతున్నారు. దానికి తోడు దర్శకుడు అనురాగ్ బసు కావడం మరో ప్లస్. ఇక నిర్మాత భూషణ్ కుమార్ ఆధ్వర్యంలో బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్న శ్రీ లీల కి ఈ సినిమాతో తన ఉనికిని చాటుకునే సువర్ణావకాశం ఉంది.

సౌత్ లోనూ డిమాండే

ఈ దీపావళి సినిమాల కోసం ఫ్యాన్స్ రెడీ అవుతున్న సమయంలో ప్రమోషన్స్ హోరు మొదలెట్టేసారు. దాంతో ఇప్పటి నుంచే నార్త్ లో ఉత్సాహం నెలకొంది. ఇద్దరు మన హీరోయిన్స్ కాబట్టి ఖచ్చితంగా సౌత్ లో మంచి మార్కెట్ అవుతాయి. అలాగే రెండు చిత్రాలు ఒక స్పెషల్ సినిమా టెక్ ఎక్స్పీరియన్స్ ని అందించబోతున్నాయి.

శ్రీ లీల..

అతి తక్కువ కాలంలో తెలుగులో పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్లలో ఒక్కరు. రీసెంట్ గా అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'పుష్ప 2' సినిమా లోని 'కిస్సిక్' సాంగ్ పై మాస్ స్టెప్పులు వేసి.. నేషనల్ వైడ్ గా ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఈ స్పెషల్ సాంగ్ తో ఈ అమ్మడు కెరీర్ మొత్తం టర్న్ అయిపోయింది. దాంతో బాలీవుడ్ ఎంట్రీ పై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి.

ఈ నేపథ్యంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హవాకు శ్రీ లీల బ్రేకులు వేయబోతున్నదా? అనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం శ్రీ లీల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్', హీరో నితిన్ 'రాబిన్‌హుడ్', మాస్ రాజా రవితేజ 'మాస్ జాతర' చిత్రాల్లో నటిస్తోంది. ఇక బాలీవుడ్ లో మొదటి సినిమా మొదలు కాకుండానే, రెండో సినిమాకు ఓకే చెప్పడంతో శ్రీలీల టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

రష్మిక విషయానికి వస్తే...

తెలుగులో కూడా ఛలో, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ లాంటి విజయాలతో లక్కీ గాళ్ అయిపోయారు. బాలీవుడ్‌లోనూ అంతే స్పీడుగా దూసుకుపోతోంది ఆమె. గుడ్ బై అంటూ ఫ్లాప్ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టినా.. యానిమల్ తర్వాత రష్మిక రేంజ్ మారిపోయింది. నేషనల్ క్రష్ అయిపోయారు. తాజాగా ఛావా తో అమ్మడి స్థాయి మరింత పెరిగింది. 'పుష్ప 2'లో శ్రీవల్లి గా.. 'యానిమల్' మూవీలో గీతాంజలి గా మంచి అభినయం కనబరిచింది. ఛత్రపతి శివాజీ కుమారుడు, మరాఠా యోధుడు శంభాజీ మహరాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన 'ఛావా' చిత్రంలో ఆయన భార్య ఏసుబాయి పాత్రలో రష్మిక ఆకట్టుకుంది.

ఎవరిది గెలుపు

ఏదైమైనా ఈ ఇద్దరు హీరోయిన్స్ కోసం దీపావళిని మనవాళ్లు ఆదరించాలి. ఇప్పుడు ఒకటే ప్రశ్న. ఏ రెండు సినిమాల్లో జనాలకు నచ్చి హిట్ అవుతుంది. రష్మికకు ఈ సినిమా హిట్ అయినా కాకపోయినా నష్టమేమీ లేదు. బాలీవుడ్ లో ఆమె హవాకు లోటు ఉండదు. అయితే శ్రీ లీల కు బాలీవుడ్ ఎంట్రీ సినిమా హిట్టైందా ..ఇక అక్కడ వరుస ఆఫర్స్ వర్షం కురుస్తుందనటంలో సందేహం లేదు.

Tags:    

Similar News