అనుకున్నదే జరిగింది, విజయ్, రష్మిక పెళ్లి కుదిరింది!!
హైదరాబాద్ లో ఘనంగా జరిగిన నిశ్చితార్థం
By : The Federal
Update: 2025-10-04 03:50 GMT
అనుకున్నదే జరిగింది. నటుడు విజయ్ దేవరకొండ, నటి రష్మిక నిశ్చితార్థం జరిగింది. ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారని, డేటింగ్ లో ఉన్నారని, రేపోమాపో కలిసి కాపురం చేయబోతున్నారని ఇంతకాలం వచ్చిన వార్తలకు ఇక పుల్ స్టాప్ పడినట్టే. ఈ జంట పెళ్లి చేసుకోబితున్నారని కొన్నేళ్లగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని కూడా వార్తలొచ్చాయి. ఈ విషయాన్నీ ఈ జంట ముందు ఉంచిన ప్రతిసారి ఏదోలా తప్పించుకునే వారు.
ఇప్పుడు ఆ వార్తలు నిజమయ్యాయి. త్వరలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇరు కుటుంబాలు, కొద్ది మంది బంధువుల సమక్షంలో హైదరాబాద్‌లో ఇద్దరికీ నిశ్చితార్థం శుక్రవారం జరిగినట్టు, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోనున్నారని విజయ్ సన్నిహితుల ద్వారా తెలిసింది.
'చల్లో' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా రష్మిక తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. తదుపరి ‘గీత గోవిందం’ సినిమాతో విజయతో కలిసి నటించి హిట్ పెయిర్‌గా నిలిచారు. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’లోనూ నటించారు. ఇద్దరు రిలేషన్‌లో ఉన్నట్టు వచ్చినా స్నేహితులమనే చెప్పువారు. ఇద్దరు కలిసి టూర్స్ కి వెళ్లడం, పార్టీల్లో పాల్గోవడంతో రూమర్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు నిశ్చితార్థంతో అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు.
నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), నటి రష్మిక మందన్నా (Rashmika) వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోబోతున్నారు. హైదరాబాద్‌లోని విజయ్ స్వగృహంలో రెండు కుటుంబాల పెద్దలు ఈమేరకు అంగీకారం తెలిపారు.
గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో కలిసి నటించిన విజయ్ - రష్మిక కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. దీనిపై ఇద్దరు అధికారికంగా స్పందించకున్నా.. సామాజిక మాధ్యమాల్లో పంచుకునే పోస్ట్‌లతో పరోక్షంగా ఆ వార్తలకు బలాన్నిస్తూ వచ్చారు. ప్రస్తుతం వీరిద్దరూ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తున్నారు.