అదిరిపోయే ట్విస్ట్ లు: 'కిష్కింద కాండం' OTT మూవీ రివ్యూ!

అన్ని రకాలుగా ఫెరఫెక్ట్ మిస్టరీ థ్రిల్లర్ అనిపించుకున్న 'కిష్కింద కాండం' తాజాగా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది. కథేంటి వంటి విషయాలు చూద్దాం.

Update: 2024-11-22 09:06 GMT

మిస్టరీ థ్రిల్లర్ లు తీయడం ఎప్పుడు పెద్ద టాస్కే. మొదటి నుంచి చివరి దాకా చూసే ప్రేక్షకుడి దృష్టి పక్కకు వెళ్లకుండా , వాళ్ళ ఊహకు అందకుండా , ఊపిరి తిప్పుకోకుండా సీన్స్ డిజైన్ చేయగలిగాలి. తర్వాత ఏం జరుగుతుంది అనేది చాలా తెలివిగా నడపాల్సిన కథ,కథనం. మళయాళం సినిమా రచయితలు, దర్శకులు మొదటి నుంచి ఈ క్రాఫ్ట్ లో పండిపోయారు. అయితే ఇన్ని థ్రిల్లర్స్ వచ్చాక కొత్తదనం ప్రతీ సారీ చూడటం కష్టమైపోతోంది. కథ,కథనం తో పాటు అద్భుతమైన ఫెరఫార్మెన్స్ లు ఉంటేనే ఇప్పుడు సినిమాలు పండుతున్నాయి. అలా అన్ని రకాలుగా ఫెరఫెక్ట్ మిస్టరీ థ్రిల్లర్ అనిపించుకున్న 'కిష్కింద కాండం' తాజాగా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది. కథేంటి వంటి విషయాలు చూద్దాం.

స్టోరీ లైన్

అడవికి దగ్గరలో ఉన్న గ్రామంలో ఆర్మీలో పనిచేసి రిటైరైన అప్పూ పిళ్లై ( విజయ్ రాఘవన్) తన కొడుకు అజయ్ చంద్ర (అసిఫ్ అలీ) కోడలు ప్రవీణ (వైష్ణవి రాజ్) మనవడు చాచూ (ఆరవ్)తో కలిసి ఉంటూ ఉంటాడు. అజయ్ ఫారెస్ట్ ఆఫీసర్ . అయితే అనుకోని కొన్ని కారణాలతో ప్రవీణ చనిపోతుంది. మరో ప్రక్క మనవడు చాచూ కనిపించకుండా పోతాడు. దాంతో చాచూ ఏమయ్యాడనే ఇన్వెస్టిగేషన్ జరుగుతూంటుంది.

ఈలోగా ఎలక్షన్స్ రావటంతో లైసెన్సుడ్ గన్స్ కలిగిన వాళ్లంతా తమ గన్స్ ను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో సరెండర్ చేయాల్సి వస్తుంది. అలా స్టేషన్ నుంచి అప్పు కి కాల్ వస్తుంది. అయితే అప్పటికే అతని గన్ కనిపించకుండా పోయి చాలా రోజులవటంతో టెన్షన్ పడి, ఏం చేయాలో తోచక లాస్ట మినిట్ లో ఈ విషయాన్ని స్టేషన్ లో చెబుతాడు అజయ్ దాంతో పోలీసులు హెచ్చరిస్తారు. నీ మిస్సైన గన్ నుంచి ఒక్క బుల్లెట్ బయటికి వచ్చినా నీదే బాధ్యత అని చెప్తారు.

ఈ క్రమంలో నే అపర్ణ (అపర్ణ బాలమురళి)ని అజయ్ రెండో వివాహం చేసుకుని ఇంటికి తీసుకుని వస్తాడు. ఆమె తన మామగారు అప్పూ పిళ్లై మెమరీ లాస్ తో బాధపడుతున్నాడని అర్థం చేసుకుంటుంది. అదే క్రమంలో కనిపించకుండా పోయిన 'చాచూ' ఏమైపోయి ఉంటాడని ఆలోచన చేస్తూ ఉంటుంది. అదే సమయంలో తన మామగారి గన్ ఎలా మిస్సయ్యి ఉంటుందా అనే డౌట్ ఆమెను నిద్రపట్టనివ్వదు. ఇదంతా ఒకెత్తు అయితే అప్పూ ప్రవర్తన .. ఆయన వ్యవహార శైలి అపర్ణకు అనుమానాన్ని కలిగిస్తుంది. గన్ మాయం కావడానికీ .. 'చాచూ' కనిపించకుండా పోవడానికి ఏమైనా లింక్ ఉందా అనే సందేహం కలుగుతుంది. అప్పుడు ఆమె ఏం చేసింది. చివరకు ఏమైంది అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది

కిష్కింద కాండం ఒక అద్భుతమైన క్యారెక్టర్ డ్రామా. సినిమా టెక్ స్టోరీ టెల్లింగ్ లో ఇది ఓ కొత్త అధ్యాయం అని చెప్పాలి. ఈ స్క్రీన్ ప్లే రాసిన సినిమాటోగ్రాఫర్ బాహుల్ రమేష్ ఈ సినిమాలో నిజమైన హీరో. పేసింగ్ మరీ స్లోగానూ కాకుండా , అలాగని స్పీడ్ గా పరుగెత్తకుండా స్మూత్ గా,జెంటిల్ గా నడిపారు. ఓపెనింగ్ సీన్ లోనే మనకు కథ గురించి క్లూ ఇస్తాడు. కానీ మనం గమనించడం. స్పూన్ ఫీడింగ్ ఇచ్చినట్లు అనిపించినా ఊహించని ట్విస్ట్ లతో కథనం పరుగెట్టించారు. రెండో పెళ్లి, పిల్లాడి మిస్సింగ్ కేసు, రివాల్వర్ మిస్ అవ్వడం ఇవన్నీ కథనంలో ఫెరఫెక్ట్ గా కుదిరాయి. ఎక్కడా ప్లాష్ బ్యాక్ లకు అవకాశం ఇవ్వలేదు. ఊహకు అందినట్లుగానే ఉంటూ ఊహకు అందని సినిమా ఇది.

రామాయణంలో ప్రముఖమైన ఓ అధ్యాయం కిష్కింధకాండ. ఈ టైటిల్ తో ఓ సినిమా వచ్చిదంటే ఖచ్చితంగా క్యూరియాసిటీ కలిగిస్తుందనటంలో సందేహం లేదు. ఇది మూడు కోతులు కథ అనే ట్యాగ్ లైన్ ఉండటంతో ఇదేదో కామెడీ అనుకుంటాం. కానీ నిజానికి ఇది ఓ థ్రిల్లర్. టైటిల్ బట్టి అవకతవకలతో కూడిన పనులుతో నడుస్తుందని భావిస్తాము. అయితే అక్కడే డైరెక్టర్ మనని వేరే డైరెక్షన్ లోకి మన ఆలోచనలు మళ్లిస్తారు. మానవ స్వభావానికి, జంతు తెలివితేటలకు ఉండే వ్యత్యాసం గురించి కథ అని అర్థమవుతుంది. ఆ భావనలకు తగ్గట్లుగానే కథనం నడుస్తుంది.

కథనంలో ...అప్పూ పిళ్లై మనవడు చాచూ మిస్సై పోయినప్పటి నుంచే మనకు ఏమయ్యాడు అనే క్యూరియాసిటీ మొదలవుతుంది. సినిమా చివరి దాకా మనకు ఆ టెన్షన్ ఎలిమెంట్ ముందుకు నడిపిస్తుంది. క్లైమాక్స్ లో రివీల్ అయ్యే విషయాలు మనని ఆశ్చర్యానికి ఓ విధమైన షాక్ కు గురి చేస్తాయి. కథాంశానికి అవసరమైన డిటేల్స్ ఇవ్వటానికి ప్రతి సీన్ ని ఉపయోగించుకునే అద్భుతమైన స్క్రీన్‌ప్లే నడక మనకు కొత్త పాఠాలు నేర్పుతుంది.

ఎవరెలా చేశారు

మలయాళంలో ఈ ఏడాది ద్వితీయార్థంలో వచ్చి హిట్టైన సినిమా 'కిష్కింద కాండం' ఒకటి. దింజిత్ అయ్యతాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇది. కథ - స్క్రీన్ ప్లే ప్రధానంగా రాసుకుని తెరకెక్కించారు. రమేష్ ఫోటోగ్రఫీ .. ముజీబ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. సూరజ్ ఎడిటింగ్ అన్ని ఫెరఫెక్ట్ గా కుదిరాయి.అసిఫ్ అలీ - అపర్ణ బాలమురళి - విజయ్ రాఘవన్ పోటీపడి నటించారు.

చూడచ్చా?

సినిమాటిక్ కొత్త ఎక్స్పీరియన్స్ కోరుకునే న్యూ జనరేషన్ సినీ ప్రేమికులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. సినిమా చూసాక కొద్ది సేపు ఆలోచనలో పడిపోతారు.

ఎక్కడుంది

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగులో ఈ సినిమా ఉంది.

Tags:    

Similar News